For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాంతివంతమైన చర్మ సౌందర్యానికి పెరుగుతో ఫేస్ ప్యాక్

By Super
|

అందంగా ఉండాలని కోరుకొని వారుండరేమో! ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలనే కోరుకుంటారు. అయితే ఈ క్రమంలో కొంత ఖర్చవుతుందేమోనన్న భయం కూడా వెంటాడుతోంది. ఒక్కసారి, వంటింటిని పరిశీలిస్తే అందంగా తయారు కావడానికి అవసరమైన పదార్థాలన్నీ లభిస్తాయన్న విషయాన్ని విస్మరించకూడదు. అద్భుతమైన, కాంతివంతమైన చర్మాన్ని సొంతం చేసుకునేందుకు వంటింటిలో లభించే అత్యద్భుతమైన పదార్థాలను ఒకసారి గమనించి తీరాలి.

ప్రతి ఇంట్లో తప్పకుండా లభించే పెరుగు ముఖ్యమైన బ్యూటీ ఇంగ్రీడియెంట్ అన్న విషయం మరచిపోకూడదు. కాంతివంతమైన చర్మం కోసం ప్రయత్నిస్తుంటే, కచ్చితంగా మీ బ్యూటీ ప్యాక్స్ లో పెరుగుకి స్తానం కలిపించాలి. వెడ్డింగ్ సీజన్ లో ఆరోగ్యవంతమైన చర్మం కోసం పెరుగుకు మొదటి స్థానాన్ని కల్పించడం ప్రధానం.

పెరుగుతో

పెరుగుతో

చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా తయారు చేయడంలో పెరుగు ముఖ్యపాత్ర పోషిస్తుంది. కేవలం పెరుగునే ఫేస్ మాస్క్ గా అప్లై చేసుకున్నా మెరుగైన ఫలితముంటుంది. పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్ లు అత్యధిక స్థాయిలో లభిస్తాయి. అంతే కాకుండా, విటమిన్స్, మినరల్స్ కూడా లభిస్తాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే, పెరుగులో ఉండే యాంటి మైక్రోబియాల్ ప్రాపర్టీస్ చర్మ సమస్యలకు రెమిడీగా పని చేస్తాయి.

పెరుగుని మీ ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. పది నిమిషాల పాటు ఇలా చేయాలి. దీని వల్ల, చర్మంపైనున్న మృతకణాలు తొలగిపోతాయి. చర్మంలో తేమను పెంపొందించేందుకు, చర్మాన్ని పొడిబారనీయకుండా చేసేందుకు పెరుగు తోడ్పడుతుంది. చర్మంలోని ఎలాస్టిసిటీని సంరక్షించేందుకు కూడా పెరుగు తోడ్పడుతుంది.

దోసకాయతో పెరుగు

దోసకాయతో పెరుగు

చర్మానికి దోసకాయ, పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. చర్మాన్ని సంరక్షిస్తూ తేమను పెంపొందించే క్రమంలో పెరుగు, దోసకాయ పోషించే పాత్ర అమితం. పెరుగులోనున్న లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని పొడిబారనీయకుండా కాపాడుతుంది. అలాగే స్కిన్ టానింగ్ ను తగ్గించి పింపుల్స్ నుండి చర్మాన్ని కాపాడుతుంది.

ఇంట్లో సులభంగా తయారుచేయగలిగే ప్యాక్ ఇది. తాజాగా తురిమిన దోసకాయ గుజ్జుతో పెరుగుని కలిపి ఒక ప్యాక్ గా ప్రిపేర్ చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 20 నిముషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. పనిలోపనిగా రెండు దోసకాయ ముక్కలను కళ్లపై ఉంచుకోవడం మరచిపోకండి. కళ్ళకి కూలింగ్ ఎఫెక్ట్ ను కలిగించడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది.

ఓట్స్+తేనె+పెరుగు

ఓట్స్+తేనె+పెరుగు

అన్ని రకాల చర్మాలకు ఈ ఫేస్ ప్యాక్ సూట్ అవుతుంది. చర్మానికి తేమను అందించి మృత కణాలను తొలగించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. స్పష్టమైన, మచ్చలు లేని చర్మాన్ని కోరుకునేవారు ఈ ఫేస్ ప్యాక్ ను తప్పక ప్రయత్నించి తీరాలి. ఓట్ మీల్, పెరుగు, తేనెను సమాన మోతాదులో తీసుకుని ముఖంపై అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీళ్ళను ముఖంపై జల్లుకుని శుభ్రంగా కడగాలి.

ఎగ్ వైట్+పెరుగు

ఎగ్ వైట్+పెరుగు

ఎగ్ వైట్స్ కేవలం శరీరానికే కాదు మీ చర్మానికి కూడా మేలు చేస్తాయి. చర్మ సౌందర్యాన్ని సంరక్షించే విటమిన్స్ మరియు మినరల్స్ ను పుష్కలంగా కలిగిన ఎగ్ వైట్ చర్మానికి మేలు కలిగిస్తుంది. దీనిని పెరుగుతో కలిపితే మరిన్ని మెరుగైన ఫలితాలను గమనించవచ్చు. ఒక ఎగ్ వైట్ లో కొంచెం పెరుగుని కలిపి ఫేస్ ప్యాక్ ను ప్రిపేర్ చేసుకోవాలి. సున్నితంగా ముఖంపై ఈ ఫేస్ ప్యాక్ ను అప్లై చేసుకోవాలి. 15-20 నిమిషాల తరువాత నీళ్ళతో ఈ ఫేస్ ప్యాక్ ను తొలగించాలి. ఆ తరువాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

స్ట్రాబెర్రీ+పెరుగు

స్ట్రాబెర్రీ+పెరుగు

ఈ ఇంగ్రీడియెంట్స్ వినడానికి నోరూరించే విధంగా ఉన్నాయి కదూ? ఇవి అందాన్ని పెంపొందించడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. చర్మానికి నిగారింపుని కలిగించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. చర్మాన్ని కాంతివంతం చేయడానికి ఇవి తోడ్పడతాయి. రెండు మ్యాష్ చేసిన స్ట్రాబెర్రీస్ లో ఒక టీస్పూన్ తేనెను, ఒక టీస్పూన్ పెరుగును కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ను ముఖంపై అప్లై చేయాలి. కనీసం 15-20 నిమిషాల పాటు ఈ ప్యాక్ ను ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో ఈ ప్యాక్ ను సున్నితంగా తొలగించాలి. ఆ తరువాత నేచురల్ మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం మరవకూడదు.

టమాటో+తేనె+పెరుగు

టమాటో+తేనె+పెరుగు

పెరుగులోని తేనెలోని కలిగిన మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ ను టమాటోలలో కలిగిన స్కిన్ బ్రైటెనింగ్ ప్రాపర్టీస్ తో కలిపితే ఆకర్షణీయమైన చర్మం మీ సొంతం. ఈ ఫేస్ ప్యాక్ అన్ని రకాల చర్మాలకు సూట్ అవుతుంది. ఒక టమాటో పల్ప్ ను ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ పెరుగుతో కలిపి ఫేస్ ప్యాక్ ను సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మీ ముఖంపై అప్లై చేసుకుని 15-20 నిముషాలు ఉంచాలి. తేనె బదులు ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను కూడా కలపవచ్చు. చర్మానికి కాంతిని కలిగించేందుకు ఆల్మండ్ ఆయిల్ లో కలిగిన విటమిన్స్ తోడ్పడతాయి.

అవోకాడో+ఆలివ్ ఆయిల్+పెరుగు

అవోకాడో+ఆలివ్ ఆయిల్+పెరుగు

పొడి చర్మంతో బాధపడేవారికి ఈ ఫేస్ ప్యాక్ ఒక వరంలా కనిపిస్తుంది. అవోకాడోలోనున్న తేమ కలిగించే లక్షణాలు చర్మానికి నిగారింపు కలిగిస్తాయి. పెరుగులోనున్న గుణాలు పొడిచర్మం సమస్యను తగ్గిస్తాయి.

హాఫ్ అవకాడోను తీసుకుని మ్యాష్ చేసి అందులో ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను, ఒక టీస్పూన్ పెరుగును కలిపి పేస్ట్ గా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు, ఈ ప్యాక్ ను ముఖంపై అప్లై చేయాలి. దాదాపు 10-15 నిమిషాల తరువాత ఈ ప్యాక్ ను తొలగిస్తే నిగారింపు కలిగిన మృదువైన చర్మం మీ సొంతం.

ఆపిల్+తేనె+పెరుగు

ఆపిల్+తేనె+పెరుగు

ఆపిల్ లో స్కిన్ ఫ్రెండ్లీ విటమిన్స్ మెండుగా ఉంటాయి. ఇవి చర్మానికి తిరిగి జీవం పోయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. తేనె, పెరుగుతో ఆపిల్ ను కలిపితే చర్మానికి అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి.

ఒక ఆపిల్ ను తీసుకుని పీల్ చేసి తురుముకోవాలి. ఇప్పుడు ఒక టీస్పూన్ పెరుగును, ఒక టీస్పూన్ తేనెను కలపాలి. ముఖానికి సున్నితంగా అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ఆరిన తరువాత సున్నితంగా తొలగించాలి. తరచూ ఈ ప్యాక్ అప్లై చేయడంద్వారా కోమలమైన చర్మం మీ సొంతమవుతుంది. గ్రీన్ ఆపిల్ ను కూడా ఈ ఫేస్ ప్యాక్ లో వాడవచ్చు.

ఆరెంజ్ + పెరుగు

ఆరెంజ్ + పెరుగు

చర్మానికి నిగారింపుని కలిగించి కాంతివంతంగా తయారు చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుంది. అరేంజ్ లోనున్న గుణాలు చర్మానికి సంరక్షించేందుకు తోడ్పడతాయి. కొంచెం అరేంజ్ జ్యూస్ లో పెరుగుని కలిపి మీ ఫేస్ పై అప్లై చేయాలి. 10-15 నిమిషాల వరకు ఈ ఫేస్ ప్యాక్ ను ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చటి నీళ్ళతో ఈ ప్యాక్ ను తొలగించాలి. స్కిన్ ట్యాన్ ను తొలగించేందుకు ఈ ఫేస్ ప్యాక్ లో కొంచెం తేనెను కూడా కలపవచ్చు.

మ్యాంగో + పెరుగు

మ్యాంగో + పెరుగు

ఫేస్ ప్యాక్ ల గురించి మాట్లాడుకునేటప్పుడు మామిడి పళ్ళను మరచిపోలేము. ఇందులోనున్న విటమిన్స్, యాంటి ఆక్సిడెంట్స్ చర్మాన్ని అందంగా మార్చేందుకు ఉపయోగపడతాయి. స్కిన్ ఏజింగ్ ను కాపాడేందుకు మ్యాంగో తోడ్పడుతుంది.

రెండు మూడు స్పూన్స్ పెరుగులో సగం మామిడి పండు గుజ్జును కలిపి పేస్ట్ లా ప్రిపేర్ చేయండి. ఈ రెండు పదార్థాలు చర్మాన్ని నిగారింపు చేయడానికి ఉపయోగపడతాయి.

పసుపు + పెరుగు

పసుపు + పెరుగు

ఈ ఫేస్ ప్యాక్ ద్వారా అత్యద్భుతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. కొద్దిగా పసుపును పెరుగును కలిపి తయారు చేసిన ఫేస్ ప్యాక్ ను అప్లై చేయడం ద్వారా నిగారింపు కలిగిన కాంతివంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. పింపుల్స్ సమస్య కూడా తొలగిపోతుంది. ఏజింగ్ సైన్స్ ను నివారిస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ పసుపులో మూడు టేబుల్ స్పూన్ పెరుగును కలిగ్పి పేస్ట్ లా తయారు చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత ఈ ఫేస్ ప్యాక్ ను తొలగించాలి. కోమలమైన చర్మంకోసం ఈ ఫేస్ ప్యాక్ లో కొద్దిగా తేనెను కూడా జోడించవచ్చు.

English summary

11 Homemade Curd Face Packs to Get Glowing and Healthy Skin


 Everyone wants to look beautiful, however there is always a cost associated with it right? Wrong! With so many wonderful ingredients readily available in your kitchen, there is no reason to look for cosmetic products to get that wonderful glow.
Desktop Bottom Promotion