For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖంపై మచ్చలను తొలగించే రెండు అద్భుతమైన కలబంద పరిష్కారాలు

|

కలబందను 'సర్వ సౌందర్య సమస్య నివారిణి' అని అంటారు. ఇది మీ కేశాలు మరియు చర్మం యొక్క అందాన్ని పెంపొందించుకోవటానికి సాధారణంగా ఉపయోగించే గృహవైద్య చికిత్స పదార్ధాలలో ఒకటి. ఇది మీ జుట్టుకు ఏ విధంగా ప్రయోజనాలు అందిస్తుందో, అదే విధంగా చర్మాన్ని కూడా మెరిపిస్తుంది.

మనం అందరం, అసమాన మేనిఛాయ, మచ్చలు, ఎండ వలన కమలడం, నల్లని మచ్చలు వంటి కొన్ని సాధారణ చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాయి. తీవ్రమైన సూర్య కిరణాలు, కాలుష్యం, వృద్ధాప్యం, మద్యపానం మరియు ధూమపానం మరియు హార్మోన్ సమస్యలు వంటివి చర్మ సమస్యలకు దారితీస్తాయి.

కలబందలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున, వివిధ చర్మ సమస్యలను సహజంగా నయం చేయడంలో విశేష సామర్ధ్యం కలిగి ఉంటుంది. క్రమం తప్పకుండా దీర్ఘకాలం పాటు చర్మం పై ఉపయోగించినట్లయితే, దీని వలన వివిధ ప్రయోజనాలు పొందవచ్చు. ఇప్పుడు మనం గాయాలు, మచ్చల చికిత్సలో కలబందను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం.

1.కలబంద గుజ్జు:

ఈ రోజుల్లో, మార్కెట్లో రెడీమేడ్ గా కలబంద గుజ్జు అందుబాటులో ఉంది. మీరు దానిని లేదా మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే దాని ఆకులను ఉపయోగించవచ్చు. అయితే ఇంట్లో సహజంగా పెరిగే కలబంద మొక్క యొక్క ఆకులను వాడటం శ్రేయస్కరం.

కావలసిన పదార్థాలు:

ఒక కలబంద ఆకు

తయారీ విధానం:

ముందుగా, తాజా కలబంద ఆకుని తీసుకుని, దాని మీద పేరుకున్న మట్టి తొలగిపోయేట్టు కడగండి. తరువాత, ఒక కత్తిని తీసుకొని జాగ్రత్తగా కలబంద ఆకుపై పొరను చెక్కేయండి. ఒక చెంచా సహాయంతో లోపల ఉన్న జెల్ బయటకు తీసి ఒక శుభ్రమైన గిన్నెలో వేయండి.

వాడే విధానం:

ఈ జెల్ ని కొంచెం తీసుకుని మరియు ప్రభావిత ప్రాంతంలో రాసుకోండి. మీరు కావాలనుకుంటే, మీ సౌకర్యానుసారం ప్రభావిత ప్రాంతంలో కలబంద ఆకుని నేరుగా కూడా రాసుకోవచ్చు.

ఇప్పుడు, వేళ్ళ చివర్లను వలయాకారంలో కదిలిస్తూ మర్దన చేసుకోండి. మీ చర్మంలోకి కలబంద గుజ్జు పూర్తిగా ఇంకేవరకు అలా వదిలేయండి. ముఖాన్ని నీటితో శుభ్రం చేయవలసిన అవసరం లేదు. మీరు కనుక జిగటగా ఉన్నట్లు అనుభూతి చెందితే, మామూలు సాదా నీటితో శుభ్రం చేసుకోండి.

ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేస్తే, తేడా మీరే గమనించవచ్చు.

2. కలబంద సీరం

కలబంద సీరం సూర్యుని ప్రభావం వాలిన ఏర్పడ్డ కమిలిన గాయాల చికిత్సకు సహాయపడుతుంది. కేవలం రెండే పదార్థాలతో దీనిని తయారు చేసుకోవచ్చు. అవి కలబంద మరియు నిమ్మ. కలబందలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, ఎటువంటి చర్మ సమస్యనైనా పరిష్కరించేందుకు తోడ్పడతాయి. నిమ్మకాయలోని విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని పేలవంగా మరియు కాంతిహీనంగా చేసే మృతకణాలను తొలగిస్తుంది.


కావలసిన పదార్థాలు:
కలబంద

నిమ్మకాయ

తయారీ విధానం:

ఇది చాలా సులభంగా తయారు చెడుకోగలిగే సీరం. బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దీనిని రాసుకోవడం వలన ఎండ వల్ల ఏర్పడ్డ కమిలిన గాయాలు తొలగిపోతాయి.


ముందుగా, తాజా కలబంద ఆకుని తీసుకొని చిన్న ముక్కలుగా కత్తిరించండి. కలబంద ఆకు పై చర్మం తొలగించనవసరం లేదు. ఇప్పుడు, నీరు కలపకుండా చిక్కని పేస్ట్ ను తయారు చేయండి. కలబంద గుజ్జు మరియు ఆకు వేరు చేయడానికి గాను ఆ పేస్ట్ ను వడకట్టండి.


ఇప్పుడు, ఒక నిమ్మకాయ కట్ చేసి, కలబంద గుజ్జులో కొన్ని నిమ్మరసం చుక్కలను పిండాలి. రెండింటిని బాగా కలపి, ఒక స్ప్రే సీసాలో వేయాలి.

వాడే విధానం:

మీ ముఖం మీద లేదా ప్రభావిత ప్రాంతంలో ప్రాంతంలో, మీ వేలి కొనలతో కలబంద -నిమ్మకాయ పేస్ట్ ను రాసుకోండి. దానిని 15 నిముషాల పాటు ఆరనివ్వండి.15 నిముషాల కంటే ఎక్కువ సమయం పాటు, దానిని చర్మంపై ఉంచుకుంటే, దురదపుట్టే అవకాశం ఉంది. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

2 Amazing Aloe Vera Remedies To Treat Blemishes

Aloe vera is known as the 'healer of all beauty-related issues'. We all face some common skin-related issues like uneven skin tone, blemishes, sun tan, dark spots, etc. However, the anti-oxidants and anti-inflammatory properties contained in aloe vera have the ability in healing the above-mentioned skin issues naturally.