Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
వర్షాకాలంలో ముఖం జిడ్డుగా అగుపిస్తున్నదా....?
చర్మ సౌందర్యానికి మిగిలిన కాలాల్లో తీసుకొనే జాగ్రత్తల కంటే శీతాకాలంలో మరికొంత ఎక్కువ శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాతావరణంలో మార్పుల వల్ల చర్మ పగుళ్ళు ఏర్పడి, తడి ఆరిపోయి, గీతలు ఏర్పడి అందవిహీనంగా కనబడ తారు. అందుకు కొన్ని వింటర్ క్రీములు అప్లై చేయడం వల్ల చర్మ జిడ్డుగా, ఆయిలీగా మారుతుంది. కారణం చాలా సింపుల్! ఎందుకంటే ఈ క్రీములు చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి. ఇంకా చర్మం పొడిబారనియకుండా చేస్తాయి. వర్షాకాలంలో చర్మాన్ని పొడిబారనీయకుండా చేసుకోవడానకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
READ MORE: వర్షాకాలంలో పాటించాల్సిన టాప్ 10 చర్మసంరక్షణ చిట్కాలు
మిగిలిన సీజన్ లో లాగే వర్షాకాలంలో కూడా చర్మం జిడ్డుకలిగి, ఆయిలీగా ఉండటం వల్ల అసౌకర్యంగా, ఉంటుంది. మరియు ఈ ఆయిల్ ను పోగొట్టడం కూడా కొంచెం కష్టం అవుతుంది. అందువల్లే ఆయిల్ స్కిన్ ఉన్న వారు వింటర్ క్రీమ్స్ కు దూరంగా ఉంటారు. వర్షాకాలంలో ఇలా క్రీమ్స్ ను వాడకపోవడం వల్ల చర్మం పొడి బారి, డల్ గా కనబడుతుంది.
READ MORE: వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు
కాబట్టి ఆయిల్ చర్మాన్ని క్లియర్ గా మర్చి, ముఖ చర్మం అందంగ, తేమగా మార్చే క్రీములు మార్కెట్లో అనేక అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా పనిచేయనప్పుడు కొన్ని ఇంట్లోనే కొన్ని వస్తువులతో ఆయిల్ స్కిన్ కు చెక్ పెట్టవచ్చు.

పాలు -తేనె:
ఒక గిన్నెలో పాలు మరియు తేనె మిక్స్ చేసి ముఖానికి మరియు చేతులకు పట్టించి బాగా శుభ్రం చేసుకోవాలి.

దానిమ్మ:
దానిమ్మలో చర్మానికి ముడతలు పడనివ్వని ఔషధగుణాలున్నాయి. దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీయాక్ిసడెంట్లు ఈ కాలం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి కాంతిని పెంచుతాయి. ఒక గిన్నెలో 2టేబుల్ స్పూన్ల దానిమ్మరసం, ఒక కప్పు ఓట్స్, 2 టేబుల్ స్పూన్ల తేనె, 2చెంచాలా మజ్జిగ వేసి కలపాలి. కాసేపు ఈ మిశ్రమాన్ని అలాగే ఉంచి, మెత్తగా అయ్యాక ముఖానికి, చేతులకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. చర్మంపై మ్రుతకణాలు తొలగిపోతాయి. నిగారింపు పెరుగుతుంది.

మిల్క్ మసాజ్:
పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల దుమ్మ, ధూళిని, డెడ్ స్కిన్ ను తొలగించడమే కాదు.. ఇది మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. బయట తిరిగి ఇంటికి చేరుకోగానే తప్పకుండా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చల్లటినీటితో శుభ్రం చేసుకొని పొడి వస్త్రంతో తుడిచి పొడి ఆరనివ్వాలి. అలాగే బయటకు వెళ్లే కొన్ని నిముషాల ముందు కూడా పాలతో ముఖానికి మర్ధన చేసుకొని వెళ్ళవచ్చు. ఇలా మర్ధన చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ముఖంలో జిడ్డు, ఆయిల్ తొలగిపోతుంది.

సోపు వాడకం:
ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి పదే పదే సబ్బును ఉపయోగిస్తే చర్మం త్వరగా పొడిబారుతుంది. అందుకని సోప్ ఫ్రీ ఫేస్ వాస్ లేదా క్లెన్సర్ ను ఉపయోగించడం మంచిది.

వేడినీళ్ళను వాడటం మానేయాలి:
వేడినీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మరంద్రాలను తెరుచుకొనేలా చేయడమే కాదు.. ఇది చర్మంలో నూనె గ్రంధులు కూడా తెరచుకొనేలా చేస్తాయి. కాబట్టి శీతాకాలంలో ఆయిల్ స్కిన్ తొలగించాలనుకొంటే ఎప్పుడూ చల్లటి నీటితోనే ముఖంను శుభ్రం చేసుకోండి. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మ రంద్రాలను మూసుకొనే చేసి మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది.

టమోటో మసాజ్:
చర్మంలో అధికంగా పేరుకొన్న ఆయిల్ ను టమోటో జ్యూస్ తొలగిస్తుంది. టమోటో జ్యూస్ లో కొంచెం నిమ్మరసం కూడా చేర్చి ముఖానికి మర్ధన చేయాలి. నిమ్మరసం ఎక్సట్రా ఆయిల్ ను, డెడ్ స్కిన్ తొలగిస్తుంది. అప్లై చేసిన రత్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. జిడ్డు చర్మాన్ని పోగొట్టడానికి ఇదొక మంచి మార్గం.

మాయిశ్చరైజర్ :
చాలా మందికి వచ్చే సందేహం ఈ సీజన్ లో బాడీ మాయిశ్చరైజర్ ను రాసుకోవచ్చా, లేదా! సందేహం మొదలవుతుంది. జిడ్డు ఎక్కువగా అనిపించేది కాకుండానూ, అలాగని పొడిబారనీయని లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్ లేదా సీరమ్ ను ఎంపిక చేసుకోవాలి.

సన్ స్క్రీన్ లోషన్:
శీతాకాలంలో వాతావరణం మబ్బుగా ఉంది కాదా అని సన్ స్క్రీన్ లోషన్ అవసరం ఉండదని చాలా మంది అభిప్రాయం, కానీ మబ్బులు దాటుకుని వచ్చే సూర్యకాంతిలోనూ అతినీలలోహిత కిరణాలు ఉంటాయి. అందుకని బయటకు వెళ్లే ముందు సన్ ప్రొటెక్షన్ లోషన్ (ఎస్.పి.ఎఫ్ 30)రాసుకోవాలి.

బొప్పాయి-పెరుగు:
శీతాకాలంలో జిడ్డును వదిలించుకోవాలంటే రెండు చెంచాలా బొప్పాయి గుజ్జు, టేబుల్ స్పూన్ పెరుగు, ఒక చెంచా అలోవెర జెల్ కలిపి ముఖానికి రాసి, మసాజ్ చేయాలి. ఆ తర్వాత శుభ్రపరుచుకోవాలి.

ఎక్స్ ఫోయిలేట్:
ఆయిల్ చర్మాన్ని తొలగించడానికి వారంలో కనీసం రెండు సార్లు ఎక్స్ ఫోయిలేట్ చేయడం అవసరం. అందుకు అనేక స్ర్కబ్ లు అందుబాటులో ఉన్నాయి. శీతాకాలంలో ఆయిల్ చర్మాన్ని పోగొట్టడానికి ఓట్ మీల్ లేదా బాదాం స్ర్కబ్ లు బాగా పనిచేస్తాయి. అందుకు ముఖాన్ని నీటితో శుభ్రం చేసి తర్వాత ఈ స్ర్కబ్ ను అప్లై చేయాలి. స్ర్కబ్ అప్లై చేసిన రెండు మూడు నిముషాల తర్వాత మర్ధన చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ముఖంలో ఏర్పడ్డ ఆయిల్ ను తొలగిస్తుంది.



Click it and Unblock the Notifications











