For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 8 DIY ఫేస్ ప్యాక్స్ ను ఈ సమ్మర్ లో ప్రయత్నిస్తే వేసవి కాలంలో ఎదురయ్యే చర్మ సమస్యలను నివారించవచ్చు

|

మండే వేసవి కాలంలో చర్మ సంరక్షణకై చింతిస్తున్నారా? వేసవి కాలం అనేది చర్మ సంరక్షణకు కీలకమైన కాలం. ఈ సమయంలో చర్మంపై ఏ మాత్రం అశ్రద్ధ కనబరచినా మీరు చింతించక తప్పదు. వేసవికాలంలో చర్మం నిస్తేజంగా, డ్రై గా అలాగే నిర్జీవంగా తయారవుతుంది. ఏజింగ్ సైన్స్ త్వరగా చర్మంపై దర్శనమిచ్చే ఆస్కారం కలదు.

కాబట్టి, ఈ సీజన్ లో చర్మ సంరక్షణకై మరింత శ్రద్ధ కనబరచడం అవసరం. తద్వారా, కాంతివంతమైన చర్మంతో మీరు మెరిసిపోతారు. హోమ్ రెమెడీస్ అనేవి చర్మ సంరక్షణలో ముఖ్య పాత్రను పోషిస్తాయి.

ఇక్కడ, వేసవి కాలంలో మీరు ప్రయత్నించవలసిన కొన్ని హోంమేడ్ ఫేస్ ప్యాక్స్ గురించి వివరించాము. వీటిని ప్రయత్నించడం ద్వారా వేసవి కాలంలో ఎదురయ్యే కొన్ని చర్మ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.

1. గ్లోయింగ్ స్కిన్ కోసం లెమన్:

1. గ్లోయింగ్ స్కిన్ కోసం లెమన్:

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ నిమ్మరసం

1 టేబుల్ స్పూన్ తేనె

1 ఎగ్ వైట్

ఎలా వాడాలి:

ఎగ్ లోంచి ఎగ్ వైట్ ను సెపరేట్ చేయండి. అందులో ఒక టేబుల్ స్పూన్ లెమన్ మరియు ఒక టేబుల్ స్పూన్ తేనెను జోడించి బాగా మిక్స్ చేయండి. ఈ ప్యాక్ ను ముఖంపై అలాగే మెడపై అప్లై చేయండి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి నార్మల్ వాటర్ తో శుభ్రపరచండి. లెమన్ మరియు తేనెలో ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్స్ కలవు. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. చర్మంలో నిగారింపును తీసుకువస్తాయి.

2. గుమ్మడి ఫేస్ మాస్క్

2. గుమ్మడి ఫేస్ మాస్క్

కావలసిన పదార్థాలు:

అర కప్పు గుమ్మడి గుజ్జు

ఒక టేబుల్ స్పూన్ తేనె

ఒక ఎగ్

ఒక టేబుల్ స్పూన్ ఆల్మండ్ మిల్క్ (ఆప్షనల్)

ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్

ఎలా వాడాలి:

అర కప్పు గుమ్మడి గుజ్జులో ఎగ్ ను కలపండి. ఈ రెండిటినీ బాగా బ్లెండ్ చేయండి. ఇప్పుడు, ఇందులో తేనె, ఆల్మండ్ మిల్క్ మరియు ఆపిల్ సిడర్ వినేగార్ ను కలిపి చిక్కటి మిశ్రమంగా తయారుచేయండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అలాగే మెడపై అప్లై చేయండి. 20 నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో రిన్స్ చేయండి. ఆ తరువాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి.

3. మింట్ మరియు టర్మరిక్ ఫేస్ ప్యాక్

3. మింట్ మరియు టర్మరిక్ ఫేస్ ప్యాక్

కావలసిన పదార్థాలు:

6-7 మింట్ లీవ్స్

ఒక టీస్పూన్ టర్మరిక్ పౌడర్

ఎలా వాడాలి:

కొన్ని మింట్ లీవ్స్ ను బ్లెండ్ చేసి అందులో ఒక చిటికెడు పసుపును జోడించండి. ఇందులో గోరువెచ్చటి నీటిని కలిపి పేస్ట్ ను తయారుచేయండి. ఈ మిక్శ్చర్ ను ముఖానికి అప్లై చేసి దాదాపు 10 నుంచి 15 నిమిషాల వరకు అలాగే ఉంచండి. నార్మల్ వాటర్ తో రిన్స్ చేయండి. మింట్ మరియు పసుపులో యాంటీ సెప్టిక్ ప్రాపర్టీస్ కలవు. ఇవి పింపుల్స్ ను తగ్గిస్తాయి. అలాగే, చర్మాన్ని కోమలంగా మరియు మృదువుగా మారుస్తాయి.

4. పెరుగు మరియు గ్రామ్ ఫ్లోర్ ఫేస్ ప్యాక్

4. పెరుగు మరియు గ్రామ్ ఫ్లోర్ ఫేస్ ప్యాక్

కావలసిన పదార్థాలు:

4 టేబుల్ స్పూన్ల పెరుగు

2 టేబుల్ స్పూన్ల గ్రామ్ ఫ్లోర్

ఎలా వాడాలి:

పెరుగులో గ్రామ్ ఫ్లోర్ ని కలపండి. వీటిని బాగా పేస్ట్ లా తయారుచేసుకోండి. ఈ పేస్ట్ ను ముఖంపై అప్లై చేయండి. ఈ పేస్ట్ లో చిటికెడు పసుపును కూడా కలపవచ్చు. ఈ ప్యాక్ ను 15 నుంచి 20 నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో తొలగించాలి. ఈ ప్యాక్ అనేది స్కిన్ ట్యానింగ్ నుంచి రక్షణనిస్తుంది.

5. బనానా ఫేస్ మాస్క్:

5. బనానా ఫేస్ మాస్క్:

కావలసిన పదార్థాలు:

అరకప్పు మ్యాష్డ్ బనానా

ఒక టేబుల్ స్పూన్ తేనె

ఎలా వాడాలి:

అర కప్పు మ్యాష్డ్ బనానాను తీసుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ తేనెను జోడించాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్కిన్ పై ఈవెన్ గా అప్లై చేయాలి. ఆరాక గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరచుకోవాలి. ఈ ప్యాక్ అనేది చర్మాన్ని హైడ్రేట్ చేసి డ్రై స్కిన్ నుంచి రక్షణను అందిస్తుంది.

6. టమాటో పల్ప్ ఫేస్ ప్యాక్

6. టమాటో పల్ప్ ఫేస్ ప్యాక్

కావలసిన పదార్థాలు:

అర కప్పు టమాటో పల్ప్

ఒక టీస్పూన్ తేనె

ఎలా వాడాలి:

ఒక పాత్రలోకి టమాటో పల్ప్ ని తీసుకుని అందులో తేనెను కలపాలి. ఈ ప్యాక్ ను చర్మంపై ఈవెన్ గా అప్లై చేయాలి. ఇలా 20 నిమిషాల పాటు ఉండనివ్వాలి. ఆ తరువాత రిన్స్ చేసి చర్మాన్ని టవల్ తో తుడవాలి. టమాటోలో చర్మంపై పేరుకున్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించే సామర్థ్యం కలదు. అలాగే స్కిన్ ను ట్యానింగ్ నుంచి సంరక్షించే సామర్థ్యం కూడా టొమాటోలో లభ్యమవుతుంది.

7. మిల్క్ మరియు తేనే ప్యాక్

7. మిల్క్ మరియు తేనే ప్యాక్

కావలసిన పదార్థాలు:

1 టేబుల్ స్పూన్ మిల్క్

1 టేబుల్ స్పూన్ తేనె

ఎలా వాడాలి:

తేనెను అలాగే పాలను ఒక బౌల్ లోకి తీసుకుని బాగా కలపాలి. పచ్చి పాలకు బదులుగా మిల్క్ పౌడర్ ను కూడా వాడవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖంపై అలాగే మెడపై అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత నార్మల్ వాటర్ తో శుభ్రపరచాలి. కొంత మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం మరచిపోకండి.

8. కుకుంబర్ ఫేస్ మాస్క్

8. కుకుంబర్ ఫేస్ మాస్క్

కావలసిన పదార్థాలు

హాఫ్ కుకుంబర్

ఒక స్పూన్ షుగర్

ఎలా వాడాలి:

కుకుంబర్ ను గుజ్జులా బ్లెండ్ చేసుకోండి. కుకుంబర్ గుజ్జులో ఒక స్పూన్ షుగర్ ను జోడించండి. ఈ మాస్క్ ను ముఖంపై అప్లై చేసి పది నిమిషాలపాటు అలాగే ఉంచండి. ఆ తరువాత చల్లటి నీటితో చర్మాన్ని శుభ్రపరచుకొని టవల్ తో తడిని తుడవండి. ఈ మాస్క్ ను ఒకసారే తయారుచేసి రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసుకుంటే ఇంకో సారి వాడుకోవచ్చు.

Read more about: home remedies
English summary

Homemade Face Packs That You Should Try This Summer

Worried of taking care of your skin under the scorching sun? Well, it's important to take care of your skin this season, to maintain that beautiful and glowing skin of yours. And what's better than home remedies to take care of your skin? Here are some awesome homemade face packs that you should try this season.
Desktop Bottom Promotion