For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మంపై దురదలు వేధిస్తున్నాయా ? పరిష్కారాలివిగో..

By Nutheti
|

వాతావరణంలో మార్పులు చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. శీతాకాలం వచ్చిందంటే చాలు.. చర్మం పొడిబారిపోయి తీవ్రంగా దురదలు వేధిస్తాయి. ఎన్ని క్రీములు వాడినా దురదలు తగ్గిపోవు. కొన్ని సందర్భాల్లో సోపులు, సూర్యరశ్మి, క్రీములు, పర్ఫ్యూమ్స్ చర్మంపై దురదలకు కారణమౌతాయి.

READ MORE: మేనికాంతిని పెంచే 9 యోగ భంగిమలు

కారణమేదైనా చర్మంపై వచ్చే దురదలు.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. వాటిని రబ్ చేయడం వల్ల మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. వీటి నుంచి ఉపశమనం పొందడానికి ఇంట్లో ఉండే ఔషధాలతో.. ఈజీగా ఉపశమనం పొందవచ్చు. చర్మంపై దురదలు పోగొట్టుకోవడానికి సహజ మార్గాలేంటో చూద్దాం.

కలబంద

కలబంద

సహజసిద్ధంగా లభించే ఔషధాల్లో కలబంద ఒకటి. ఇది చర్మాన్ని మృదువుగా మార్చడమే కాకుండా.. చర్మానికి కావాల్సిన తేమని అందిస్తుంది. దీన్ని చర్మంపై దురద ఉన్న ప్రాంతంలో రాయడం వల్ల దురదలు తగ్గిపోయి... రిలాక్స్ గా అనిపిస్తుంది.

నిమ్మకాయ

నిమ్మకాయ

చర్మంపై వేధించే దురదలకు చక్కటి పరిష్కారం నిమ్మకాయ. ఇందులో విటమిన్ సీ తోపాటు బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మంపై దురదలను వెంటనే తగ్గిస్తాయి. కాబట్టి దురగా అనిపించిన వెంటనే కాస్త నిమ్మరసం తీసుకుని.. రాయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

చర్మం పొడిబారినప్పుడు కూడా దురదల సమస్యలు ఎక్కువౌతూ ఉంటాయి. పొడిబారిన చర్మానికి కొబ్బరినూనె బాగా పనిచేస్తుంది. దురగా ఉన్న ప్రాంతాల్లో కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుని.. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తులసి ఆకులు

తులసి ఆకులు

ప్రతి ఇంట్లో ఉండే ఔషధం తులసి చెట్టు. ఈ ఆకులు ఎలాంటి చర్మ సమస్యలకైనా మంచి పరిష్కారం. తులసి ఆకుల్లో థైమాల్, క్యాంఫర్, యూజెనోల్ వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్లను తొలగించడానికి ఉపయోగపడతాయి. నీళ్లలో తులసి ఆకులు వేసి.. బాగా వేడి చేయాలి. చల్లారిన తర్వాత దురద ప్రభావిత ప్రాంతాల్లో ఆకులు ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.

పండ్ల తొక్క

పండ్ల తొక్క

పండ్ల తొక్కలతో చర్మంపై వచ్చే దురదలను తొలగించవచ్చు. చర్మంపై దురదలుగా అనిపించినప్పుడు పండ్ల తొక్కలతో రుద్దడం వల్ల వెంటనే ఉపశమనం పొందవచ్చు. దీనికి నారింజ తొక్క, నిమ్మ తొక్క బాగా ఉపయోగపడతాయి.

పెట్రోలియం జెల్లీ

పెట్రోలియం జెల్లీ

చర్మంపై వచ్చే దురదలకు పెట్రోలియం జెల్లీ సహజ మందులా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేసి, దురదలను తగ్గిస్తుంది.

వంట సోడా

వంట సోడా

చిన్న చిన్న ప్రదేశాలలో వచ్చే దురదలకు వంట సోడా బాగా పనిచేస్తుంది. వంటసోడాకి నీటిని కలిపి పేస్ట్ లా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని దురదగా ఉన్న ప్రాంతాలలో పూయడం వల్ల ఫలితం ఉంటుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్

చర్మంపై దురదలు పోగొట్టడానికి ఇది చక్కటి పరిష్కారం. ఆపిల్ సైడర్ వెనిగర్ యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలని కలిగి ఉంటుంది. కాబట్టి కాటన్ తీసుకుని ఆపిల్ సైడర్ వెనిగర్ లో ముంచి.. దురదగా ఉన్న ప్రాంతంలో రాయాలి.

ఓట్మీల్

ఓట్మీల్

చర్మంపై దురదలతో పోరాడటానికి ఓట్మీల్ సహకరిస్తుంది. రెండు స్పూన్ల నీటికి, కాస్త ఓట్ మీల్ కలిపి కాసే పక్కనపెట్టాలి. కొన్ని నిమిషాల తర్వాత.. దురదగ ఉన్న ప్రాంతాల్లో ఈ పేస్ట్ ని రాసి.. గంట తర్వాత కడిగేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

English summary

Home Remedies to Prevent Skin Rashes: beauty in telugu

Here are some of the best remedies that you can try at home to get rid of the rashes which causes terrible itching.
Story first published: Monday, October 26, 2015, 13:36 [IST]
Desktop Bottom Promotion