For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మం కాంతిని రెట్టింపు చేసే నిమ్మతొక్క

|

చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవడానికి వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటాము. అలాగే చాలా వరకూ హోంమేడ్ స్కిన్ రెమెడీస్ లో నిమ్మతొక్కను కూడా ఉపయోగిస్తుంటాము.

నిమ్మరసంలోనే కాదు నిమ్మతొక్కలో కూడా విటమిన్ సి మరియు ఇతర న్యూట్రీషియన్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో ఉండే బ్లీచింగ్ లక్షణాలు చర్మంను కాంతివంతంగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

నెక్ట్స్ టైమ్ మీరు నిమ్మకాయ నుండి రసాన్ని తీసినప్పుడు, తొక్కను పడేయకుండా ఎండబెట్టుకోవాలి. తొక్క ఎడిన తర్వాత వాటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి.
రెగ్యులర్ గా చర్మ సంరక్షణ జాగ్రత్తలు తీసుకొనే వారికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

ఈ పౌడర్ ను మీరు తరచూ ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్ తో పాటు మిక్స్ చేసి ముఖానికి ప్యాల్ లా వేసుకోవడం వల్ల చర్మంను తెల్లగా..కాంతివంతంగా మార్చుతుంది. మరి నిమ్మ తొక్క చర్మానికి ఏవిధంగా పనిచేస్తుందో చూద్దాం...

చిట్కా: 1

చిట్కా: 1

కొద్దిగా నిమ్మతొక్క పౌడర్ తీసుకొని, అందులో కొద్దిగా కొబ్బరి నీళ్ళు పోసి పేస్ట్ లా చేసి మొటిమలు మచ్చలున్న ప్రదేశంలో స్ప్రెడ్ చేయాలి. రాత్రిలో అప్లై చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది మీరు రెగ్యులర్ గా చేస్తే మచ్చలు మరియు మొటిమలు కంట్రోల్లో ఉంటాయి.

 చిట్కా 2:

చిట్కా 2:

సాఫ్ట్ గా మరియు సిల్కీ స్కిన్ మీరు పొందాలంటే ఈ హోం రెమెడీని ప్రయత్నించండి . ఈ టేబుల్ స్పూన్ నిమ్మరసంలో ఒక చెంచా నిమ్మతొక్క పౌడర్ మిక్స్ చేయాలి. అందులోనే ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

చిట్కా 3:

చిట్కా 3:

ముడుతలను నివారిస్తుంది . కొద్దిగా నిమ్మతొక్క పౌడర్ లో బొప్పాయ గుజ్జు లేదా బొప్పాయి రసం వేసి బాగా మిక్స్ చేసి తర్వాత ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

చిట్కా 4:

చిట్కా 4:

నిమ్మతొక్క పౌడర్ ఎక్స్ఫ్లోయేట్ గా పనిచేస్తుంది . ఒక టేబుల్ స్పూన్ సీసాల్ట్ మిక్స్ నిమ్మతొక్క పొడిలో మిక్స్ చేసి, అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మెడ మరియు చేతులకు అప్లై చేయాలి. దీన్ని వారానికొకసారి ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

చిట్కా 5:

చిట్కా 5:

నిమ్మతొక్క స్కిన్ వైటనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది . మీ చర్మం ఆయిల్ స్కిన్ అయితే ఈ హోం రెమెడీని మీరు ప్రయత్నించవచ్చు. ఒక చెంచా లెమన్ పీల్ పౌడర్ ను ఒక పచ్చిపాలను మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి ఫేషియల్ గా వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 చిట్కా 6:

చిట్కా 6:

నిమ్మతొక్కలో నేచురల్ బ్లీచింగ్ ప్రొపర్టీస్ ఉన్నాయి . నిమ్మతొక్క పౌడర్లో కీరదోసకాయ జ్యూస్ , రోజ్ వాటర్ మరియు ముల్తాని మట్టి వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చర్మం క్లియర్ గా మార్చేస్తుంది.

చిట్కా 7:

చిట్కా 7:

ఒక టీస్పూన్ నిమ్మతొక్క పౌడర్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి.నిదానంగా మర్ధన చేయాలి. చర్మం కాంతివంతంగా మారుతుంది.

English summary

Tips To Use Lemon Peel For Skin: Beauty Tips in Telugu

Most of us have used lemon juice for various skin remedies but seldom do we use lemon peel for beauty. The next time when you squeeze the juice out of lemons, make it a point to dry those peels instead of throwing them away. Once those peels are dried up, you can grind them to get fine powder.
Story first published: Saturday, August 22, 2015, 17:21 [IST]
Desktop Bottom Promotion