For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ సౌందర్యంను & చర్మ కాంతిని పెంచే హోం మేడ్ క్రీమ్స్

|

ముఖం కాంతివంతంగా మరియు ఫ్రెష్ గా ఉంటేనే చూడటానికి అందంగా ఉంటుంది. లేదంటే, నిర్జీవంగా, నల్లని వలయాలు, ముఖం మీద మచ్చలు, మొటిమలు ఉంటే? ముఖం చూడటానికి చాలా అసహ్యంగా కనబడుతుంది. మీ డార్క్ స్కిన్ చూసిచూసి మీరు కూడా విసుగు చెందారా? మీ సమాధానం అవును అన్నట్లైతే, మనకు అందుబాటులో ఉండే కొన్ని స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ ను మనం ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోచ్చు. ఈ నేచురల్ క్రీమ్ రిసిపిలు అన్ని రకాల చర్మతత్వాలకు సహాయపడుతుంది. వీటిని మీ లిస్ట్ లో చేర్చుకొన్నట్లైతే మీ చర్మ సమస్యలన్నీని మాయం చేసుకోవచ్చు.

చర్మానికి హోం మేడ్ వైటనింగ్ క్రీమ్స్ ను ఉపయోగిస్తున్నారు. వీటిని ఆయుర్వేదిక్ కాలం నుండి ప్రతి యొక్క ఇండియన్ మహిళ ఇష్టపడుతున్నారు. అయితే ప్రస్తుత మోడ్రన్ యుగంలో వీటిని ఉపయోగించడం ఒక మన్నికైన మరియు సురక్షితమైన పద్దతి. ముఖ్యంగా పెరుగును చర్మ సంరక్షణ కొరకు విరివిగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే, ఇది ఒక నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్. పెరుగు మాత్రమే కాదు, మన ఇంట్లో మనకు అందుబాటులో ఇతర పదార్థాలను కూడా ఉపయోగించి ఫర్ఫెక్ట్ హోం మేడ్ వైటనింగ్ క్రీమ్ ను తయారుచేసుకోవచ్చు.

ఈ రోజు మీకోసం, మీ చర్మ సౌందర్యం పెంపొందించుకోవడం కోసం boldsky.com, 12 నేచురల్ ఈజీ స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ ను పరిచయం చేస్తోంది . ఇవి మీ చర్మం మీద చాల ఎఫెక్టివ్ గా పనిచేసి, 6 వారాల్లో మంచి ఫలితాలను అంధిస్తుంది. మరి దేనికోసం ఎదురుచూస్తున్నారు? ఈ సింపుల్ స్కిన్ వైటనింగ్ టిప్స్ ను అనుసరించి మీ స్కిన్ టోన్ ను వెంటనే మార్చేసుకోండి...

టమోటో మరియు పెరుగు క్రీమ్

టమోటో మరియు పెరుగు క్రీమ్

బాగా పండిన ఎర్రని టమోటోలను తీసుకొని, గిజలు తొలగించి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ లో కొద్దిగా తేనె మరియు రెండు చెంచాలి పెరుగు మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేసి చర్మంకు అప్లై చేసి డ్రై అయిన తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

డ్రై ఆరెంజ్ పీల్ మరియు పెరుగు క్రీమ్

డ్రై ఆరెంజ్ పీల్ మరియు పెరుగు క్రీమ్

ఎండిని ఆరెంజ్ తొక్కను మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక బౌల్లో తాజాగా చల్లగా ఉండే పెరుగు తీసుకినొ, అందులో ఆరెంజ్ తొక్క యొక్క పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ముఖం మీద పైనుండి క్రిందికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి.

లెమన్ పీల్ మరియు పెరుగు క్రీమ్

లెమన్ పీల్ మరియు పెరుగు క్రీమ్

మనం ఇంట్లో తయారుచేసుకోగలిగే మరో ఉత్తమ స్కిన్ వైటనింగ్ క్రీమ్ నిమ్మ తొక్క మరియు పెరుగు. ఆరెంజ్ తొక్క పెరుగు క్రీమ్ ను ఏవిధంగా తయారుచేసి, ఉపయోగించామో అదే విధంగా నిమ్మతొక్కను ఉపయోగించి క్రీమ్ తయారుచేసుకోవాలి.

పెరుగు మరియు తేనె క్రీమ్

పెరుగు మరియు తేనె క్రీమ్

పెరుగు వలే, తేనె కూడా చర్మానికి చాలా మంచిది. ఈ రెండు మిశ్రమంతో చిక్కగా క్రీమ్ లా చేసి, ముఖానికి అప్లై చేయాలి. ఈ క్రీమ్ ముఖం మీద కనీసం అరగంట పాటు ఉండనిచ్చి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఓల్ మీల్ మరియు పెరుగు

ఓల్ మీల్ మరియు పెరుగు

ఒక కప్పు పెరుగులో 3చెంచాలా ఓట్ మీల్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ రెండు పదార్థాలను బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. ఎండిన తర్వాత , బాగా మసాజ్ చేసి తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

ఆపిల్ మరియు పెరుగు క్రీమ్

ఆపిల్ మరియు పెరుగు క్రీమ్

ఆపిల్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, మిక్స్ లో వేసి, మెత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని ఒక కప్పు పెరుగులో మిక్స్ చేసి చిక్కగా పేస్ట్ లా అయ్యే వరకూ గిలకొట్టాలి. అంతే నేచురల్ హోం మేడ్ ఆపిల్ క్రీమ్ రెడీ. ఈ క్రీమ్ ను ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రంచేసుకుంటే, ముఖానికి రేడింట్ గ్లో అందిస్తుంది.

బంగాళదుంప మరియు పెరుగు

బంగాళదుంప మరియు పెరుగు

ఆపిల్ ను ఏవిధంగా ఉపయోగించామో , అదే విధంగా బంగాళదుంపను కూడా ఉపయోగించి మాస్క్ వేసుకోవాలి.

పసుపు మరియు పెరుగు క్రీమ్

పసుపు మరియు పెరుగు క్రీమ్

ఒ చెంచా పసుపు లో రెండు చెంచాలి పెరుగు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది . మీ స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.ః

పచ్చిబొప్పాయి మరియు పెరుగు క్రీమ్

పచ్చిబొప్పాయి మరియు పెరుగు క్రీమ్

పచ్చిబొప్పాయిని మెత్తగా గుజ్జులా చేసి అందులో చిక్కటి పెరుగు వేసి క్రీమ్ లో చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం ద్వారా చర్మ కాంతి మెరుగుపడుతుంది. ముఖం శుభ్రం చేసుకొన్న తర్వాత కొబ్బరి నూనెను కొద్దిగా అప్లై చేయాలి . ఇలా చేయడం వల్ల మొటిమలు ఏర్పడకుండా సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీ మరియు పెరుగు

స్ట్రాబెర్రీ మరియు పెరుగు

స్ట్రాబెర్రీని మెత్తగా పేస్ట్ చేసి అందులో నాలుగు చెంచాలా పెరుగు మిక్స్ చేసి, కొద్దిగా నిమ్మరసం జోడించి బాగా మిక్స్ చేసి క్రీమ్ లా అయిన తర్వాత ముఖానికి, మెడకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల ఇన్ స్టాంట్ గ్లో వస్తుంది.

కివి, నిమ్మ మరియు టమోటో సాస్

కివి, నిమ్మ మరియు టమోటో సాస్

కివిపండును మెత్తగా చేసి, అందులో నిమ్మరసం, పెరుగు వేసి మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఈ స్కిన్ వైటనింగ్ హోం మేడ్ రిసిపిని ముఖం, మెడకు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే, తక్షణం స్కిన్ టోన్ లో మార్పువస్తుంది.

బేకింగ్ పౌడర్ మరియు పెరుగు క్రీమ్

బేకింగ్ పౌడర్ మరియు పెరుగు క్రీమ్

బేకింగ్ పౌడర్ కు కొద్దిగా పెరుగు మిక్స్ చేసి ముఖానికి పట్టించడం వల్ల ఇది నేచురల్ గ్లోను అందిస్తుంది.

English summary

12 Natural Skin Whitening Creams

Tired of looking at your face in the mirror filled with blemishes, dark circles and acne scars? Are you also tired of looking at your dark skin? If yes, then here are some of the best natural skin whitening creams you can make at home. These natural cream recipes are for all types of skin, so you can tick that off your list if it has been a problem for you.
Story first published: Wednesday, February 11, 2015, 18:12 [IST]
Desktop Bottom Promotion