Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
కాంతివంతమైన చర్మం కోసం ఈ అద్భుతంగా పనిచేసే ఈ పదార్థాలను ప్రయత్నించి చూడండి !
కాంతివంతమైన చర్మం కోసం ఈ అద్భుతంగా పనిచేసే ఈ పదార్థాలను ప్రయత్నించి చూడండి !
నిమ్మకాయలు యాంటీ ఆక్సిడెంట్లతో పూర్తిగా నిండి ఉంటాయి, అంతేకాకుండా వీటిలో ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు కూడా ఉంటాయి.
కానీ ఈ నిమ్మకాయలు మీ ఆరోగ్యప్రయోజనాలను పెంపొందించడమే కాకుండా మీ చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో కూడా సహాయపడుతుందని మీకు తెలుసా ? అవును, మీరు చదివింది నిజమే ! యవ్వనమైన, కాంతివంతమైన చర్మాన్ని మా పొందడానికి నిమ్మకాయలతో చేసిన ఫేస్ మాస్కులు / ఫేస్ ప్యాక్లను ఉపయోగించవచ్చు.

స్కిన్ టాన్, డ్రై స్కిన్, బ్లేమిసేస్ వంటి చర్మ సమస్యలను మనము సాధారణంగా ఎదుర్కొంటున్నాము. ఇలాంటి సమస్యలన్నింటికీ ఒకే ఒక పరిష్కారము నిమ్మకాయ రూపంలో మనకు లభిస్తుంది కాబట్టి, ఈ వేసవిలో మీరు నిమ్మకాయను తప్పక ప్రయత్నించి చూడండి. సిట్రిక్ లక్షణాలను కలిగి ఉన్న ఈ నిమ్మపండు మనకు ప్రతి సీజన్లో సులభంగా లభిస్తాయి. కాబట్టి మీరు నిమ్మరసాన్ని తిరిగే సమయంలో, చర్మ సంరక్షణ కోసం నిమ్మకాయను బాహ్యంగా వినియోగించడాన్ని మరిచిపోవద్దు.
ఇప్పుడు మీరు వాటిని ఎలా ఉపయోగించాలో అని ఆశ్చర్యపోతున్నారా ? చింతించకండి ! మీ చర్మం కోసం నిమ్మకాయ కలుగజేసే సౌందర్య ప్రయోజనాలను తెలపడంలో మేము మీకు సహాయం చేస్తాం. అందమైన, దోషరహితమైన చర్మాన్ని పొందడం కోసం నిమ్మకాయను ఏవిధమైన ప్యాక్స్ / మాస్క్లలో ఉపయోగించాలో మేము మీకు తెలియజేస్తాము.
ఇదొక్కటే అనేక చర్మ సమస్యలకు పరిష్కారమార్గం. దోషరహితమైన చర్మాన్ని పొందడానికి మీ ఇంటిలో నుంచే మీరు ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. కాబట్టి మీ రోజువారి చర్మసంరక్షణలో నిమ్మకాయలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం !

స్టెప్ 1 : క్లీన్సింగ్
ఫేషియల్లో పాటించవలసిన మొట్టమొదటి చర్య ఇది. ఇది మీ చర్మంపై ఉన్న మురికిని శ్లేష్మము ఇతర అవాంచిత మలినాలను తొలగించి ముఖాన్ని శుభ్రపరుస్తుంది.
కావలసినవి :
1 టేబుల్ స్పూన్ నిమ్మ పై తొక్క (పొడిరూపంలో)
2-3 టీస్పూన్ల పాలు
తయారీ విధానం :
పైన తెలిపిన పదార్థాలను రెండింటిని ఒక కప్పు లోకి తీసుకొని, బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, 2-3 నిమిషాల వరకు అలానే వదిలివేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ విధంగా మొదటి దశ పూర్తవుతుంది.

స్టెప్ 2 : స్క్రబ్బింగ్
క్లీన్సింగ్ తర్వాత పాటించవలసిన రెండోదశ స్క్రబ్బింగ్. చనిపోయిన చర్మ కణాలను పూర్తిగా తొలగించి, మీ ముఖము రూపాన్ని సహజంగా మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.
కావలసినవి :
2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె
1 టేబుల్స్పూను గ్రాన్యులేటెడ్ షుగర్
కొన్ని చుక్కల నిమ్మనూనె
తయారీ విధానం :
ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూను షుగర్ను తీసుకుని దానికి కొన్ని చుక్కల నిమ్మరసంను జోడించండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను చేర్చి బాగా కలపాలి. మీ ముఖంపై వృత్తాకార కదలికల ఈ మిశ్రమాన్ని 5-6 నిమిషాల పాటు స్క్రబ్ చేస్తూ శుభ్రపరచాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మం పై చనిపోయిన చర్మ కణాలను తొలగించి, మృదువైన - మెరుగైన చర్మాన్ని పెంపొందిస్తుంది. 5 నిమిషాల తర్వాత సాధారణ నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

స్టెప్ 3 : ఫేస్-మాస్క్
ఫేషియల్ ప్రక్రియలో ఫేస్మాస్క్ అనేది అత్యంత కీలకమైన దశ. ఫేస్-మాస్క్ మీ చర్మాన్ని హైడ్రేట్గా ఉంచి మీరు మరింత అందంగా కనపడేటట్టు చేస్తుంది. ఇక కొన్ని నిమ్మ ఆధారమైన ఫేస్-మాస్కులు వున్నాయి. అవి
a) అరటి-నిమ్మల ఫేస్మాస్క్ :
ఈ ఫేస్-మాస్కులు మొటిమలను, చర్మపు మంటలను తగ్గించి, మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
కావలసినవి :
1 నిమ్మకాయ
1 అరటిపండు
తయారీ విధానం :
ఒక గిన్నెలో, అరటిపండు గుజ్జును మెత్తని పేస్టులా చేసి దానికి కొన్నిచుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని మీ ముఖంపై లేపనంగా అప్లై చేయాలి. అలా 15 - 20 నిమిషాల వరకు వేచి ఉన్న తర్వాత మీ ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకొని పొడిగా మార్చుకోవాలి.

b) నిమ్మ - ఓట్మీల్ ఫేస్ప్యాక్ :
కావలసినవి :
2 టేబుల్ స్పూన్ల నిమ్మ పై తొక్క (పొడిరూపంలో)
1 టీస్పూను తేనె
1 టేబుల్స్పూన్ ఓట్మీల్ పౌడర్
తయారీ విధానం :
పైన తెలిపిన అన్ని పదార్థాలను కలిపి మందపాటి పేస్టులా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లైచేసి 20 నిమిషాల పాటు అలానే వదిలివేయాలి. మృదువైన & సున్నితమైన చర్మాన్ని పొందడానికి చివరిగా గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ప్యాక్ పొడి చర్మం ఉన్నవారికి అద్భుతంగా పనిచేస్తుంది.

c) పసుపు - నిమ్మల ఫీల్తో చేసిన పేస్ ప్యాక్ :
కావలసినవి :
1 టేబుల్ స్పూన్ నిమ్మ పై తొక్క (పొడిరూపంలో)
1 టేబుల్ స్పూన్ రోజ్వాటర్
చిటికెడు పసుపు
తయారీ విధానం :
ఒక గిన్నెలో నిమ్మతొక్క పొడిని & పసుపును ఒకటిగా కలపాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ను జోడించి మెత్తని పేస్టులా తయారుచేసుకోవాలి. మీ ముఖము & మెడ భాగాలలో ఈ పేస్ట్ను అప్లై చేసి, 10-15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. పదిహేను నిమిషాల తర్వాత వృత్తాకార కదలికలలో శుభ్రపరుస్తూ, చల్లని నీటితో మీ ముఖాన్ని కడగాలి.

d) అలోవెరా - నిమ్మల ఫీల్తో చేసిన పేస్ ప్యాక్ :
ఈ ప్యాక్ మీ చర్మంపై ఏర్పడిన రెడ్నేస్ను, సన్బర్న్ తొలగించి మీ చర్మ ఛాయను మరింతగా మెరుగుపరుస్తుంది.
కావలసినవి :
2 టేబుల్ స్పూన్ల నిమ్మ పై తొక్క (పొడిరూపంలో)
2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్
కొన్ని చుక్కల నిమ్మరసం
తయారీ విధానం :
తాజా అలోవెర మొక్కనుంచి సేకరించిన గుజ్జును ఒక కప్పులోకి తీసుకోవాలి. ఒకవేళ మీకు సహజసిద్ధమైన అలోవెరా మొక్క అందుబాటులో లేకపోతే, మార్కెట్లో అందుబాటులో ఉన్న రెడీమేడ్ అలోవెరా జెల్ ఉపయోగించవచ్చు. దానికి నిమ్మ తొక్కతో చేసిన పొడిని & కొన్నిచుక్కల నిమ్మరసాన్ని జోడించి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల వరకు పొడిగా మారేంత వరకు ఉండనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఇప్పటివరకు పైన తెలిపిన ఫేస్ ప్యాక్లు అన్నీ కూడా మీ చర్మంపై అద్భుతంగా పని చేయగలవు. ఈ ఫేస్ ప్యాక్ను వారంలో ఒకసారి (లేదా) నెలలో రెండుసార్లు ఆచరించడంవల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను మీరే స్వయంగా చూడవచ్చు !



Click it and Unblock the Notifications











