For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

30లోకి ఎంట‌ర్ అవుతున్నారా ? ఐతే బ్యూటీ కేర్ కంప‌ల్సరీ..

By Nutheti
|

ముఖ‌వ‌ర్చ‌స్సు కోసం అమ్మాయిలు త‌ప‌న‌ప‌డ‌టం స‌హ‌జం. ముప్పైలోకి అడుగుపెడుతున్నారంటే.. అతివ‌ల్లో ఆందోళ‌న మొద‌ల‌వుతుంది. చ‌ర్మ కాంతి కోసం ఆ క్రీములు.. ఈ ప్యాక్‌లు అంటూ మార్కెట్‌లో వేట మొద‌లుపెడ‌తారు. మార్కెట్‌లో దొరికే కెమిక‌ల్ క్రీముల‌కంటే.. హోమ్‌మేడ్ ప్యాక్‌లు అందంతోపాటు.. స‌హ‌జ మెరుపును ఇస్తాయి.

ముప్పైకి చేరువ‌వుతుండ‌గానే చ‌ర్మ ర‌క్ష‌ణ‌పై జాగ్ర‌త్త ప‌డాలి. లేదంటే.. ముడ‌త‌లు, ఏజింగ్ స్పాట్స్.. చ‌ర్మం వ‌దులుగా అవ‌డం వంటి స‌మ‌స్య‌లు ముఖ‌వ‌ర్చ‌స్సుపై ప్ర‌భావం చూపుతాయి. మారుతున్న జీవ‌న‌శైలి, ప‌ర్యావ‌ర‌ణం, ఆహారం, ఒత్తిడి, నిద్ర‌లేమితోపాటు అజాగ్ర‌త్త ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు.

ఇంట్లో ఫేస్‌ప్యాక్‌లు త‌యారుచేసుకోవ‌డానికి బ‌ద్దకిస్తూ.. చాలామంది పార్ల‌ర్స్‌, సెలూల్‌ల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్లు వాడే కెమిక‌ల్ క్రీముల వ‌ల్ల స్కిన్ మ‌రింత డ్యామేజ్ అయ్యే అవ‌కాశ‌ముంది. అందుకే ఇంట్లోనే త‌యారుచేసుకునే సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ప్యాక్స్ మీకోసం..

నిమ్మ‌రసం

నిమ్మ‌రసం

నిమ్మ‌ర‌సం, గ్లిజ‌రిన్ సౌంద‌ర్య సాధ‌నాలుగా ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఒక స్పూన్ గ్లిజ‌రిన్, ఒక స్పూన్ నిమ్మ‌ర‌సం, ఒక స్పూన్ రోజ్ వాట‌ర్.. తీసుకుని వీటిని బాగా క‌లుపుకుని మిశ్ర‌మంలా త‌యారు చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి, మెడ‌కి ప‌ది నిమిషాల‌పాటు మ‌సాజ్ చేసుకోవాలి. 20 నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌ని నీటితో క‌డిగేసుకుంటే.. మీ ముఖం కాంతిలీనుతుంది.

ఓట్‌మీల్‌

ఓట్‌మీల్‌

ముందుగా ముఖాన్నిరోజ్ వాట‌ర్‌లో ముంచిన దూదితో తుడుచుకోవాలి. త‌ర్వాత ఓట్‌మీల్‌తో ముఖాన్ని ప‌దినిమిషాల‌పాటు బాగా రుద్దుకోవాలి. త‌ర్వాత ముఖాన్ని శుభ్రంచేసుకుని.. దోస‌కాయ ముక్క‌ల‌తో మ‌రోసారి ఫేస్‌ను మ‌సాజ్ చేయాలి. ఆ త‌ర్వాత మాయిశ్చ‌రైజ‌ర్ అప్లై చేసుకుంటే.. ఉద‌యానిక‌ల్లా మీ ముఖవ‌ర్చ‌స్సు పెరుగుతుంది.

పాల మీడ‌గ

పాల మీడ‌గ

పాల మీడ‌గ స‌హ‌జ సౌంద‌ర్యాన్ని ఇనుమ‌డింప‌జేస్తుంది. మీగ‌డ‌కు రోజ్‌వాట‌ర్ జోడిస్తే అద్భుత‌మైన ఫేస్ ప్యాక్ త‌యార‌వుతుంది. ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున మీడ‌గ‌, రోజ్‌వాట‌ర్ మిశ్ర‌మాన్ని క‌లుపుకోవాలి. ఐదు నిమిషాల‌పాటు ఈ మిశ్ర‌మంతో... ముఖానికి మ‌సాజ్ చేసుకుని.. 15 నిమిషాలపాటు ఆర‌నివ్వాలి. త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో క‌డిగేసుకుంటే చాలు. త‌ర‌చూ ఇలా చేస్తుంటే కాంతివంత‌మైన చ‌ర్మం మీ సొంత‌మవుతుంది.

రోజ్ వాట‌ర్

రోజ్ వాట‌ర్

విట‌మిన్ ఈ లోని స‌ద్గుణాలు.. ముఖ వ‌ర్చ‌స్సును పెంపొందిస్తాయి. రెండు విట‌మిన్ ఈ ట్యాబ్‌లెట్ల‌కు.. ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్ క‌లిపి మిశ్ర‌మంలా త‌యారు చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కి ప‌ట్టించి 15 నిమిషాలు బాగా మ‌సాజ్ చేయాలి. ఈ ప్యాక్ మంచి మాయిశ్య‌రైజ‌ర్‌లా ప‌నిచేస్తుంది.

గుడ్డులోని తెల్ల‌సొన‌

గుడ్డులోని తెల్ల‌సొన‌

తిన‌డానికి రుచిక‌రంగానే కాకుండా.. మాయిశ్చ‌రైజ‌ర్‌లాను పెరుగు ఉప‌యోగ‌ప‌డుతుంది. కోడిగుడ్డులోని తెల్ల‌సొన‌కు రెండు స్పూన్ల పెరుగును జోడించి ప్యాక్ వేసుకుంటే.. అంద‌మైన చ‌ర్మం మీ సొంత‌మ‌వుతుంది. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని.. 15 నిమిషాల త‌ర్వాత క‌డిగేసుకుంటే... చ‌ర్మ‌కాంతి పెరుగుతుంది.

క‌ల‌బంద‌

క‌ల‌బంద‌

సౌంద‌ర్య‌సాధ‌నాల్లో క‌ల‌బంద‌కు ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. ఒక స్పూన్ క‌లబంద గుజ్జుకి.. మ‌రో స్పూన్ ఆలివ్ ఆయిన్ క‌లిపి.. ముఖానికి, మెడ‌కి మ‌సాజ్ చేయాలి. లేదంటే ప‌డుకునే ముందు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని ఉద‌యాన్నే క‌డిగేసుకున్నా... స‌రిపోతుంది. ఈ ప్యాక్ ముఖంపై మ‌చ్చ‌లు, మొటిమ‌ల‌ను మాయం చేసి.. కాంతివంత‌మైన చ‌ర్మాన్ని మీకిస్తుంది.

శ‌న‌గ‌పిండి

శ‌న‌గ‌పిండి

శ‌న‌గ‌పిండి చ‌ర్మాన్ని మృదువుగా.. కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. ఒక స్పూన్ శ‌న‌గ‌పిండికి... ఒక స్పూన్ పెరుగు క‌లిపి మిశ్ర‌మంలా త‌యారు చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాలు అలా వ‌దిలేయాలి. త‌ర్వాత చ‌ల్ల‌టి నీళ్ల‌తో క‌డిగేసుకుంటే.. చ‌ర్మం మృదువుగానే కాకుండా.. గ్లోయింగ్‌గా త‌యార‌వుతుంది.

English summary

Get An Instant Glow With These Face Packs

Face packs are the best way to impart your skin with that luminous, wonderful glow apart from a healthy diet. Of course, it can not eradicate the importance of a good diet regimen that makes your skin healthy from the inside, yet if you need your skin to look radiant instantly, face packs can offer you a good solution.
Story first published: Saturday, December 26, 2015, 9:35 [IST]
Desktop Bottom Promotion