Latest Updates
-
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా?
చర్మం సౌందర్యంలో నిమ్మరసం చేసే అద్భుతాలేంటి..?
చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి కొన్ని చౌకైనవి కూడా చాలా అద్భుతాలను చేస్తాయి. ముఖ్యంగా మనకు నేచురల్ గా మన వంట గదిలో నిత్యం ఉండే పదార్థాల్లో ఒకటి నిమ్మరసం. చర్మ,ఆరోగ్యాన్ని అందాన్ని పెంచుకోవడానికి హోం మేడ్ ట్రీట్మెంట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి . కొన్ని నేచురల్ ప్రౌడక్ట్స్ చూడటానికి చాలా సహజంగా కనిపించినా అవి చేసే అద్భుతాలను గుర్తిస్తే ఆశ్చర్యం కలగక తప్పదు. అలాంటిదే నిమ్మరసం.
అదే విధంగా, వీటిలో వివిధ రకాల ప్రయోజనాలను తెలుసుకోవడానికి ఎంత మంది ప్రయత్నిస్తారు? నాకు తెలిసినంత వరకూ చాలా మంది వీటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. వాటి ప్రయోజనాలను తెలియకనే నిర్లక్ష్యం చేస్తుంటారు. తెలుసుకొన్న తర్వాత వీటిని విడవకుండా ఉపయోగిస్తారు. మరి ఆ ప్రయోజనాలు తెలుసుకోవాలంటే ఇలాంటి నేచురల్ ప్రొడక్ట్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే . బేసిక్ గా మనం చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం మన చర్మతత్వానికి సరిపడేవి ఏలాంటివి మనం ఉపయోగిస్తున్నామో మనకు తెలియదు.
ఉదయాన్నేలెమన్ వాటర్ తాగితే: గొప్ప ప్రయోజనాలు
ఒక సింపుల్ హోం రెమెడీ చర్మ సంరక్షణలో అద్భుతాలను చేస్తుందంటే ఆశ్చర్య కలగక మానాదు . మరియు ఇది చర్మం మీద ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనే ఆత్రుత మీలో ఉందా?వినడానికి మీకు సర్ప్రైజింగ్ గా ఉండవచ్చు . కానీ ఇది చర్మం మీద మ్యాజికల్ ఎఫెక్ట్స్ ను అందిస్తుంది . నిమ్మకాయ చూడటానికి చిన్నదిగా అనిపించవచ్చు. కానీ ఈ స్మాల్ సైజ్ ఫ్రూట్ లో దానికి వందరెట్లు ప్రయోజనాలను దాగి ఉన్నాయి.
వేసవైనా..వింటరైనా...పరిమితికి మించి తీసుకుంటే సమస్యలే....
మరి నిమ్మరసంలోని అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ మనిపించాల్సిందే...

స్కిన్ బ్రైట్ చేస్తుంది:
చర్మం అందంగా, సాఫ్ట్ గా మరియు కాంతివంతంగా ఉండాలని ఎవరు కోరుకోరు? కాంతివంతగా మెరిసే చర్మం ఉంటే అందం రెట్టింపు అవుతుంది . అందుకోసం వివిధ రకాల స్కిన్ బ్రైటనింగ్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తున్నాము. నిమ్మరసం తీసుకొని, అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖం మరియు మెడకు అప్లై చేయాలి. 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. మరియు మంచి క్లెన్సింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది . మరియు ఇది స్కిన్ టాన్ నివారిస్తుంది.

బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది:
బ్లాక్ హెడ్స్ చర్మం మీద ఇబ్బందికరంగా చేసే చిన్న చిన్న మెటిమలు, నల్లమచ్చలు, చర్మం ఎంత తెల్లగా ఉన్నా, వీటి వల్ల అందం మొత్తం పాడవుతుంది . వీటిని తొలగించడం కొద్దిగా కష్టమే . ఈ సమస్యను నివారించుకోవడానికి నిమ్మరసం ప్రయత్నించవచ్చు . నిమ్మరసం పిండి తొక్కతో ముక్కు మీద మర్దన చేయాలి. తర్వాత అరగంట పాటు అలాగే వదిలేసి . కొద్ది సమయం తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఎక్స్ ఫ్లోయేట్ :
నిమ్మరసంలో ఉండే ఎసిడిక్ నేచరల్ వల్ల స్కిన్ ఎక్స్ఫ్లోయేటింగ్ కు గ్రేట్ గా సమాయపడుతుంది. నిమ్మరసంతో పాటు తేనె మిక్స్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు . అలాగే బ్రౌన్ షుగర్ లో డిప్ చేసిన నిమ్మతొక్కతో ముఖానికి స్క్రబ్బింగ్ చేయవచ్చు.

షైనింగ్ :
నిమ్మరసంలో బ్యూటీబెనిఫిట్స్ అనేకం. అందులో ఇది కూడా ఒకటి,. రెగ్యులర్ అప్లికేషన్ వల్ల ముఖంలో మంచి షైనింగ్ వస్తుంది . చాలా మంది ముఖం నిర్జీవంగా మరియు ఆయిల్ స్కిన్ తో బాధపడుతుంటారు అలాంటి వారు ఈ చిట్కా వల్ల ఉపశమనం పొందవచ్చు . హాట్ వెదర్లో ఇది ఒక మంచి ఉపశమనం . ఇది మంచి అందాన్ని పెంచడంతో పాటు డస్ట్ ను గ్రహించేస్తుంది. నిమ్మరసం తరచూ అప్లై చేస్తుంటే షైనింగ్ ఎఫెక్ట్ ను పొందవచ్చు . నిమ్మరసంలో కొద్దిగా అలోవెరా జ్యూస్ , తేనె మిక్స్ చేసి ముఖానికి మెడకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

డార్క్ స్పాట్స్ తొలగించేస్తుంది:
వయస్సుతో పాటు చర్మంలో వచ్చే అనేక సమస్యలతో పాటు, డార్క్ స్పాట్స్ ను కూడా నివారిస్తుంది. ఇవి చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తో పాటు నిమ్మరసంను ఉపయోగిస్తుంటే డార్క్ స్పాట్స్ తొలగించుకోవచ్చు . నిమ్మరసం మరియు గ్లిజరిన్ ఈక్వెల్ గా తీసుకొని మిక్స్ చేసి అప్లై చేయాలి. రాత్రిల్లో అప్లై చేసి, ఉదయం శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ముడుతలను మాయం చేస్తుంది:
నిమ్మరసం, బాదం ఆయిల్ మరియు తేనె మిక్స్ చేయడం వల్ల ఈ కాంబినేషన్లో నేచురల్ యాంటీ స్కిన్ ఏజింగ్ ఫార్ములాతో ముఖం, మెడ , కళ్ళ చుట్టూ ప్యాక్ లా వేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోండం వల్ల ముడుతలు, మచ్చలు, ఫైన్ లైన్స్ నివారించబడుతాయి . అయితే ముడుతల తగ్గడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది. దీన్ని వారంలో రెండు మూడు సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

మొటిమలను నివారిస్తుంది:
మొటిమల సమస్యతో బాధపడే వారికి నిమ్మరసం ఒక ఉత్తమమైనది. మొటిమలు చూడటానికి అస్యహ్యంగా ఉండటం మాత్రమే కాదు ఇవి చాలా బాధిస్తాయి . నిమ్మరసంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మెటిమలను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. అలోవెరా జ్యూస్ లో నిమ్మరసం మిక్స్ చేసి మొటిమల మీద అప్లై చేయాలి. లేదా దీన్ని నేరుగా ముఖం మీద మర్దన చేయవచ్చు. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications