For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖంపై చర్మరంధ్రాలు అధికంగా ఉన్నాయా ? అయితే ఈ ముల్తాని మట్టి మరియు నిమ్మ ఫేస్ –పాక్ ప్రయత్నించండి.

|

మన చర్మం - ముఖ్యంగా మన ముఖం, మెడ మరియు వీపు పైభాగం – ఎక్కువ స్థాయిలో దుమ్ము, ధూళి మరియు వాహన కాలుష్యానికి ప్రతిరోజూ బహిర్గతమవుతుంది. వీటికి తోడుగా శరీరంలో కించిత్తు సారం కూడా లేకుండా పీల్చిపిప్పి చేసే సూర్యుడు ఎటుతిరిగీ ఉన్నాడు. క్రమంగా ఈ కారకాలు మన చర్మాన్ని నిస్తేజంగా చేయడంతో పాటు, తరచుగా జిడ్డు సమస్యలకు, మృతకణాలు పెరగడానికి, మరియు చర్మ రంధ్రాలకు కూడా కారణంగా పరిణమిస్తుంటుంది. అటువంటి సమయాల్లో వాటిని తగ్గించుకునే ప్రయత్నాల మీద దృష్టి సారించడం జరుగుతుంటుంది. క్రమంగా జిడ్డు చర్మం నుండి ఉపశమనం పొందడం మరియు మృత కణాలను చర్మ రంద్రాల నుండి తొలగించడం మీద ఎక్కువగా ఫోకస్ పెడుతాము. అవునా? కొందరైతే తీవ్ర స్థాయిలో చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటూ కెమికల్ పీలింగ్, బొటాక్స్ వంటి రసాయనిక చికిత్సా విధానాలకు సైతం మొగ్గుచూపే పరిస్థితులు నెలకొంటున్నాయి.

ఈ క్రమంలో భాగంగా రసాయనిక ఉత్పత్తుల మీద ఆధారపడకుండా, కొన్ని చిన్న చిన్న గృహ చిట్కాలతోనే సమర్థవంతమైన ఫలితాలు పొందగలిగే అవకాశాలు కూడా ఉన్నాయని మరచిపోకూడదు. ఎప్పటికప్పుడు సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవడం అన్నిటికన్నా ముఖ్యమైన చర్య. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా చర్మం డీ హైడ్రేట్ కాకుండా చేస్తూ, మృతకణాల బారినుండి కాపాడుతుంది. కానీ కేవలం నీటితో ముఖం కడిగితే సరిపోతుందా ? అస్సలు కాదు! చర్మరంధ్రాలను దూరం చేయడానికి కొన్ని అదనపు చర్యలకు కూడా ఉపక్రమించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో సహజసిద్దమైన పదార్ధాలతో చేయగలిగే హోమ్-మేడ్ ఫేస్ మాస్క్.

ఇంటి చిట్కాలతో చర్మ రంధ్రాల నుండి ఉపశమనం! ఎలా ?

ఇంటిలోనే తయారుచేసే ఈ ఫేస్ మాస్క్స్ మీ వంటగదిలోని కొన్ని సాధారణ ప్రాథమిక పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకుని, సమర్థనీయమైన ఫలితాలను ఇచ్చేవిలా ఉంటాయి. మరియు తయారు చేయడం ఎంత సులభమో, వినియోగించడం కూడా అంతే సులభంగా ఉంటుంది. అంతేకాకుండా రసాయనాలు లేని గృహోపకరణాల నుండి, ఎంపిక చేయబడిన పదార్ధాల నుండి తయారు చేసే మాస్క్ కాబట్టి, ఎటువంటి రసాయనిక దుష్ప్రభావాలు కూడా తలెత్తనివిగా ఉంటాయి. మృత కణాలను తీసివేయడం మరియు మీ ముఖం నుండి చర్మ రంధ్రాలను తొలగించడం వంటి అసాధారణ ఫలితాలను ఇచ్చే ఫేస్-మాస్క్ కోసం మీరు చేయవలసినదల్లా నిర్దిష్ట సమయాన్ని కేటాయించడమే.

Most Read:సెక్స్ అడిక్ట్, పరిచయం ఉన్న అమ్మాయిల్లో ఎవ్వరినీ వదల్లేదు, కండోమ్స్ అందులో పెట్టేవాణ్ని #mystory246

చక్కెర, తేనె, నిమ్మకాయ, మరియు బొప్పాయి, వంటి సమర్థవంతమైన పదార్ధాలతో పాటు, అన్ని రకాల చర్మాలకు సరిపోయే మూలవస్తువుగా ముల్తానీ మట్టి కూడా ఉంది. దీనిని ఫుల్లర్స్ ఎర్త్ అని కూడా పిలుస్తారు. నిమ్మకాయ మరియు ముల్తానీ మట్టి ఫేస్ పాక్ చర్మరంధ్రాలను పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పబడింది.

ఇది ప్రాథమికంగా రెండు సాధారణ మార్గాల్లో పనిచేస్తుంది. ఇది మురికిని చర్మ రంధ్రాల నుండి తొలగిస్తుంది, మరియు చర్మం మీద ఉన్న అదనపు నూనెను (జిడ్డు) తొలగించి మొటిమలు రాకుండా కాపాడుతుంది. ఎటువంటి ఫేస్-మాస్క్ లో అయినా సరిపోగల తత్వాలు ముల్తాని మట్టికి సొంతం.

అదేవిధంగా నిమ్మరసం కూడా చర్మ రంధ్రాల నుండి మృత కణాలను తొలగించడానికి ఏంతో ఉత్తమంగా సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది కోల్పోయిన చర్మం తిరిగి ఏర్పడడంలో మరియు సహజ సిద్దమైన నిగారింపును ఇవ్వడంలో దోహదం చేస్తుంది. క్రమంగా చర్మ రంధ్రాల పరిమాణాలను తగ్గించగలదు. క్రమంగా ఈ రెండింటి వినియోగం చర్మ రంధ్రాల నుండి ఉపశమనం ఇవ్వడంలో సహాయం చేస్తుందని చెప్పబడింది.

Most Read: ఆమె యోనిలోకి అది చొరబడింది, నొప్పితో అల్లాడిపోయింది, రాత్రి బాగా తాగింది, ఉదయం లేవగానే అలా,కేసు ఫైల్

ముల్తానీ మట్టి మరియు నిమ్మ ఫేస్ – మాస్క్ ఎలా తయారు చేయాలి :

కావలసిన పదార్ధాలు :

2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి

1 టేబుల్ స్పూన్ నీరు

1 టేబుల్ స్పూన్ ముడి ఓట్స్

1 ½ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్

½ టేబుల్ స్పూన్ నిమ్మ రసం

Most Read:ఏ డేట్ లో పుట్టిన వాళ్ల స్వభావం ఎలా ఉంటుంది ?

ఎలా చెయ్యాలి :

• ఒక గిన్నెలో, ముల్తానీమట్టిని తీసుకొని, నిమ్మరసం మరియు నీటితో కలపండి. పేస్ట్ వలె మిశ్రమం అయ్యేవరకు బ్లెండ్ చేయండి.

• ఇప్పుడు ఆ మిశ్రమానికి రోజ్-వాటర్ కలపండి మరలా మిశ్రమంలా కలపండి.

• చివరగా, కొన్ని ముడి ఓట్స్ వేసి, మృదువైన పేస్ట్ వలె వచ్చేవరకు అన్ని పదార్థాలను కలపండి.

• కొన్ని నిమిషాల పాటు మిశ్రమాన్ని అలాగే వదిలేయండి.

• చల్లటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరచి, తువాలుతో తడిని తొలగించండి.

• ఈ మిశ్రమాన్ని మీ ముఖం మరియు మెడపై వర్తించండి. మీ కళ్ళు, చెవులు మరియు మీ నోటిని నివారించండి.

• వర్తించిన తర్వాత కనీసం 20 నిమిషాల పాటు, విశ్రాంతి తీసుకోండి. వీలయితే కళ్ళమీద కీరా దోస ముక్కలను ఉంచండి.

• పూర్తిగా పొడిబారిన పిదప, ఒక కాటన్ బాల్ తీసుకుని గోరువెచ్చని నీటిలో ముంచుతూ, ముఖానికి వర్తించిన మాస్క్ తొలగించండి.

• ఆ తర్వాత, మీ ముఖాన్ని వెచ్చని నీటితో కడిగి, తర్వాత మరలా చల్లని నీటితో కడగండి. వెచ్చని నీరు పూర్తిగా మీ చర్మరంధ్రాలను తెరిచి వాటిని శుభ్రపరుస్తుంది మరియు చల్లని నీరు ఆరంధ్రాలను మూయడంలో సహాయం చేస్తుంది.

మెరుగైన ఫలితాల కోసం వారంలో కనీసం రెండుసార్లు పునరావృతం చేయండి.

గమనిక: సున్నితమైన చర్మాన్ని కలిగి ఉన్నవారు మొదట ఈ ముసుగును వారి ముంజేతిపై ప్రయత్నించండి, కనీసం 24గంటల పాటు వేచిచూడండి. చర్మం చికాకుకు లోనవడం, లేదా దద్దుర్లు కలగడం వంటి సమస్యలులేని పక్షంలో మాత్రమే, మీరు మీ ముఖం మరియు మెడపై ఈ మాస్క్ వర్తింపచేయవచ్చు.

ఎటువంటి ప్రతికూల ప్రభావాలు తలెత్తుతున్నాయన్న అనుమానం వచ్చినా, మీ పరిస్థితికి వేరే ఇతర మార్గాలను అన్వేషించడం మంచిది. నిజానికి ఈ మాస్క్ కారణంగా సమస్యలు ఉండకపోవచ్చు.

ఈ ముల్తానీ మట్టి & నిమ్మకాయ మాస్క్ తయారు చేయడం మరియు ముఖానికి వర్తింపజేయడం ఎంత సులువో చూశారు కదా. సులభమైన ప్రక్రియ కూడా. కానీ, దీని ప్రయోజనాలు మాత్రం అపారం. ఈ వారాంతంలో కొత్తగా ప్రయత్నించి చూడండి. ఈ ముల్తానీ మట్టి & నిమ్మరసం ఫేస్ – మాస్క్ మీ చర్మానికి ఒక సడలింపుగా ఉంటుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

How To Use Multani Mitti And Lemon Face Mask To Get Rid Of Clogged Pores

Our skin - especially our face - is exposed to so much dirt, dust, and pollution every day. All these factors make our skin dull and often result in excess oil secretion and increase in the number of dead skin cells and clogged pores. Homemade face masks use basic ingredients from your kitchen. They are cost-effective and are easy to make and apply.