చర్మం కాంతివంతం చేసే సింపుల్ అండ్ నేచురల్ బ్యూటీ టిప్స్

సాధారణంగా చాలా సింపుల్ గా ఉండే బ్యూటి టిప్స్ గా చాలా ఉన్నాయి. అటువంటి సింపుల్ చిట్కాలను మీ అమ్మమ్మలు, అమ్మలు, స్నేహితుల నుండి తెలుసుకొనే ఉంటారు . ఈ అన్నిరకాల బ్యూటీ టిప్స్ అన్నీ కూడా చర్మం సంరక్షణలో, చర్మాన్ని అందంగా ఉంచుకోవడంలో ఒక భాగం. అందంగా కనబడుటకు నేచురల్ బ్యూటీ లుక్ పొందుటకు వాటిలో, కనీసం ఒకటో రెండో మీరు ఖచ్చితంగా ఉపయోగించే ఉంటారు. కళ్ళకు మేకప్ మరయిు టోనర్స్ వంటివి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి, కానీ నిపుణులు మాత్ర నేచురల్ వస్తువులు ఇండియన్ మహిళలకు చాలా ఉత్తమం అని భావిస్తారు.

READ MORE: మిమ్మల్నిమరింత అందంగా మార్చేనేచురల్ బ్యూటీ టిప్స్

చర్మం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే ముఖం కాంతివంతంగా ఉంటుంది. అందమైన ముఖ వర్చస్సు కోసం మార్కెట్లో దొరికే రసాయన లేపనాలే వాడనవసనం లేదు. మనకు అందుబాటులో ఉండే ఇంగ్రిడియంట్స్‌తోనే అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆ బ్యూటీ టిప్స్‌ ఏంటో తెల్సుకుందాం.

వేపచెట్టు

వేపచెట్టు

వేపచెట్టు ఆరోగ్యానికి చక్కటి ఔషధం. అలాగే ముఖవర్చస్సుకూ ఉపయోగపడుతుంది. వేపాకులను నీటిలో ఉడకబెట్టాలి. ఆ నీరు చల్లారాక ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ముఖం శుభ్రపడుతుంది.

కొంచెం వేపాకు పౌడర్‌ను తీసుకొని దానికి గ్రేప్‌సీడ్‌ ఆయిల్‌ కలపి మెత్తగా చేసి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

 తేనె మంచి యాంటీ సెప్టిక్‌.

తేనె మంచి యాంటీ సెప్టిక్‌.

తేనె మంచి యాంటీ సెప్టిక్‌. ముఖంపై కాలిన గాయాలకు తేనెను రెగ్యులర్‌గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

తేనె, శెనగపిండి, చందనం

తేనె, శెనగపిండి, చందనం

తేనె, శెనగపిండి, చందనం, మీగడ కలిపి మిశ్రమంగా తయారు చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే చర్మం మృదువుగా అవుతుంది.

 ముల్తానీ మట్టిని

ముల్తానీ మట్టిని

ఒక బౌల్‌లో ముల్తానీ మట్టిని తీసుకొని దానికి కొంచెం తాజా టొమాటో రసం కలపాలి. వీటికి పసుపు, చందనం పౌడర్‌ను కలిపి బాగా మిక్స్‌ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ముఖంపై ఉండే మచ్చలు తొలగిపోతాయి.

ముల్తానీ మట్టికి పుదీనా ఆకులు

ముల్తానీ మట్టికి పుదీనా ఆకులు

ముల్తానీ మట్టికి పుదీనా ఆకులు కలిపి చూర్ణం చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాక అరగంట ఆగి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ముఖంపై ఉండే నల్లటి మచ్చలు తొలగిపోతాయి.

శనగపిండికి కాస్త పసుపు, పెరుగు కలిపి పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను పట్టిస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

బియ్యం పిండి, టొమాటో రసం

బియ్యం పిండి, టొమాటో రసం

బియ్యం పిండి, టొమాటో రసం, పాలు, పసుపు కలిపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాస్తే ముడతలు పోతాయి.

గంధం, పాలు

గంధం, పాలు

గంధం, పాలు కలిపి దాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.

తులసి ఆకులను

తులసి ఆకులను

తులసి ఆకులను చూర్ణం చేసి అందులోకి పాలు కలిపి ముఖానికి పట్టిస్తే ఆరోగ్యవంతమైన చర్మం మీ సొంతమవుతుంది.

బాదాం

బాదాం

ఐదు బాదాంలను తీసుకొని పౌడరు చేసుకోవాలి. దానికి 1 టేబుల్‌ స్పూన్‌ పాలు, 1 టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం కలిపాలి. ఆ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత మంచినీళ్లతో కడిగేస్తే ముఖం మెరుస్తుంది.

Story first published: Monday, August 17, 2015, 18:09 [IST]
Desktop Bottom Promotion