Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
హైపర్ పిగ్మెంటేషన్: చర్మం నల్లగా మారడానికి కారణాలు, లక్షణాలు, నివారణ
ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ ను పిగ్మెంటేషన్ అంటారు. ముఖం ఎంత అందంగా ఉన్నా, ముఖంలో మొటిమలు మరియు మచ్చలు వంటివి అసౌకర్యాన్ని కలిగించి చాలా మందిలో విశ్వాసాన్ని తగ్గిస్తుంది. ముఖంలో ఇటువంటి నల్ల మచ్చలు ఏర్పడటానికి కారణం రకరకాల క్రీములు, సౌందర్య ఉత్పత్తలును ఉపయోగించడం ద్వారా నల్ల మచ్చలు పెరుగుతాయి. అయితే అందుకు కారణాలు మరియు నల్లమచ్చలు తొలగించుకోవడానికి పరిష్కారమార్గాలు తెలుసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అయితే మొదట అందుకు గల కారణం తెలుసుకోవాలి. వడదెబ్బ, ఎండలో ఎక్కువగా తిరగడం మరియు హార్మోన్ల సమస్యల వల్ల తరచుగా చర్మం రంగులో మార్పులు వస్తాయి.
స్కిన్ పిగ్మెంటేషన్ ప్రధానంగా మూడు రకాలున్నాయి. మెలస్మా మరియు పోస్ట్ ఇన్ఫ్లమేటరీ , హైపర్పిగ్మెంటేషన్. వీటిలో సూర్య కిరణాలు చర్మంపై పడటం వల్ల కలిగే పిట్మెంటేషన్ ప్రధానమైనది. కాబట్టి మీరు చేయవల్సిందల్లా మొదట వాటిని గుర్తించడం. తర్వాత ఎండలో ఎక్కువగా తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ స్కిన్ పిగ్మెంటేషన్ కు కొద్దిగా శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం. స్కిన్ పిగ్మెంటేషన్ నివారించడానికి కొన్ని నివారణలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వోట్స్ మరియు టమోటాలు
ఓట్స్, టొమాటో జ్యూస్ మరియు పెరుగు సమంగా తీసుకోండి. వీటన్నింటిని ఒక బౌల్లో వేసి బాగా కలపండి. తర్వాత ముఖంపై అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత కడిగేయండి. ఇది వారానికి మూడు రోజులు ముఖానికి పూయవచ్చు. ఇది చర్మరంగును సులభంగా మార్చుతుంది. ఇంకా చర్మంను కాంతివంతంగా ప్రకాశవంతంగా మార్చడానికి , చర్మరంగను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాబట్టి, ఎటువంటి సందేహం లేకుండా దీనిని ఎదుర్కొందాం.

పసుపు పొడి మరియు పాలు
మీ ముఖం మీద పసుపు పొడి మరియు పాలుతో తయారుచేసిన పేస్ట్ రాయడం వల్ల చర్మానికి చికాకు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది పిగ్మెంటేషన్‌ను తొలగిస్తుంది మరియు చర్మంపై నల్లటి మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ పసుపులో కొద్దిగా పాలు కలిపి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దీని వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ తో పాటు అనేక చర్మ సమస్యలు తగ్గుతాయి.

నిమ్మరసం మరియు పసుపు
పసుపును చర్మ సంరక్షణ కోసం, చర్మ అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఉపయోగించవచ్చు. కొద్దిగా నిమ్మరసం తీసుకుని అందులో పసుపు వేసి మెత్తగా పేస్ట్ కలిపి ముఖానికి రాయండి. ఇది చర్మపు చికాకులను తగ్గించడానికి సహాయపడుతుంది మరియు హైపర్పిగ్మెంటేషన్ చికిత్సలో సహాయపడుతుంది. ముఖంలో, చర్మ సమస్యలను త్వరగా పరిష్కరించవచ్చు.

గంధం
చర్మ సంరక్షణలో గంధపు చెక్క చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీ ముఖానికి గంధపు చెక్క పేస్ట్ ను అప్లై చేయడం ద్వారా చర్మ రంగు మారడానికి సహాయపడుతుంది. స్కిన్ పిగ్మెంటేషన్ కారణంగా చర్మ రంగులో చాలా మార్పు వస్తుంది. చర్మంలో నల్ల మచ్చలు ఎక్కువగా కనబడుతాయి. కాబట్టి చర్మ రంగులో అస్పష్టతను తొలగించడానికి ఇది సహాయపడుతుంది. ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి గంధం కన్న ఎర్రచందనం బాగా పనిచేస్తుందని కూడా అంటుంటారు.

గంధం-పాలు మిక్స్
పసుపు, గంధం, పాలు మూడింటి మిశ్రమంతో తయారుచేసిన పేస్ట్ ను చర్మానికి లేపనంగా రాయడం వల్ల చర్మంలో నలుపు తగ్గిస్తుందని తేలింది. ఇది చర్మసమస్యలను, చర్మంలో చికాకులను తొలగించడానికి సహాయపడుతుంది మరియు స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది. ఈ మూడు పదార్థాలు ఒక గిన్నెలో వేసి కలపండి. రాత్రి పడుకునే ముందు ఈ పేస్ట్ ను ముఖానికి లేపనంగా రాయండి. దీన్ని అప్లై చేయడం ద్వారా చర్మం రంగు మారుతుంది. పిగ్మెంటేషన్ సమస్య తగ్గుతుంది, చర్మ తెల్లగా మారుతుంది.

రోజ్ వాటర్
రోజ్ వాటర్ లో ఇతర బ్యూటి ఉత్పత్తులు కూడా వాడవచ్చు. రోజ్ వాటర్ కి గందం చేర్చి పేస్ట్ చేయాలి. ఇది చర్మంలో పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. మరియు చర్మం మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుంది. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి డ్రై అయ్యే వరకు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. చర్మ సంరక్షణకు ఇది ఒక మంచి పరిష్కారం ఎటువంటి సందేహం లేదు.

బొప్పాయి మరియు పాలు
పండిన బొప్పాయి, పాలు కలిపి ముఖానికి రాయాలి. ఇది చర్మ సంరక్షణకు ఉత్తమంగా పనిచేస్తుంది. చర్మంలో నాణ్యతను అందిస్తుంది. ముఖానికి బొప్పాయి మరియు పాల మిశ్రమాన్ని అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల స్కిన్ హైపర్పిగ్మెంటేషన్ నివారించడానికి సహాయపడుతుంది. ఇది చర్మ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది మరియు ముఖం ప్రకాశవంతంగా మార్చడానికి, చర్మ రంగును పెంచడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications