Latest Updates
-
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే! -
ఒకే రకమైన మందులు.. వేర్వేరు ఫలితాలు..లివర్ డ్యామేజ్ వెనుక ఉన్న రహస్యం ఇదే! -
హ్యాపీ హోలీ 2026..మీ బంధుమిత్రులకు పంపడానికి బెస్ట్ హోలీ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే! -
ఈ హోలీకి అదిరిపోయే స్నాక్..అతిథులను మెప్పించే కరకరలాడే హెల్దీ రైస్ కుర్కురే..ఎలా చేసుకోవాలంటే..
జామ ఫేస్ ప్యాక్ : మీ చర్మం కోమలంగా..ప్రకాశంతంగా మెరిసిపోతుంది
జామ ఫేస్ ప్యాక్ : మీ చర్మం కోమలంగా..ప్రకాశంతంగా మెరిసిపోతుంది
జామకాయ అంటే తెలియనివారుండరు. మన దేశంలో జామకాలు విరివిగా లభిస్తాయి. జామకాయల్లో విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని మరియు మంచి జీర్ణక్రియను అందిస్తాయి. ఇది మనందరికి తెలిసిన వాస్తవం. అయితే జామకాయ మీ చర్మాన్ని మెరుస్తూ..కాంతివంతంగా.. అందంగా తీర్చిదిద్దే సామర్థ్యం జామకాయకు ఉందని మీకు తెలుసా?

జామకాయలో విటమిన్ సి, బి మరియు ఎ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన శరీరంలో కొల్లాజెన్ అనే ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుతాయి. అందువలన, చర్మం సూర్యకిరణాల నుండి రక్షించబడుతుంది. దాంతో చర్మ నల్లగా మారకుండా రక్షణ కల్పిస్తుంది.

జామతో ఫేస్ ప్యాక్
మీరు జామకాయను ఉపయోగించి ఇంట్లో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్ వల్ల మీ ముఖం రిఫ్రెష్ అవుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా మీరు అందంగా కనబడుతారు.

చర్మ మెరిసేలా కాంతివంతం చేస్తుంది
జామకాయలో యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎలాంటి చర్మ సమస్యలైనా చిటికెలో మాయం చేస్తుంది. ఇంకా ఇది మీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. చర్మాన్ని విశ్రాంతి కల్పించండి. క్రింద ఇచ్చిన విధంగా ఫేస్ ప్యాక్ తయారు చేసి అప్లై చేయవచ్చు. మంచి ఫలితాల కోసం వారానికి ఒకసారి ఈ ప్యాక్ ను ఉపయోగించండి.
కావల్సినవి:
తేనె - 1 టేబుల్ స్పూన్
జామకాయ (తొక్క)
తయారుచేసే పద్దతి
మొదటగా జామకాయను శుభ్రంగా కడిగి టవల్ తో తేమ పూర్తిగా తుడిచి తర్వాత జామకాయను తురమాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. బాగా రెండూ కలిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, 20 నిముషాలు అలాగే ఉంచాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

డ్రై స్కిన్ నివారించడానికి
జామకాయలోని హైడ్రేషన్ గుణాలు మీ చర్మానికి అవసరమైన తేమను ఇస్తుంది మరియు చర్మానికి ఆరోగ్యకరమైన కాంతవంతమైన రూపాన్ని ఇస్తుంది. చర్మం పొడిబారడం నుండి బయటపడటానికి క్రింది పద్ధతిని ఉపయోగించి ఫేస్ ప్యాక్‌లను వారానికి రెండుసార్లు ఉపయోగించండి.
కావాల్సినవి:
ఓట్స్ - 1 టేబుల్ స్పూన్
గుడ్డు పచ్చసొన - 1
తేనె - 1 టేబుల్ స్పూన్
జామకాయ - ½ పండు
తయారుచేసే పద్దతి:
మొదటగా మీరు జామకాయను తురుముకోవాలి. 1 టేబుల్ స్పూన్ వోట్స్ తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ తేనె, జామకాయ తురుము, ఓట్ మీల్ పౌడర్ మరియు గుడ్డు పచ్చసొన కలపాలి. దీన్ని మీ ముఖానికి రాయండి. 30 నిమిషాలు తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో కడిగి, మెత్తటి టవల్ తో ముఖాన్ని తేమలేకుండా తుడవాలి. ఉత్తమ ఫలితాల కోసం వారంలో రెండు సార్లు ఉపయోగించుకోవచ్చు.

చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి
జామకాయలోని విటమిన్లు మీ చర్మాన్ని రిఫ్రెష్ చేసి మెరిసే రూపాన్ని ఇస్తాయి. కాంతివిహీనంగా, నిర్జీవంగా కనిపించే మీ చర్మాన్ని కాంతివంతంగా మరియు ప్రకాశవంతంగా మెరిపిస్తాయి. ఈ క్రింది పద్దతిని అనుసరించడం ద్వారా నిగనిగలాడే చర్మాన్ని పొందండి.
కావల్సినవి:
నీరు - 1 కప్పు
జామకాయ - 1
తయారుచేయు పద్దతి:
జామకాయను చిన్న ముక్కలుగా కోసి కొద్దిగా నీటితో కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని మీ ముఖానికి రాయండి. 20 నిమిషాలు తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి.

దద్దుర్లు, మొటిమలను తొలగించడానికి
జామ పండ్లలోని సహజ శక్తి మొటిమలను తొలగించడానికి మరియు ముఖం మీద మొటిమలను, దద్దుర్ల నుండి ఉపశమనం చేయడానికి సహాయపడుతుంది. మీ ముఖం మీద నల్ల మచ్చలు మరియు మొటిమలకు చికిత్స చేయడానికి క్రింది పద్ధతిని ఉపయోగించండి.
కావాల్సినవి:
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
జామకాయ - 1
తేనె - 1 టేబుల్ స్పూన్
తయారుచేయు పద్ధతి:
మొదటగా జామకాయను తురుమి అందులో నుండి రసం తియ్యాలి. ఒక గిన్నె తీసుకుని అందులో జామకాయ రసంతో పాటు 1 టేబుల్ స్పూన్ తేనె మరియు 1 టీస్పూన్ నిమ్మరసంతో బాగా కలపండి. దీన్ని మీ ముఖానికి రాయండి. 30 నిమిషాలు తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. ఈ పద్ధతులను అనుసరించండి మరియు మీ ముఖాన్ని ప్రకాశవంతం చేయండి.



Click it and Unblock the Notifications











