Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కెమికల్ పీల్ చేయించుకునే ముందు అడగాల్సిన తప్పనిసరి ప్రశ్నలు
కెమికల్ పీల్ ద్వారా చర్మాన్ని బాగుపరిచే పద్దతి , చర్మ సంబంధితమైన సమస్యలైన హైపర్ పిగ్మెంటేషన్, ముడతలు, చారలు, మొటిమలు, మచ్చలు మరియు నల్ల మచ్చలు వంటివి నివారించడానికి మంచి ప్రభావవంతమైన చికిత్స.
ఈ చికిత్సలో యాసిడ్లని, పాడైన చర్మ పైపొరలని తీసేయడానికి వాడతారు.సాధారాణంగా ఎక్కువ వాడే రసాయనాలు గ్లైకోలిక్ యాసిడ్, శాలీసైక్లిక్ యాసిడ్ మరియు లాక్టిక్ యాసిడ్.
ఈ సాధారణమైన కాస్మెటిక్ చికిత్స, కష్టతరమైన చర్మ సమస్యలను తీర్చడంలో మెరుగైనదిగా ప్రసిద్ధి.సమస్యలను పోగొట్టడమేకాక, ఈ చికిత్స మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి,అందాన్ని రెట్టింపు చేస్తుంది.

కానీ అన్ని కాస్మెటిక్ చికిత్సలలాగానే దీనితో కొన్ని సమస్యలు ఉన్నాయి.అందుకే ఈ కెమికల్ పీల్ కాస్మెటిక్ చికిత్స చేయించుకునే ముందు సరైన ప్రశ్నలు అడగటం అత్యవసరం.
ఈ రోజు ఇక్కడ బోల్డ్ స్కైలో మీరు ఈ చికిత్స పొందే ముందు తప్పనిసరిగా అడగాల్సిన ప్రశ్నల గురించి వివరిస్తున్నాం.
మంచి ఫలితాలు రావడానికి మీ డాక్టర్ ను ఈ ప్రశ్నలు అడగటం ముఖ్యం. అవేంటో ఇక్కడ చదవండి

1) కెమికల్ పీల్ చికిత్స ఎవరు తీసుకోవాలి
కెమికల్ పీల్ పద్దతి , చర్మ సంబంధితమైన సమస్యలైన హైపర్ పిగ్మెంటేషన్, ముడతలు, చారలు, మొటిమలు, మచ్చలు మరియు నల్ల మచ్చలు వంటివి పోగొట్టడానికి చేసే చికిత్స.అయినప్పటికీ, చికిత్స ముందు డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

2) చర్మాన్ని బాగుపరచడానికి వాడే వివిధ రసాయనాలు ఏంటి ?
మీ డెర్మటాలజిస్టును అడగాల్సిన రెండవ ప్రశ్న ఇది.చర్మాన్ని బాగుపరచడానికి చాలా రకాల రసాయనాలు ఉన్నాయి.మీ చర్మ సమస్యలను నివారించడానికి చాలా రకాల రసాయన పదార్థాలు ఉన్నాయి.ఉదాహరణకు గ్లైకోలిక్ పీల్, శాలీసైక్లిక్ పీల్, లాక్టిక్ పీల్, బీటా పీల్, రంగును సంతులనం చేసే పదార్థాలు మొదలైనవి.

3) ఇందులో వాడే పదార్థాలు ఏంటి?
ఈ చికిత్స చేయించుకోవాలంటే తరువాత అడగాల్సిన ప్రశ్న ఇందులో వాడే పదార్థాలు ఏంటి అని.ఇందులో వాడే పదార్థాలు మీ చర్మానికి పడతాయో లేదో తెలుసుకోవడం ముఖ్యం.

4) ఈ రసాయనిక చికిత్సకి ఎలా సిద్ధం కావాలి?
కావాల్సిన ఫలితాల కోసం చికిత్స ముందు జాగ్రత్త అవసరం.చికిత్స జరిగే ఒక వారం ముందు నుంచి చర్మాన్ని ఎక్కువ రుద్దకుండా,ఎండలో ఎక్కువ తిరగకుండా ఉంటే మంచిది.ఏదైనా మీ చర్మం రకాన్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మారతాయి.అందుకని, మీ డెర్మటాలజిస్టును అడగటం మంచిది.

5) ఎన్ని సెషన్స్ అవసరం?
మొహంపై చికిత్స కోసం, చాలా సెషన్స్ కావాల్సుంటుంది.సెషన్ల మద్య 3 వారాల విరామం కూడా ఉండచ్చు.కానీ మళ్ళీ ఇది మీ చర్మరకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.

6) ఈ రసాయనిక చికిత్స తరువాత ఏమవుతుంది?
ఒక సెషన్ తరువాత ముఖం ఎర్రగా అవ్వడం, అసమానంగా చర్మరంగు మరీయు చర్మం పొరలు ఊడిపోవడం వంటివి చాలామంది చూస్తారు.ఆఖరి ఫలితాలు మొత్తం చికిత్స అయ్యాక మాత్రమే కనిపిస్తాయి.

7) చికిత్స వలన దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా?
ఈ చికిత్సలో చర్మాన్ని బాగు చేయడానికి ఎన్నో కెమికల్స్ వాడతారు.కొందరి విషయంలో, ఈ రసాయనాలు ముఖం ఎర్రబడటం,చర్మం రంగు మారడం,చిరాకు,మంట వంటి దుష్ప్రభావాలు చూపించవచ్చు. అందుకే ఈ చికిత్స తీసుకునే ముందు, మీ డెర్మటాలజిస్టును ఇది కూడా అడగటం అత్యవసరం.



Click it and Unblock the Notifications