For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమ్మరసంతో జుట్టుకు కలిగే అదనపు ప్రయోజనాలు!

|

నిమ్మరసంలోని అనేకమైన బ్యూటీ మరియు హెల్త్ బెనిఫిట్స్ ను మనం ఇంతకు ముందు వ్యాసాల్లో తెలుసుకున్నాం . అక్కడక్కడా వినే ఉంటాం. లేదా న్యూస్ పేపర్స్, వారపత్రికల్లో చదివే ఉంటాం. అయితే బ్యూటీ విషయంలో కురులకు ఎక్కువ ప్రయోజనం కల్పిస్తుంది. నిమ్మరసం జుట్టు రాలడం లేదా జుట్టు సమస్యలను నివారించడం మాత్రమే కాదు, ఈ సిట్రస్ జ్యూస్ జుట్టు పెరుగుదలకు మరియు బలమైన జుట్టు సహజంగా పొందడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

నిమ్మరసంలో విటిమిన్ బి, సి మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉంది. ఇది జుట్టు డ్యామేజ్ ను తొలగిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టుకు ప్రకాశవంతమైన మెరుపును అంధించడానికి అవసరం అయ్యే పోషకాలను కూడా అంధిస్తుంది.

నిమ్మరసాన్ని తరచుగా ఆయిల్ హెయిర్ కు అప్లై చేస్తుంటాం. ఎందుకంటే తలలో సిబం యొక్క ఊటను తగ్గిస్తుంది. సిబం అనేది జిడ్డు గల జుట్టు మొదళ్ళ నుండి ప్రారంభం అవ్వడానికి ప్రధాన కారణం అవుతుంది. నిమ్మరసంలో మరో హెయిర్ బెనిఫిట్ ఏంటంటే, ఇది జుట్టు రంగును ప్రకాశవంతంగా చేయడానికి ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. కేశాలకు నేచురల్ బ్లీచ్ పొందాలంటే నిమ్మరసాన్ని తలకు పట్టించాల్సిందే. తలలో పేనుతో బాధపడుతున్నావారు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో రెండు టేబుల్ స్పూన్ల బాదం నూనె లేదా వేపనూనెను మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంకా మీరు పేలను నిర్మూలించడానికి నిమ్మరసంలో వెల్లుల్లిని మిక్స్ చేసి కూడా తలకు అప్లై చేయవచ్చు. ఇంత కాకుండా నిమ్మరసంతో మరిన్ని హెయిర్ బెనిఫిట్స్ ఉన్నాయి వాటి మీద ఓ లుక్కేయండి.

నేచురల్ హై లైటర్:

నేచురల్ హై లైటర్:

జుట్టు రంగు సహజంగానే పొందాలంటే నిమ్మరసాన్ని తలకు పట్టించాలి. ఇది జుట్టుకు నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

జుట్టు రాలడం:

జుట్టు రాలడం:

నిమ్మరసాన్ని కొబ్బరినూనెతో మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల ఒక గొప్ప ప్రయోజనం, జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

షైనీ హెయిర్:

షైనీ హెయిర్:

మీరు నిర్జీవంగా ఉన్న మరియు పొడి బారిన జుట్టుతో బాధపడుతుంటే?నిమ్మరసం మరియు పెరుగు మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఇది షైనీ హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది.

తలలో ఇన్ఫెక్షన్:

తలలో ఇన్ఫెక్షన్:

నిమ్మరసంలోని మరో ప్రయోజనం, తలలో అన్ని రకాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. మరియు తలను, కేశాలను శుభ్రంగా ఉంచుతుంది.

జుట్టు పెరుగుదల:

జుట్టు పెరుగుదల:

నిమ్మరసాన్ని ఆముదం లేదా ఆలివ్ ఆయిల్ తో మిక్స్ చేసి, తలకు మసాజ్ చేయాలి. ఒక గంట పాటు అలాగే వదిలేసి తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి.

బలమైన జుట్టుకోసం:

బలమైన జుట్టుకోసం:

మీ జుట్టు బలంగా మరియు ఎటువంటి డ్యామేజ్ లేకుండా పెరగాలంటే నిమ్మరసంతో తేనె, పెరుగు మిక్స్ చేసి తలమాడు, కేశాలకు పూర్తిగా పట్టించి మసాజ్ చేయాలి.

జిడ్డు జుట్టు:

జిడ్డు జుట్టు:

నిమ్మరసంతో మరో ఉపయోగం, తలలో అధనపు నూనె గ్రంథుల ఉత్పత్తిని తగ్గిస్తుంది. దాంతో తలను శుభ్రంగా ఉంచుతుంది మరియు జిడ్డును నివారిస్తుంది.

చుండ్రు:

చుండ్రు:

ఇది మరొక బాగా తెలిసినటువంటి హెయిర్ బెనిఫిట్. మీ జుట్టుకు నిమ్మరసాన్ని పట్టించి, బాగా మసాజ్ చేయడం వల్ల సహజంగానే చుండ్రును నివారించుకోవచ్చు.

మందమైన హెయిర్:

మందమైన హెయిర్:

మందగా మరియు నునుపైన జుట్టును పొందడానికి, కొబ్బరినీళ్ళలో నిమ్మరసాన్ని మిక్స్ చేసి, ఆ నీటిని తలస్నానం పూర్తిఅయిన చివరిలో తలమీద దారలా పోసుకోవాలి. ఇది ఒక మంచి కండీషనర్ గాను మరియు షైనింగ్ గాను ఉపయోగపడుతుంది.

జుట్టు వాసన:

జుట్టు వాసన:

మీ జిడ్డైన జుట్టు, ఒక బలమైన దుర్వాసనకు కారణం అవుతుంది?కాబట్టి, నిమ్మరసాన్ని మీ జుట్టుకు స్ప్రే చేయడం వల్ల కేశాలు తాజా ఫ్లేవర్ తో సువాసన వస్తుంది.

హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా:

హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా:

హెయిర్ రూట్స్ ను బలంగా ఉండాలంటే?నిమ్మరసాన్ని గుడ్డులో మిక్స్ చేసి తర్వాత తలకు మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత రెండు గంటలు అలాగే వదిలేసి, తర్వత మన్నికైన షాంపుతో స్నానం చేయాలి.

జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది:

జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది:

ఆలివ్ ఆయిల్ నిమ్మరసం సమంగా తీసుకొని మిక్స్ చేసి తలకు, కేశాలకు పట్టించడం వల్ల జుట్టు చిట్లడాన్ని నిరోధిస్తుంది.

English summary

Hair Benefits Of Lemon

We all have heard the numerous health and beauty benefits of lemon juice. Lemon is not just used to treat hair loss or cure scalp problems. The citrus fruit juice also helps increase hair growth and get strong hair naturally.
Desktop Bottom Promotion