For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వయస్సు తేలియనివ్వని బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ ..!!

By Super Admin
|

మనం ఉదయం తీసుకునే అల్పాహారానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది రోజంతటికి చాలా అత్యవసరమైన ఆహారం. మీకు తెలుసా? బ్రేక్ ఫాస్ట్ ఏజింగ్ ప్రొసెస్ ను ఆలస్యం చేస్తుంది? ఖచ్చితంగా అవుననే అంటున్నారు నిపుణులు. మద్యహ్నాం , రాత్రి తీసుకునే భోజనం కంటే ఉదయం తీసుకునే అల్పాహారం చాలా ముఖ్యమైనది.


అల్పాహారంగా తీసుకునే ఆహారాలు మిమ్మల్ని యంగ్ గా మరియు హెల్తీగా ఉంచుతాయి. మరియు ఎక్కువ రోజులు జీవించడానికి సహాయపడుతాయి. అందువల్ల మీరు రోజూ తీసుకునే ఆహారాల్లో ముఖ్యంగా ఉదయం తీసుకునే అల్పాహారంగా యాంటీఏజింగ్ ఫుడ్స్ ను చేర్చుకోవడం వల్ల యవ్వనంగా ..ఆరోగ్యంగా ఉండవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

ఓట్ మీల్:

ఓట్ మీల్:

పరిశోధనల ప్రకారం ఓట్ మీల్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా మంచిది. ఓట్ మీల్ సోలబుల్ ఫైబర్ తో నిండి ఉంటుంది కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇంకా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, స్కిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా పోరాడుతుంది. ఇది చర్మంలో ముడుతలు ,ప్లమ్స్ ఏర్పడకుండా తగ్గిస్తుంది, అందుకే దీన్ని యాంటీఏజింగ్ ఫుడ్ గా తీసుకుంటారు.

బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్ ఫైబర్ మరియు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని బ్రేక్ ఫాస్ట్ కు ఎంపిక చేసుకుంటారు. వీటిలో ఫాలీఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి ఇది మోటార్ స్కిల్స్ పెంచుతుంది. ఇంకా డయాబెటిస్, క్యాన్సర్ మరియు హార్ట్ డిసీజ్ వంటి వాటిని నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రేట్ యాంటీఆక్సిడెంట్ . ఇందులో ఉండే ఇజిసిజి (క్యాటచిన్)చర్మ ప్రకాశవంతంగా మార్చుతుంది. ముడుతలను నివారిస్తుంది. వీటితో పాటు యాంటీఆక్సిడెంట్స్ యాంటీ ఏజింగ్ గా పనిచేస్తాయి.

గ్రేప్ ఫ్రూట్ :

గ్రేప్ ఫ్రూట్ :

గ్రేప్ ఫ్రూట్ యాంటీఏజింగ్ బ్రేక్ ఫాస్ట్ ఫుడ్స్ లో ఇది ఒకటి. బ్రేక్ ఫాస్ట్ గా దీన్ని తీసుకోవడం వల్ల మ్యాక్సిమమ్ బెనిఫిట్స్ పొందుతారు . గ్రేప్ ఫ్రూట్ ఇన్సులిన్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.ఎక్కువ ఫ్యాట్ ఉండటం వల్ల ఇన్సులిన్ లెవల్స్ అధికంగా ఉంటాయి.కాబట్టి, గ్రేప్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల అధిక బరువును తగ్గిస్తుంది.

గుడ్డు:

గుడ్డు:

గుడ్డులో కొలెస్ట్రాల్ లెవల్స్ అధికంగా ఉన్నాయని ఆరోగ్యానికి హానికరం అని చెబుతారు. కానీ పరిశోధనలు దీన్ని తప్పు అంటున్నారు. ప్రతి రోజూ ఒక గుడ్డు బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన మంచి ఫ్యాట్(మోనో శాచురేటెడ్, ఫాలీ అన్ శాచురేటెడ్ ను అందిస్తుంది . గుడ్డు యాంటీ ఏజింగ్ ఫుడ్ గా సూచిస్తున్నారు . ముఖ్యంగా గుడ్డు పచ్చసొనలో క్యాల్షియం మరియు ఐరన్ అధికంగా ఉంటుంది . ఎగ్ వైట్ లో ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. ఇవే కాకుండా గుడ్డులో విటమిన్ బి2, బి12, ఎ మరియు ఇలున్నాయి.

ఫ్లాక్స్ సీడ్స్ :

ఫ్లాక్స్ సీడ్స్ :

యాంటీఏజింగ్ ఫుడ్స్ లో ఫ్లాక్స్ సీడ్స్ ఒకటి . సెరెల్స్, గుడ్డు లేదా ఓట్ మీల్, ఫ్లాక్స్ సీడ్ వంటివి సింపుల్ గా స్ప్రింకిల్ చేయడం లేదా ఫ్రెష్ ఫ్రూట్ స్మూతీగా తయారుచేసుకోవచ్చు . వీటిలో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఎక్కువ. ఇతర ప్లాంట్ బేస్డ్ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తో పోల్చితే, వీటిలో లిగనన్స్ ఎక్కవు . ఇవి ఇన్ఫ్లమేషన్ వల్ల బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ కాకుండా నివారిస్తాయి.

దానిమ్మ జ్యూస్ :

దానిమ్మ జ్యూస్ :

టీ బదులుగా దానిమ్మ తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. దానిమ్మ జ్యూస్ బెస్ట్ యాంటీఏజింగ్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇది డిఎన్ ఎ కు నేచురల్ యాక్సిడేషన్ గా పనిచేస్తుంది. దాన్మ జ్యూస్ స్ట్రెస్ తగ్గిస్తుంది. మరియు హార్ట్ డిసీజ్ ను తగ్గిస్తుంది.

బాదం బట్టర్:

బాదం బట్టర్:

బాదం బట్టర్ యాంటీఏజింగ్ ఫుడ్స్ లో ఒకటి . ముఖ్యంగా ఇందులో విటమిన్ ఇ మరియు ప్రోటీన్స్ ఎక్కువ . మోనోశాచురేటెడ్ ఫ్యాట్ (హెల్తీ ఫ్యాట్ )ఎక్కువ. బాదం బట్టర్ లో కాపర్ఎక్కువగా ఉంటుంది. ఇది మెలనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది . యూవీ కిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. ఇందులో ఉండే క్యాల్షియం, ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. మెగ్నీషియం ఎనర్జీని అందిస్తుంది, బోన్ హెల్త్ కు సహాయపడుతుది. బాదం బట్టర్ లో ఉండే విటమిన్ ఇ హెల్తీ సెల్ ఫంక్షన్ కు సహాయపడుతుంది.

యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావల్సిన మినిరల్స్, విటమిన్స్ ఎక్కువగా అందుతాయి. ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది . స్టొమక్ ఫుల్ ఫిల్ చేస్తుంది . వంటలకు ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం ఇటు ఆరోగ్యానికి, అటు చర్మ సౌందర్యానికి మంచిది.

English summary

8 Anti-Aging Foods to Have For Breakfast

8 Anti-Aging Foods to Have For Breakfast,Eating the right food for breakfast can keep you young and healthier and help you live longer too. So let us look at the most amazing anti-aging food to be included for breakfast.
Story first published: Thursday, August 18, 2016, 18:18 [IST]
Desktop Bottom Promotion