Latest Updates
-
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.!
ఈ వింటర్ సీజన్లో గుర్తించుకోవల్సిన 15 వింటర్ స్కిన్ కేర్ టీప్స్ ..!
శీతాకాలం వచ్చిందంటే చర్మ సమస్యలు పెరిగిపోతుంటాయి. చలికాలంలో ఒంటికి పగుళ్లు వచ్చి.. ఇరిటేషన్ కలగడం సహజం. చల్లని గాలుల వాతావరణం చర్మం మీద ప్రసరించి చర్మ సౌందర్యానికి హాని కలిగిస్తుంది. ముఖ్యంగా పెదాలు, ముఖం, పాదాలు, కురులపై చలిగాలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పొడిపారినట్లు ఉండటమే కాకుండా దురద కూడా ఉంటుంది. పెదాలు పగులుతాయి. ముఖం మీద మచ్చలు ఏర్పడతాయి. పాదాల చివర పగుళ్లు వస్తాయి. శిరోజాలు చిట్లిపోయి రాలిపోతాయి.
చర్మానికి ఏర్పడే ఇటువంటి మార్పుల వల్ల సౌందర్యానికి అవరోధం కలిగి చర్మం బిగుసెక్కి ముఖం అంధవికారంగా కనిపిస్తుంది. అందుకే చలికాలంలో చర్మంతో పాటు జుట్టు సంరక్షణ కూడా చాలా అవసరం. లేకపోతే చుండ్రు, జిడ్డు సమస్యలు అధికమై జుట్టు బలహీనమై జీవం కోల్పోతుంది. పీచులా తయారవుతుంది. అందుకనే జుట్టు పట్టుకుచ్చులా జాలువారాలంటే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తే కురులకు రక్షణ కల్పించుకోవచ్చు. దీన్ని నివారించడానికి సులభమైన చిట్కాలు పాటిస్తే నునుపైన చర్మం సొంతం చేసుకోవచ్చు.

1. గులాబీ-తులసి ఆకులు:
చలి ఎంతగా ఉన్నా స్నానం చేయడం మాత్రం మరవొద్దు. గులాబీ, తులసి ఆకులను గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మెరవడానికి సహాయపడుతుంది.

2. పాలు-గోధుమపిండి:
కాచిన పాలలో గోధుమపిండి కలుపుకొని స్క్రబ్‌లా తయారుచేసి ముఖానికి రుద్దుకుంటే చర్మం శుభ్రపడుతుంది.

3. శెనగపిండి-తేనె:
ఒక టేబుల్ స్పూను శనగపిండిలో అర టీ స్పూను తేనె, ఒక టీ స్పూను పాలమీగడ, రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసి ఆరిన తర్వాత కడగాలి.

4. తేనె -నిమ్మరసం:
అందమైన అధరాల కోసం చలికాలంలో తేనె, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్‌లను గ్లిజరిన్‌తో కలిపి పెదాలపై రాసుకోవాలి. తర్వాత స్ట్రాబెర్రీ, స్కిమ్డ్ మిల్క్, తేనెలను కలుపుకొని పెదాలకు రాసుకోవాలి.

5. మోచేతుల మెరుపు:
చాలామంది మహిళలకు మోచేతులు.. మోకాళ్లు నల్లగా, మొద్దుగా మారతాయి. వీటిని నివారించడానికి బాగా పండిన అరటిపండ్లను మెత్తగా చిదిమి అందులో చక్కెర వేసి మోచేతులకు, మోకాళ్లకు రాయాలి.

6. గుడ్డులోని పచ్చ సొన
కోడిగుడ్డుపై పెంకు కొద్దిగా తొలగించి తెల్ల సొన ఒక పాత్రలో, పసుపు సొన మరో పాత్రలో వేయాలి. పసుపుసొనలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ పాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, కనీసం 15 నిమిషాలైన ఉంచాలి. తర్వాత నీళ్లతో శుభ్రపరుచుకోవాలి.

7. ఆలివ్ ఆయిల్:
చలికి చర్మం వడలినట్టుగా ఉండి దురదగా అనిపిస్తే ఆలివ్ ఆయిల్‌ని వంటికి పట్టించి పెసరపిండితో నలుగుపెట్టుకుని స్నానం చెయ్యాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం పొడిబారడం తగ్గి కాంతివంతంగా ఉంటుంది.

8. రోజ్ వాటర్
ఒక చిన్న పాత్రలో రోజ్‌వాటర్ టీ స్పూన్, అంతే పరిమాణంలో తేనె కలిపి ముఖానికి రాసి, మృదువుగా మసాజ్ చేసి, తర్వాత శుభ్రపరచాలి. ఇది పొడి చర్మానికి సరైన చికిత్స. చర్మం త్వరగా శుభ్రపడుతుంది. కాంతి పెరుగుతుంది.

9. నూనెతో మర్దన!
కొబ్బరి నూనె, వంటనూనె, మర్దనా నూనెలలు చాలా వరకు ఇళ్లలో ఉంటాయి. ఈ మధ్యలో ఆలివ్ , ఆల్మండ్ ఆయిల్స కూడా ఆరోగ్యానికి, అందానికి ఉపయోగిస్తున్నారు. స్నానానికి ముందు ఏదైనా నూనెతో చర్మానికి పట్టించి, మర్దనా చేసుకోవాలి. గోళ్లకు కూడా మర్దనా చే సి, పది-పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ లభించి, ముందు పొడిగా ఉన్న చర్మం తర్వాత మృదువుగా మారిపోతుంది.

10. పండ్లు
బొప్పాయి, అరటిపండును గుజ్జు చేసి, ఈ రెంటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించాలి. మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. పొడిబారిన చర్మాన్ని ఈ ప్యాక్ మృదువుగా మారుస్తుంది.

11. పసుపు :
పసుపు పొడి, చందనం, పాలు, బాదం ఆయిల్, నిమ్మరసం, కోడిగుడ్డు తెల్లసొనను బాగా కలిపి ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోండి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మీ చర్మం మెరిసిపోతుంది.

12. తేనె :
ఒక స్పూన్ పాల పౌడర్, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం, బాదం నూనెను బాగా పేస్‌టలా కలుపుకుని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్‌తో మీ చర్మం మౄఎదువుగా కోమలంగా తయారవుతుంది.

13. ఓట్స్ :
ఓట్స్, పెరుగు, టమోటా జ్యూస్‌ను బాగా కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేస్తే మీ చర్మం కాంతివంతమవుతుంది.

14. బాదం :
బాదం పప్పుల్ని నీటిలో నానబెట్టి మిక్సీలో పేస్‌టలా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో కాస్త మినప్పిండి, పాలు, నిమ్మరసం చేర్చి రెండు వారాల పాటు ముఖానికి రాసుకుంటే మీరు బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.

15. పాలు-తేనె:
పాలు, తేనె సమపాళ్లలో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాస్తుంటే చర్మం కాంతివంతమవుతుంది. పొడి చర్మానికి క్రమం తప్పకుండా ప్రతిరోజు ఈ ప్యాక్ వేస్తుంటే చర్మం కాంతివంతమవుతుంది.



Click it and Unblock the Notifications