For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై నోస్ సమస్య ఎందుకు తలెత్తుతుంది? ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగించే చిట్కాలు

డ్రై నోస్ సమస్య ఎందుకు తలెత్తుతుంది? ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం ఈ టిప్స్ ను ఫాలో అవండి

|

డ్రై లేదా ఫ్లేకీ నోస్ సమస్య సాధారణంగా వింటర్ సీజన్ లో కనిపిస్తుంది. నోస్ కు రెండువైపులా ఈ సమస్య తలెత్తవచ్చు లేదా నోస్ పైన తలెత్తవచ్చు. కారణమేదైనా, నోస్ చుట్టూ డ్రై స్కిన్ అనేది ఫ్లేకీగా, స్కేలీగా అలాగే పీలింగ్ గా ఉంటూ నొప్పిగా ఉంటుంది.

వింటర్ సీజన్ లోనే ఈ సమస్య తలెత్తాలనేం లేదు. డ్రై స్కిన్ అనేది అనేక ఇతర ఫాక్టర్స్ వలన కూడా ఏర్పడుతుంది.

మీరు వాడే కాస్మటిక్స్ అలాగే సోప్స్ వలన స్కిన్ అనేది డ్రై గా మారుతుంది. ఏజింగ్ ప్రాసెస్ వలన కూడా స్కిన్ డ్రై గా మారుతుంది. ఎందుకంటే సెబాసియస్ గ్లాండ్స్ పనితనం వయసు మీరుతున్న కొద్దీ మందగిస్తుంది. అలాగే క్లైమేట్ ఛేంజెస్, కొన్ని మెడికేషన్స్, కాంటాక్ట్ డెర్మటైటిస్, పెరి-ఓరల్ డెర్మటైటిస్, మేకప్ అండ్ కాస్మెటిక్స్, సెబారీక్ డెర్మటైటిస్ వంటి వాటివలన కూడా డ్రై స్కిన్ సమస్య తలెత్తుతుంది.

కొంతమందికి ఇది క్రానిక్ సమస్య, మరికొంతమందిలో ఈ సమస్యను సులువుగా నివారించవచ్చు. అయితే, స్కిన్ పట్ల కాస్తంత శ్రద్దని కనబరచడం తప్పనిసరి. ఏది ఏమైనా, క్రానిక్ సమస్య అయినప్పుడు మెడికేషన్స్ ని తీసుకోవడం మంచిది. సాధారణ డ్రై స్కిన్ సమస్యను మాత్రం నేచురల్ హోమ్ రెమెడీస్ ను అలాగే టిప్స్ ను పాటించి పరిష్కరించుకోవచ్చు. ఫ్లేకీ మరియు డ్రై నోస్ సమస్యను ఇంటివద్దే సులభంగా ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పెట్రోలియం జెల్లీ:

పెట్రోలియం జెల్లీ:

ఫ్లేకీ మరియు డ్రై నోస్ సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందటం కోసం ఈ రెమెడీ అద్భుతంగా పనికొస్తుంది. కాస్తంత పెట్రోలియం జెల్లీని నోస్ పైన లేదా నోస్ కు ఇరువైపులా అంటే ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. ఆ తరువాత సున్నితంగా మసాజ్ చేయాలి. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేయాలి. అలాగే ఉదయాన్నే కూడా ఈ పద్దతిని పాటించాలి. పెట్రోలియం జెల్లీ అనేది చౌకైన మాయిశ్చరైజర్. దీనిని వాడటం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

ఆల్మండ్ ఆయిల్:

ఆల్మండ్ ఆయిల్:

ఆల్మండ్ ఆయిల్ లో అనేక బ్యూటీ బెనిఫిట్స్ కలవు. ఇవి చర్మానికి అలాగే శిరోజాలకు మంచి చేస్తాయి. కాస్తంత ఆల్మండ్ ఆయిల్ ను ఫ్లేకీ నోస్ పైన అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయాలి. అలోవెరాతో కలిపి వాడితే మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఒక టీస్పూన్ అలోవెరా మరియు ఒక టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్ ను కలిపి నోస్ పైన అప్లై చేస్తే ఆశించిన ఫలితాలను పొందవచ్చు.

ఐస్ ను అప్లై చేయండి:

ఐస్ ను అప్లై చేయండి:

నోస్ చుట్టూ ఇంఫ్లేమేషన్ ఏర్పడినప్పుడు నోస్ రెడ్ గా అలాగే ఇచీగా మారుతుంది. ఇది ఇరిటేషన్ ను మరింత పెంచుతుంది. కాబట్టి, ఐస్ క్యూబ్స్ తో ఈ లక్షణాలను తగ్గించుకోవచ్చు. ఒక టవల్ లో ఐస్ క్యూబ్స్ ని వేసి టవల్ ను చుట్టి దాంతో డ్రై మరియు ఫ్లేకీ ఏరియాపై రుద్దాలి. స్కిన్ పై ఐస్ ను డైరెక్ట్ గా అప్లై చేయకూడదని గుర్తుంచుకోండి. అలా అప్లై చేస్తే స్కిన్ మరింత డేమేజ్ అవుతుంది. ఈ పద్దతిని రోజుకు రెండు సార్లు పాటించాలి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరినూనెలో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా కలవు. అందుకే ఇది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. స్కిన్ దీనిని త్వరగా గ్రహిస్తుంది. స్కిన్ టోన్ ని ఈవెన్ చేయడానికి అలాగే స్కిన్ ని మృదువుగా, కాంతివంతంగా చేయడానికి కొబ్బరినూనె అమితంగా తోడ్పడుతుంది. కాస్తంత కొబ్బరి నూనెను తీసుకుని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి. రెడీ మేడ్ మాయిశ్చరైజర్స్ కంటే ఈ రెమెడీ సమర్థవంతంగా పనిచేస్తుంది.

ఎక్కువ సేపు షవర్ తీసుకోకండి:

ఎక్కువ సేపు షవర్ తీసుకోకండి:

ఎక్కువ సేపు షవర్ లో ఉండటం వలన శరీరంలోని సహజసిద్ధమైన ఆయిల్స్ అనేవి తొలగిపోతాయి. దీని వలన చర్మం డ్రైగా అలాగే ఫ్లేకీగా మారుతుంది. కాబట్టి, చర్మంలోని మాయిశ్చరైజర్ నిలిచి ఉండాలంటే షవర్ టైం పై శ్రద్ధ వహించాలి. మాగ్జిమమ్ 10-15 నిమిషాల కంటే ఎక్కువ సేపు షవర్ లో టైం స్పెండ్ చేయకండి.

ఎక్స్ఫోలియేషన్:

ఎక్స్ఫోలియేషన్:

చర్మాన్ని హైడ్రేటెడ్ గా చేసి మాయిశ్చరైజ్ చేసేందుకు ఎక్స్ఫోలియేషన్ ప్రక్రియ తోడ్పడుతుంది. సరైన విధంగా ఎక్స్ఫోలియేషన్ ని పాటిస్తే చర్మం డ్రై గా మారదు. వారానికి రెండు లేదా మూడు సార్లు ఎక్స్ఫోలియేషన్ ని పాటించాలి. అతిగా ఎక్స్ఫోలియెట్ చేయడం వలన కూడా స్కిన్ కి డేమేజ్ జరుగుతుందని గుర్తించాలి.

నీళ్లను తాగండి:

నీళ్లను తాగండి:

చర్మాన్ని బయటనుంచి మాయిశ్చరైజ్ చేస్తే ఫ్లేకీ నోస్ సమస్య తగ్గుతుందని ఆశించకండి. చర్మాన్ని లోపల నుంచి కూడా హైడ్రేట్ చేయాలి. శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం ద్వారా కూడా చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. నీళ్లని తగిన మోతాదులో తీసుకోవడం ద్వారా మీరు చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోగలుగుతారు. డ్రై నోస్ సమస్యను మీరు సులభంగా అరికట్టగలుగుతారు. కాబట్టి, ఫ్లేకీ మరియు డ్రై నోస్ సమస్య నుంచి రక్షణ కోసం మీరు నీళ్లను తగిన మోతాదులో తీసుకోవాలి.

English summary

Why do you have dry nose? Some Tips To Follow

Dry or flaky nose is normally seen mostly during the winter season. It can appear either on both sides of the nose or even on the nose. Some natural home remedies and tips like petroleum jelly, exfoliation, washing your face with warm water, etc., will help you to get rid of this issue.Why Do You Have Dry Nose? Some Tips To Follow.
Story first published:Saturday, April 7, 2018, 16:14 [IST]
Desktop Bottom Promotion