Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
పసుపును అలా వాడితే.. అక్కడ మచ్చలు తొలగిపోతాయట...!
మచ్చలు తొలగించే అద్భుతమైన పసుపు ప్యాక్
చాలా కొద్ది మందికి మాత్రమే ఫర్ఫెక్ట్ స్కిన్ ఉంటుంది. చాలా వరకు ఎక్కువ మంది ముఖంలో ఏదో మచ్చలు, స్పాట్స్, మొటిమలుంటాయి. ఈ మచ్చలు వివిధ రకాల కారణంగా ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా టీనేజ్ లో వచ్చే మొటిమల కారణంగా ముఖంలో స్పాట్స్ ఏర్పడతాయి. ఇవి మొదట్లోనే నివారించకపోతే.. గుంటలు పడే ప్రమాదం ఉంటుంది. ముఖంలో ఎలాంటి సమస్యనైనా నివారించి.. చర్మాన్ని ఫెయిర్ గా మార్చడంలో పసుపు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

పసుపు పిగ్మెంటేషన్, మచ్చలను తగ్గించడంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అందుకోసం ఇంట్లోనే చక్కటి ఫేస్ ప్యాక్ అప్లై చేయవచ్చు. ఒక టేబుల్‌స్పూన్ పసుపులో సరిపడా పాలు మిక్స్ చేసి పేస్ట్‌లా చేయాలి. ముఖం, మెడ భాగాలకు ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాసుకుంటే అందమైన, మచ్చలు లేని చర్మం మీ సొంతం అవుతుంది.

పొడిబారిన చర్మానికి ఒక టీస్పూన్ పసుపు, రెండు టీస్పూన్ల గంధం పొడి, సరిపడా నీళ్లు లేదా రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి బాగా ఆరనివ్వాలి. వారానికి రెండుసార్లు ఈ మాస్క్ వేసుకుంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

పుదీనా ఆకులను రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి గుజ్జులా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాలకు రాసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి. వారానికి రెండుమూడు సార్లు ఈ ప్యాక్ అప్లై చేస్తే మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది.



Click it and Unblock the Notifications