Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
15 నిమిషాలు కేటాయిస్తే చాలు.. మొటిమలు, మచ్చలు బై బై
టీనేజ్, యంగేజ్ అంటే.. మొటిమల బెడద చాలా ఎక్కువ. వాటిని పోగొట్టుకోవడానికి యువత చాలా ఇబ్బందులు పడుతుంటుంది. క్రీములు, సోపులు మారుస్తూ.. రకరకాలప్రయోగాలు చేసి చేసి విసిగిపోతుంటారు. కానీ.. మొటిమలు నివారించడానికి ఇంట్లోనే చక్కటి పరిష్కారాలున్నాయి. సహజంగా తయారు చేసుకునే ఈ ప్యాక్ ల ద్వారా.. మొటిమలతో పాటు, వాటి తాలూకు మచ్చలు కూడా మాయమౌతాయి.
స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగాలు అంటూ.. పిల్లలు, పెద్దలు అందరూ పరుగులు పెడుతుంటారు. దీంతో ఇంట్లో ప్యాక్ లు వేసుకునేంత టైం ఎక్కడుంది అని ఫీలవుతుంటారు. ఇలా బిజీగా ఉండే వాళ్లు కేవలం 15 నిమిషాలు చర్మ సంరక్షణకు కేటాయిస్తే చాలు.. మొటిమలకు గుడ్ బై చెప్పవచ్చు. సహజంగా.. సింపుల్ గా ఇంట్లో తయారు చేసుకునే చక్కటి ప్యాక్ లు ఏంటో మీరే చూడండి.

లెమన్
నిత్యం ఇంట్లో ఉపయోగించే వస్తువులతోనే ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఒక నిమ్మకాయను కట్ చేసి.. రసం తీసుకోవాలి. అందులో.. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, మరో టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలపై రాసి.. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

టమోటా
రెండు టేబుల్ స్పూన్ల టమోటా రసం, ఒక టేబుల్ స్పూన్ తేనె, సగం టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుని అన్నింటిని కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ని మొటిమపై రాసి.. 10 నిమిషాలు వదిలేయాలి. తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఈ చిట్కాని వారం రోజులు పాటించినట్లైతే.. మొటిమలు తగ్గిపోతాయి.

పసుపు
పసుపు యాంటీసెప్టిక్ గానే కాకుండా.. సహజ మందులా చర్మసమస్యలతో పోరాడుతుంది. చిటికెడు పసుపు తీసుకుని దానికి ఒక టేబుల్ స్పూన్ పాలు, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలిపి మొటిమలపై రాస్తే సరి. దీనిని తరచుగా రాస్తూ ఉంటే మొటిమలే కాకుండా మచ్చలు కూడా మాయమౌతాయి.

తేనె:
చర్మంలో మొటిమలను నివారించుకోవడానికి మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ తేనె. తేనెను గోరువెచ్చగా చేసి, గోరువెచ్చగా ఉన్నప్పుడే మొటిమల మీద అప్లై చేయాలి. తేనె డ్రై అయిన తర్వాత దాని మీదే కోల్డ్ మిల్క్ క్రీమ్ ను అప్లై చేసి డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ఒక వారంలో పింపుల్స్ మాయం అవుతాయి.

బేకింగ్ సోడా
వంటకాల్లో ఉపయోగించే బేకింగ్ సోడా.. అందరి చర్మ తత్వాలకు సరిపోదు. కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. బేకింగ్ సోడా మీ చర్మతత్వానికి సరిపోతే.. ఈ చిట్కా ప్రయత్నించండి. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుని.. రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీన్ని పింపుల్ పై అప్లై చేసి.. 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. సింపుల్ అండ్ టైమ్ సేవింగ్ హోమ్ రెమిడీస్ ను ఫాలో అవండి. ముఖంపై మొటిమలు, మచ్చలు లేకుండా కాంతివంతంగా మెరవండి.



Click it and Unblock the Notifications