అందంగా కనబడాలంటే, రాత్రి నిద్రించే ముందు ఈ చిట్కాలను అనుసరించండి

Posted By: Staff
Subscribe to Boldsky

నిగనిగలాడే చర్మం అంటే ఇష్టం లేనివారు ఎవరుంటారు? చర్మంలో పెద్ద పెద్ద రంధ్రాలు, అసహ్యమైన మచ్చలు, మొటిమలు, ముడతలు వంటి రకరకాల సమస్యలతో చర్మం అందవిహీనంగా మారుతుంటుంది. ఇలాంటి సమస్యలను దాచిపెట్టడం కష్టం. అలాగని.. అలాగే వదిలేయడమూ కష్టమే.

ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి చాలామంది వంటింట్లో ఉన్నవాటిని వదిలేసి.. కెమికల్ ప్రాడక్ట్స్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వేళకు నిద్ర, సరైన పౌష్టికాహారం, చక్కని వ్యాయామం తోపాటు చర్మతత్వానికి సరిపడే సరైన క్రీములు కాంతివంతమైన చర్మ సొంతంచేసుకోవడానికి దోహదపడతాయి. అయితే, మనలో అందరికీ ఈ విధానాలన్నీ ఎల్లవేళలా పాటించడం సాధ్యపడకపోవచ్చు. హెర్బల్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల.. ఈ సమస్యలన్నింటికీ ఒక్కసారిగా గుడ్ బై చెప్పవచ్చు.

కొన్ని ఫేస్ ప్యాక్ లు రాత్రుల్లో వేసుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఓవర్ నైట్ ఫేస్ ప్యాక్స్ వల్ల బ్యూటిఫుల్ గా..ఫ్రెష్ గా కనబడుతారు. రాత్రుల్లో వేసుకునే ఈ ఫేస్ ప్యాక్స్ వల్ల ఉదయం అందమైన చర్మ సౌందర్యంతో ఒక యువరాణి కళతో నిద్రలేస్తారు.

ఎక్సటర్నల్ గా చర్మం కాలుష్యం, ఎండ, వేడికి బహిర్గతం అవుతుంది కాబట్టి, చాలా తర్వాత డ్యామేజ్ అవ్వడం సహజం . అలా డ్యామేజ్ కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇటువంటి పరిస్థితిలో మీరు కూడా ఉంటే..అందమైన..మ్రుదువైన, కాంతివంతమైన చర్మం మీరు కూడా పొందాలనుకుంటే ఈ ఓవర్ నైట్ ఫేస్ ప్యాక్ లను తప్పనిసరిగా వేసుకోవాలి. ఆలస్యం చేయకుండా ఈ ఓవర్ నైట్ ఫేస్ ప్యాక్ లను ఫాలో అయ్యి..కాంతివంతమైన చర్మ సౌందర్యాన్ని పొందండి.

1. పసుపు మరియు శెనగపిండి ఫేస్ మాస్క్

1. పసుపు మరియు శెనగపిండి ఫేస్ మాస్క్

పసుపు, శెనగపిండి కాంబినేషన్ ఫేస్ ప్యాక్ పురాత కాలం నాటిది. ఈ రెమెడిని చాలా మంది మహిళలు అనుసరిస్తుంటారు. కాంబినేషన్ ఫేస్ మాస్క్ ను రాత్రుల్లో వేసుకోవడం వల్ల ఉదయానికళ్ల చర్మంలో మంచి కాంతి..కళ వస్తుంది.

అందుకోసం ఒక టీస్పూన్ శెనగిపండి , రెండు స్పూన్ల పాలు, చిటికెడు పసుపు మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. రాత్రుల్లో అలాగే ముఖానికి అప్లై చేసి ఉదయం చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

2. స్ట్రాబెర్రీ ఫేస్ మాస్క్

2. స్ట్రాబెర్రీ ఫేస్ మాస్క్

స్ట్రాబెర్రీ ఫేస్ మాస్క్ చాలా మంది ఇష్టపడుతారు. స్ట్రాబెర్రీలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది. స్ట్రాబెర్రీస్ ఉపయోగించడం వల్ల కొల్లాజెన్ ప్రొడక్షన్ పెంచుతుంది.

అందుకు మీరు చేయాల్సిందల్లా, స్ట్రాబెర్రీ ఫ్రూట్ తీసుకుని అందులో పాలు మిక్స్ చేసి మొత్తగా పేస్ట్ చేయాలి. అందులో ఒక స్పూన్ శెనగపిండి మిక్స్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. ఓట్స్ మరియు పెరుగు ఫేస్ మాస్క్

3. ఓట్స్ మరియు పెరుగు ఫేస్ మాస్క్

మొటిమలు, మచ్చలు, చర్మ రంద్రాలున్నావారికి ఓట్స్ మరియు పెరుగు ఫర్ఫెక్ట్ ఫేస్ మాస్క్. ఓట్స్ స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. పెరుగు చర్మానికి మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. కొద్దిగా ఓట్స్ తీసుకుని, గ్రైండర్ లో వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె, చిటికెడు పసుపు చేర్చి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఈ పేస్ మాస్క్ ను రాత్రుల్లో ముఖానికి అప్లై చేసి ఉదయం శుభ్రం చేసుకోవాలి.

4. గందం ఫేస్ మాస్క్

4. గందం ఫేస్ మాస్క్

డ్రై అండ్ ఆయిల్ స్కిన్ కలవారికి ఈ గందం ఫేస్ మాస్క్ గ్రేట్ గా సహాయపడుతుంది. చర్మంలో చీకాను తొలగిస్తుంది. హెల్తీ స్కిన్ ను ప్రోత్సహిస్తుంది. గందం పౌడర్ ను మెత్తగా చేసి, అందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి, పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేయాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. గంధం ఫేస్ మాస్క్ తో ఫ్రెష్ లుకింగ్ స్కిన్ పొందుతారు. గందం పొడికి పాలు, లావెండర్ ఆయిల్ , రెండు స్పూన్ల శెనగపిండి మిక్స్ చేసి నైట్ లో ముఖానికి అప్లై చేసి చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

5. బంతిపూల ఫేస్ మాస్క్

5. బంతిపూల ఫేస్ మాస్క్

బంతిపూలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటితో చర్మం సౌందర్యం పెరుగుతుంది. బంతి పూలను పాలలో మిక్స్ చేసి కొద్దిసేపటి తర్వాత పాలతో పాటు పువ్వులను కూడా మిక్స్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే తేనె వేసి మిక్స్ చేయాలి. ఈ ఫేస్ మాస్క్ ను రాత్రి నిద్రించే ముందు ముకానికి అప్లై చేసి, ఉదయం చన్నీటితో శుభ్రం చేసుకోవాలి.

బంతిపూలలో యాంటీ సెప్టిక్ మరియు యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల చర్మ సమ్యలను నివారిస్తుంది. రేడింట్ గ్లోను అందిస్తుంది. ఈ ఫేస్ మాస్క్ ను వారంలో రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

6. రోజ్ ఫేస్ మాస్క్

6. రోజ్ ఫేస్ మాస్క్

కొన్ని రోజా పువ్వు రేకులను తీసుకుని ఎండలో ఎండెట్టాలి. రోజా పువ్వు రేకులు మెత్తగా డ్రైగా మారిన తర్వాత మెత్తని పౌడర్ లా చేసుకోవాలి. దీనికి కొద్దిగా పాలు చేర్చి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ గ్లిజరిన్ కూడా మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఈ రోజ్ మాస్క్ ను నైట్ లో ముఖానికి అప్లై చేిస ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

7. నిమ్మ మరియు తేనెతో మాస్క్

7. నిమ్మ మరియు తేనెతో మాస్క్

రెండు స్పూన్ల తేనె రెండు స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసి, రాత్రి నిద్రించే ముందు ముఖానికి అప్లై చేయాలి. ఈ మాస్క్ ను ముఖానికి అప్లై చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. ఈ రెమెడీని రోజూ వేసుకున్నా చర్మం కాంతివంతంగా, స్టాఫ్ట్ గా మారుతుంది. ఈ ఫేస్ మాస్క్ అన్ని రకాల చర్మ సమస్యలకు సహాయపడుతుంది.

English summary

7 Overnight Face Masks To Wake Up With Gorgeous Skin

if you want to wake up with a gorgeous, soft and glowing skin, you must make sure to treat your skin to these overnight face masks. Check out on how to prepare and use the best face masks for glowing skin.
Subscribe Newsletter