Latest Updates
-
Father's Day 2026: చాలా మంది తండ్రులు 60 ఏళ్లు దాటాక పశ్చాత్తాపపడే ఒక్క విషయం అదే! -
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.! -
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు.. -
పెళ్లయింది తర్వాతేంటి.. అమ్మాయిలు గూగుల్ని అడుగుతున్న సలహాలు ఇవేనట.! -
పోషకాల పవర్ హౌస్..ఇంట్లోనే రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే.. -
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? -
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం.. శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది! -
జూన్ 19 నుంచి ధన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
పొగాకు నమిలితే క్యాన్సర్, గుండెపోటు మాత్రమే కాదు.. మరో ప్రమాదం ఉందని తెలుసా.? -
ఎక్కువ కాలం బతకాలా? ఈ వ్యాయామాలు చేస్తే మరణ ప్రమాదం తగ్గుతుంది..
వెజిటేబుల్స్ తో చర్మకాంతి తళతళ మిళమిళ
మహిళలకు అందమైన మోముంటే అందరూ చాలా బాగుందంటారు. దీనికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. పౌడర్లు, క్రీములు వాడితేనే చర్మం సౌందర్యవంతం కాదు. ఆహారంతో కూడా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. తాజా కూరగాయలు, ఆకు కూరలు తినడం వల్ల శరీరంలో విటమిన్ల శాతం అవసరమైనంత మేరకు పెరుగుతుంది విటమిన్లు చర్మాన్ని తాజాగా వుంచుతాయి.
చర్మ సౌందర్యానికి సహజసిద్ధంగా ప్రకృతి అందించే ఆకుకూరలు, కూరగాయలు పండ్లలో ఉండే ఎన్నో పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే తీసుకునే చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే ప్రొటీన్లు గల చేపలు, పౌల్ట్రీ, కోడిగుడ్లు, బీన్స్, పప్పులు, సోయా, మాంసం వంటివి తీసుకోండి.
READ MORE: నిత్యం యవ్వనం ఆరోగ్యంగా ఉంచే 10 సూపర్ టిప్స్
చర్మ సౌందర్యానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న తరచూ వచ్చే చెమటతో ముఖం జిడ్డుగా అవుతూ ఉంటుంది. ఎన్ని సోపుల్ ఉపయోగించినా, ఎన్ని క్రీములు వాడినా ప్రయోజనం మాత్రం శూన్యం. అవి ఉపయోగించిన కొంతం టైమ్ మాత్రం తాజాగా ఉండి మరి కొద్ది సేపటికే ముఖంలో మార్పులు సంభవిస్తుంటాయి. ఆహారాలు అంతర్గతంగా తీసుకోవడం మాత్రమే కాదు, బహిర్గతంగా కూడా ఉపయోగించుకొన్నట్లైతే మంచి ఫలితం ఉంటుంది. మరి అదెలాగో చూద్దాం....

బంగాళదుంప:
ఎండ వేడికి కళ్లు మంటగా వుండటం, ముఖం నిస్తేజంగా మారటం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇటువంటప్పుడు పొట్టు తీసిన బంగాళదుంపని సంగం వరకు చక్రాల్లా తరిగి నుదురు, కళ్లపై పెట్లుకోవాలి. మిగిలిని సగభాగాన్ని గుజ్జులా చేసి కొంచెం తేనె చేర్చి ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్ పూర్తిగా ఆరాక చల్లని నీటితో తొలగించాలి. ఇది కళ్లకు స్వాంతన నివ్వడమే కాక.. చర్మంపై జిడ్డును తొలగించి తేజోవంతంగా మార్చుతుంది.

కీరదోస:
జిడ్డు చర్మం గల వారికి కీరదోస చక్కని పరిష్కారం. దీనిని మెత్తగా చేసి రసాన్ని వేరు చేయాలి. ఇందులో అరచెంచా నిమ్మరసం, ఒక చెంచా రోజువాటర్ చేర్చి అరగంటపాటు ప్రిజ్ లో పెట్టాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు ముఖం, మెడ భాగాల్లో రాసుకొని చల్లని నీటితో శుభ్రపరచాలి. ఈ చల్లని ప్యాక్ మంచి క్లెన్సర్ లా పనిచేసి, అలసిన చర్మానికి సాంత్వననిస్తుంది.

క్యాబేజి :
క్యాబేజి ఆకులను ముద్దలా చేసి రసాన్ని వేరు చేయాలి. దీనికి రెండు చెంచాల శనగపిండి, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని అరగంట తర్వాత తడి చేసిన దూదితో తొలగించాలి. ఇది చర్మంపై పేరుకొన్న మురికిని తొలగించి కాంతివంతంగా మార్చుతుంది.

ముల్లంగి:
ముల్లంగిని మొత్తని పేస్ట్ చేసి రసం వేరుచేయలి. దీనికి రెండు చెంచాల పెరుగు చేర్చి ముఖానికి, చేతులకు రాసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ ఎండకు వడలిపోయిన చర్మానికి కొత్త తేజస్సునందిస్తుంది.

ఆరెంజ్ :
పొడి చర్మం కలవారికి ఈ ప్యాక్ చక్కగా పనిచేస్తుంది. ఒక నారింజ పండు, ఐదారు కర్జూరాలను తీసుకొని గింజలు తీసివేయాలి. ఈ రెండింటిని మిక్సీలో వేసి ముద్దలా చేయాలి. దీనిని ముఖం చేతులకు రాసుకొని మునివేళ్లతో వృత్తాకారంగా మర్ధన చేయాలి. అరగంట తర్వాత ఈ ప్యాక్ ను తడి దూదితో తొలగించాలి. ఇది చర్మ కణాలకు తగిన తేమనందించి చాలా సేపటి వరకు చర్మ పొడిబారకుండా చేస్తుంది.

క్యారెట్:
క్యారట్ ను తురిమి కొద్దిగా పచ్చిపాలు కలిపి మెత్తగా రుబ్బి ఈ ముద్దని మెడ, చేతులకి నాలుగైదుసార్లు చొప్పున రాయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. దీని ద్వారా చర్మానికి సమృద్దిగా విటమిన్లు అందుతాయి.

బంగాళదుంప:
బంగాళదుంపల్ని ఉడికించి అనంతరం రెండు స్పూన్ల పాలు కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ ముద్దని ముఖానికి పట్టించి కొద్ది సేపటి తర్వాత గోరువెచ్చిన నీటితో కడిగి అనంతరం పాల మీగడ రాసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ముఖం ఎంత కాంతివంతంగా ఉంటుందో మీరే గమనిస్తారు. బంగాళాదుంప గుజ్జు: ఉడకబెట్టిన బంగాళాదుంప గుజ్జును ముఖానికి రాసుకుంటే తెగిన, కాలిన గాయలు మానుతాయి. మొటిమలు తగ్గి, ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

క్యాబేజి:
కొద్దిగా నీటిలో క్యాబేజీని ఉడకబెట్టి ఆ నీరు చల్లారిన తర్వాత ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై మచ్చలు, నల్లబడటం పోయి చర్మం నునుపుగా మారుతుంది.

టమోటో:
టమోటో గుజ్జులో లైకోపిన్ అధికంగా ఉండటం వల్ల సన్ బర్న్ నుండి చర్మాన్ని కాపాడుతుంది. కాబట్టి టమోటో గుజ్జును ఆలివ్ ఆయిల్ తో చేర్చి ముఖానికి పది వారాల పాటు అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. టమోటోల్లోని యాంటిఆక్సిడెంట్స్, లైకోపిన్, హైకెరోటినాయిడ్స్ వంటివి ఫీరాడికల్స్ నుండి కాపాడుతుంది.

పొదీన:
పొదీన ఆకుల్ని మెత్తగా నూరి కొంచెం రోజ్ వాటర్ చేర్చి ముఖానికి రాసుకోవాలి. ఇది మాయిశ్చరైజర్ లా పనిచేయడమే కాకుండా.. మొటిమలు, బ్లాక్ హెడ్స్ ల్లాంటివి తొలగిస్తుంది.



Click it and Unblock the Notifications