Latest Updates
-
గంటల తరబడి ఫ్రిజ్లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.! -
హస్తసాముద్రికం: మీ చేతిలో ఈ రేఖ ఉంటే కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు! -
కొందరు అందంగా లేకపోయినా ఎందుకు అందరినీ ఆకర్షిస్తారో తెలుసా.? -
మందు తాగేటప్పుడు స్టఫ్ గా ఏది తినడం ఆరోగ్యానికి మంచిదో తెలుసా? -
చపాతీ, నాన్, జీరా రైస్ లోకి అమృతంలాంటి నవరతన్ కుర్మా.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
శృంగార సమస్యల సంజీవని.. ఈ హల్వాను కప్పు తిన్నారంటే వీర్య పుష్టి మీ సొంతం.!
యంగ్ అండ్ గార్జియస్ స్కిన్ పొందడానికి 7 రోజుల్లో 7 డిఫరెంట్ ఫేస్ ప్యాక్స్ ..!!
ఇంట్లో ఉండే నేచురల్ పదార్థాలను వదిలేసి, లక్సరీగా ఫ్యాన్సీ ఫేస్ ప్యాక్ ల కోసం ప్రాకులాడాల్సిన అవసరం లేదు. ఇంట్లో తయారుచేసుకునే నేచురల్ ఫేస్ ప్యాక్ ను వేసుకోడానికి ముందు, చర్మం మీద ఒక చిన్న ప్యాచ్ టెస్ట
అందం విషయంలో అమ్మాయిలు అస్సలు రాజీ పడరు. అందరికంటే ప్రత్యేకంగా అందంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారిలో మీరూ ఒక్కరైతే..మీ చర్మ సౌందర్యాన్ని గార్జియస్ గా...ప్రకాశవంతంగా మార్చుకోవాలనుకుంటే ? ఒక వారంలో 7 రోజుల్లో ఒక్కో రోజూ ఒక్కో ఫేస్ ప్యాక్ ఆచరిస్తే మంచి ఫలితం ఉంటుంది. వారంలో 7 రోజులకు ఒక్కో రోజు ఒక్కో విధమైన ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఫేస్ ప్యాక్ ను ప్రతి రోజూ ఉపయోగించడం వల్ల ఒక మంచి ఉపాయమే..అయితే చర్మానికి హాని కలిగించే ప్రొడక్ట్స్ తో వేసుకోవడం వల్ల ఫలితాలు రివర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ ను వేసుకోవడం వల్ల చర్మానికి ఇవి ఎలాంటి హాని కలిగించవు. ముఖ్యంగా ఇవి చర్మానికి నేచురల్ గ్లోను అందిస్తాయి.
ఇంట్లో ఉండే నేచురల్ పదార్థాలను వదిలేసి, లక్సరీగా ఫ్యాన్సీ ఫేస్ ప్యాక్ ల కోసం ప్రాకులాడాల్సిన అవసరం లేదు. ఇంట్లో తయారుచేసుకునే నేచురల్ ఫేస్ ప్యాక్ ను వేసుకోడానికి ముందు, చర్మం మీద ఒక చిన్న ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఇటువంటి ఫేస్ ప్యాక్ ల వల్ల చర్మానికి హాని కలగవచ్చు . కాబట్టి, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారు నేచురల్ ఫేస్ ప్యాక్స్ ను వేసుకోవడం మంచిది.
ఈ నేచురల్ ఫేస్ ప్యాక్స్ వివిధ రకాలుగా ఉపయోగపడుతాయి. ఈ ఫేస్ ప్యాక్స్ వల్ల అన్ని రకాల చర్మ సమస్యలు దూరమవుతాయి. అటువంటి ఎఫెక్టివ్ ఫేస్ ప్యాక్స్ ఈ క్రింది విధంగా....

తేనె, నిమ్మరసంతో క్లెన్సర్ :
వారంలో మొదటి రోజు నిమ్మరసం, తేనెతో ప్రారంభించడం మంచిది. ఈ రెండింటి మిశ్రమం చర్మానికి క్లెన్సింగ్ లా పనిచేస్తాయి. ఈ రెండింటి మిశ్రమం ఉపయోగించేటప్పుడు రెగ్యులర్ ఫేస్ వాష్ ను వాడకూడదు. ఈ ఫేస్ ప్యాక్ వల్ల సన్ టాన్ తొలగించుకోవచ్చు.

స్ట్రాబెర్రీ పాలిష్ :
వారంలో రెండవ రోజు మంగళ వారం స్ట్రాబర్రీస్ ను విత్తనాలతో పాటు గుజ్జుగా చేసి ముఖానికి అప్లై చేయాలి. ఒక రకంగా లక్సరీ ట్రీట్మెంట్ అని చెప్పవచ్చు. స్ట్రాబెర్రీ ఇతర ఫ్రూట్స్ కంటే కొద్దిగా ఖరీదైనవే కాబట్టి, చర్మ సౌందర్యానికి కూడా అద్భుతంగా ప్రయోజనాలను అందిస్తాయి.

పెరుగుతో మాయిశ్చరైజింగ్:
సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారిలో స్కిన్ స్మూత్ గా అందంగా, రెడ్ నెస్ తో మార్చడానికి చాలా గ్రేట్ గా సమాయపడుతుంది. కాబట్టి, పెరుగును స్కిన్ మాయిశ్చరైజర్ గా ఉపయోగించవచ్చు.

బేసన్ స్ర్కబ్ :
పురాతన కాలం నుండి శెనపిండిని సౌందర్యంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. శెనగపిండిలో కొద్దిగా పాలు పోసి ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగి పోయి, చర్మం కాంతివంతంగా మారుతుంది.

ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ :
ప్రతి ఒక్కరూ వయస్సులో ఉన్నప్పుడు మొటిమల సమస్యను ఎదుర్కొని ఉంటారు. అలాగే కొంత మంది మద్యవయస్సు వరకూ ఈ సమస్యతో పోరాడుతుంటారు . ఈ సమస్యను నివారించుకోడానికి ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంలో ఎక్సెసివ్ ఆయిల్ తొలగిపోతుంది.

పసుపు:
పసుపు అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. పసుపులో కొద్దిగా పాలు మిక్స్ చేసి ముఖాకిని అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో కొత్త కాంతి వస్తుంది.

క్లియర్ స్కిన్ పొందడానికి రైస్ వాటర్ :
రైస్ వాటర్ ను ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ఏజింగ్ లక్షణాలు కనబడవు, మరియు ఎర్రమచ్చలు, తొలగిపోతాయి. యంగ్ గా..గార్జియస్ లుక్ తో కనబడుతారు,.



Click it and Unblock the Notifications