For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిర్జీవంగా ఉన్న ముఖ చర్మాన్ని పునరుత్తేజితం చేయడానికి మీరు పాటించవలసిన చిట్కాలు!

|

మీ చర్మతత్వం ఏ రకమైనదైప్పటికీ, జిడ్డు రకం అయినా,పొడిబారినదైనా, లేదా కాంబినేషన్ లేదా సాధారణ రకం అయినా, మీ చర్మం ఎల్లప్పుడు తాజాగా మరియు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.

మన చర్మం సాధారణంగా అధిక సూర్యరశ్మి, పర్యావరణ కాలుష్యం, జీవనశైలిలో మార్పులు మొదలైన అంశాలకు గురవుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే, మీ చర్మ పరిస్థితి, మరింత అధ్వాన్నంగా తయారవుతుంది. దీని వలన చర్మంపై మచ్చలు, ఇన్ఫెక్షన్లు, కమిలిపోవడం, నిస్తేజంగా మారడం మరియు పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

Tips On How To Pamper Your Dull Skin

మీ కొరకు మా దగ్గర కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇవి రోజూ జాగ్రత్తగా పాటిస్తే, మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. మరి అవి ఏమిటో తెలుసుకోండి.

 మాయిశ్చరైజింగ్ అత్యవసరం

మాయిశ్చరైజింగ్ అత్యవసరం

మీ చర్మాన్ని తేమగా ఉంటే, ఆరోగ్యకరంగా ఉంటుంది. మీ చర్మం ఆరోగ్యంగా మరియు తాజాగా కనిపించడానికి, తేమగా ఉండడం చాలా ముఖ్యం. కనుక, ప్రతిరోజూ పొద్దుట మరియు రాత్రి పడుకునే ముందు, మీ ముఖానికి కొంత మాయిశ్చరైజర్ ను తప్పక రాసుకోండి.

మీ చర్మ సంరక్షణ పద్ధతులను మార్చుకోండి

మీ చర్మ సంరక్షణ పద్ధతులను మార్చుకోండి

ఎప్పుడూ ఒకే రకమైన చర్మ సంరక్షణ పద్ధతులను పాటిస్తే, అవి పని చేయకపోవచ్చు. వేసవికాలంలో పని చేసే పద్ధతి, శీతాకాలంలో పని చేయకపోవచ్చు. కాబట్టి మీరు మీ చర్మ సంరక్షణను మీ చుట్టూ ఉన్న వాతావరణంను అనుసరించి అంచనా వేయడం ముఖ్యం, తద్వారా మీ చర్మానికి కాలానుగుణంగా ఏది అవసరమో, అది అందించే వీలు కుదురుతుంది. వేసవిలో SPF 30 ను కలిగి ఉన్న ఉన్న సన్ స్క్రీన్ ను ఉపయోగించండి మరియు సంవత్సరం అంతటా UVA మరియు UVB రెండింటినీ కలిగి ఉన్న సన్ స్క్రీన్ ను ఉపయోగించండి. తద్వారా, మీరు అన్ని సీజన్లలో సంపూర్ణ సంరక్షణ పొందవచ్చు.

ఫేస్ మాస్క్ ను ఉపయోగించండి:

ఫేస్ మాస్క్ ను ఉపయోగించండి:

మీ చర్మం మృదువుగా, కాంతివంతంగా మరియు ఆరోగ్యకరంగా ఉండాలంటే చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసుకున్నంత మాత్రాన సరిపోదు. ఫేస్ మాస్కును వాడటం వలన మీ చర్మానికి అదనపు కాంతి చేకూరుతుంది.

చర్మంపై వృద్దాప్య ఛాయలు కనపడకుండా, ఎర్రదనం రాకుండా , మచ్చలు, మొదలైనవి వంటి కొన్ని సాధారణ చర్మ సమస్యలు తలెత్తకుండా పరిష్కరించడంలో మీకు సహాయపడే ఒక మాస్కును ఎంచుకోండి. వేగవంతమైన మరియు మెరుగైన ఫలితాల కోసం, కనీసం వారానికి ఒక్కసారి ఈ మాస్కును ఉపయోగించండి.

మీ కాళ్ళ సంరక్షణపై శ్రద్ధ తీసుకోండి:

మీ కాళ్ళ సంరక్షణపై శ్రద్ధ తీసుకోండి:

మీ కాళ్ళలో తైల గ్రంధులు తక్కువగా ఉన్నందున, పొడిబారి ఉంటాయి. అంతేకాకుండా, ఈ ప్రాంతంలో వెంట్రుకల పెరుగుదల శరీరం యొక్క ఇతర భాగాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. కనుక,ఇతర ప్రాంతాలతో పోలిస్తే, కాళ్ళ మీద వెంట్రుకలను మనం తరచుగా తొలగిస్తుంటాము. కన్నా ఎక్కువగా జుట్టును తీసివేస్తాము.

దీని కారణంగా కాళ్ళ మీది చర్మం పొడిబారి, పొలుసులుగా మారుతుంది. కాబట్టి మీ జుట్టును తీసివేసిన ప్రతిసారీ మాయిశ్చరైజర్ ని ఉపయోగించడం ముఖ్యం. వాక్సింగ్, షేవింగ్ లేదా హెయిర్ రిమూవర్ క్రీమ్ వాడినా కానీ, ఏ పద్దతిని అనుసరించినా, తేమను కాపాడుకోవడానికి మాయిశ్చరైజర్ ని ఉపయోగించడం తప్పనిసరి.

స్క్రబ్బింగ్ పరిమితంగా చేసుకోండి:

స్క్రబ్బింగ్ పరిమితంగా చేసుకోండి:

మీ చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగించడం చాలా ముఖ్యం.ఇలా చేస్తే మీ చర్మం ప్రకాశవంతంగా మరియు ఆరోగ్యకరంగా తయారవుతుంది.

కానీ తరచుగా స్క్రబ్బింగ్ చేసుకోవడం వలన చర్మం దెబ్బతింటుంది. కనుక, మీరెప్పుడు స్క్రబ్ ను ఉపయోగించినా, ఎలా ఉపయోగించాలో,ఎంత తరచుగా ఉపయోగించాలో తెలుసుకోండి. మీరు మార్కెట్లో లభించే సున్నితమైన స్క్రబ్లను ఉపయోగించుకోవచ్చు లేదా ఇంట్లో మీ సహజమైన స్క్రబ్ ను తయారు చేసుకోవచ్చు. ఇంట్లో సాధారణంగా దొరికే పదార్థాలతో సులువుగా చేసుకోగలిగేది చక్కెర స్క్రబ్. దీన్ని ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

1-2 టేబుల్ స్పూన్లు గ్రాన్యులేటెడ్ చక్కెర

2-3 టేబుల్ స్పూన్ నిమ్మ రసం

ఎలా ఉపయోగించాలి?

ఎలా ఉపయోగించాలి?

1. ముందుగా, గ్రాన్యులేటెడ్ చక్కెర మరియు తాజా నిమ్మరసం కలిపి కలపాలి.

2. మీ వేలికొనలను వలయాకార కదలిస్తూ, ఈ మిశ్రమాన్ని ముఖానికి మృదువుగా మర్దన చేసుకోండి.

3. ఇలా 2-3 నిమిషాల పాటు చేసాక, ఇది 10-15 నిమిషాల పాటు ఆరనివ్వండి.

4. తరువాత, సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని, పొడిగా తుడుచుకోండి.

5. తరువాత మీరెప్పుడు వాడే మాయిశ్చరైజర్ తో ముఖాన్ని మృదువుగా మర్దన చేసుకోండి.

English summary

Tips On How To Pamper Your Dull Skin

Whatever skin type you have, be it oily, dry, combination or even normal, you need to pamper your skin on a regular basis to keep up that fresh and healthy look always.Our skin is generally exposed to a lot of factors like excess sunlight, environmental pollutions, changes in lifestyle, etc.And not taking proper care of it will make your skin condition worse.
Story first published: Friday, July 20, 2018, 18:10 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more