Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
సముద్రపు ఉప్పు వలన జుట్టుకు ,ముఖానికి కలిగే సౌందర్య లాభాలు
సముద్రపు ఉప్పు ప్రతి ఇంట్లో సాధారణంగా వంట కోసం వాడే అతి మామూలు పదార్థం. మన ఆహారాన్ని ఉప్పు లేకుండా ఊహించలేము. ఉప్పు కేవలం ఆహారానికి రుచినందివ్వటమే కాక ఇంకా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. సౌందర్య పోషణ నిమిత్తం ఉప్పును విరివిగా వాడొచ్చు అన్న విషయం మీకు తెలుసా? ఉప్పు తో చర్మానికి ,జుట్టుకు అనేక రకాల లాభాలు ఉన్నాయి.
సముద్రపు ఉప్పులో మన శరీరానికి అవసరమైన మెగ్నీషియం, కాల్షియం మరియు పొటాషియం ఉంటాయి. ఈ అత్యవసరమైన ఖనిజాలు శరీరంలో లోపిస్తే చర్మం పొడిగా మారి దురద, మంట మొదలై పాడవుతుంది. సముద్రపు ఉప్పులో ఉండే గరుకుతనం వలన అది చర్మం మీద మృతకణాలను తొలగించి నునుపుగా ఉంచుతుంది.
సముద్రపు ఉప్పును సౌందర్య పోషణకు ఎలా ఉపయోగించాలి?
మీకు అనుదినం ఎదురయ్యే చిన్నచిన్న చర్మ సమస్యలను ఉప్పు పరిష్కరిస్తుంది. చర్మ సంరక్షణకు ఏ విధంగా పనికొస్తుంది? వాడేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?సరే, తెలుసుకుందాం రండి!

1. వంటికి నలుగు:
మన చర్మం పై ఉండే మృతకణాలు తొలగించడంలో నలుగు తోడ్పడుతుంది. ఉప్పును నలుగులో వాడవచ్చు. ఇలా చేయడం వల్ల మీ చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.
ఎలా వాడాలి?: 1/4కప్పు ఉప్పుకు 1/2కప్పు కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ కలిపి చిక్కని ముద్దగా చేయండి. దీనితో వొళ్ళంతా వలయాకారంలో మృదువుగా మర్దన చేసుకుని తరువాత స్నానం చేయండి.ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

2. మాస్క్:
సముద్రపు ఉప్పుకు తేమను పెంపొందించే గుణం ఉంటుంది. దీనిని తేనెతో కలిపి వాడినట్లైతే, దాని మంట తగ్గించే గుణం వలన చర్మం సేదతీరుతుంది. ఇంట్లో మీరు ఈ ఫేస్ మాస్క్ సులభంగా ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
ఎలా వాడాలి?: 2టేబుల్ స్పూన్ల ఉప్పులో 4టేబుల్ స్పూన్ల పుట్ట తేనె వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఈ మాస్క్ ను వారానికి రెండు సార్లు రాసుకుంటే శుభ్రమైన,మృదువైన మరియు కాంతివంతంగా ఉండే చర్మం మీ సొంతమవుతుంది.

3. స్కిన్ టోనర్:
మొటిమలతో కూడిన జిడ్డు చర్మం కలిగిన వారికి టోనర్ చాలా సహాయపడుతుంది. ఇది మీ చర్మరంధ్రాలను మూసివేసి pHను సమన్వయపరుస్తుంది. మీ చర్మానికి తేమ సమకూర్చి పునరుజ్జీవం అందిస్తుంది. ఇంట్లో ఉప్పుతో కూడిన టోనర్ ఎలా తయారు చేయవచ్చో తెలుసుకోండి.
ఎలా వాడాలి?: దీనిని రెండే రెండు అద్భుతమైన వస్తువులతో తయారు చేయవచ్చు. అవి ఉప్పు మరియు గోరు వెచ్చని నీరు. 2 స్పూన్ల ఉప్పును గోరు వెచ్చని నీటిలో బాగా కరిగిపోయేటట్టు కలపండి. ఈ నీటిని ఒక స్ప్రే సీసాలో నింపండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనిని మీ ముఖంపై చల్లుకోండి.

4. చుండ్రును తొలగిస్తుంది:
సముద్రపు ఉప్పు మాడును పొడిబారకుండా కాపాడుతుంది. దీనివలన చుండ్రు ఏర్పడదు. జుట్టును తడి చేసుకోబోయే ముందు దంచిన సముద్రపు ఉప్పును తలకి రాయండి. ఉప్పు తలపై చుండ్రు ముక్కలను వదులుగా చేసి లోపలికి ఇంకి మాడును శాంతపరుస్తుంది. వారానికి ఒకసారి ఇలా చేస్తే తేడా మీకే తెలుస్తుంది.

5. కళ్ళ కింద ఉబ్బును తగ్గిస్తుంది:
అధిక పని ఒత్తిడి వలన కళ్ళ కింద వాపులు తయారవుతాయి. వీటిని అమాంతం తగ్గించాలంటే సముద్రపు ఉప్పు పనికొస్తుంది. ఒక స్పూన్ ఉప్పును గోరు వెచ్చని నీటిలో బాగా కరిగిపోయేటట్టు కలపండి. దీనిలో ఒక దూది ఉండలను ముంచి కళ్ళ మీద పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన సత్వర ఉపశమనం కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications











