Skin Care Tips:చలికాలంలో చర్మ సంరక్షణ కోసం ఈ చిట్కాలు పాటించండి... యవ్వనంగా కనిపించండి...

రాత్రి వేళలో మీ చర్మం పొడిబారకుండా, మెరుగవ్వాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడే చూసెయ్యండి

మనమంతా 2022 నూతన సంవత్సరంలోకి ఆనందంగా అడుగుపెట్టేశాం. కొత్త ఏడాది అనగానే ప్రతి ఒక్కరిలోనూ ఏదో తెలియని కొత్త ఉత్సాహం ఉప్పోంగిపోతుంది. అలాగే నేటి నుండి ప్రతి ఒక్కటీ కొత్తగా ప్రారంభించాలన్న కోరిక కూడా స్టార్టవుతుంది.

Night Skin Care Tips in Winter For Glowing Skin in Telugu

కొత్త రిజల్యూషన్స్ తో పాటు కొత్త జీవనశైలికి శ్రీకారం చుట్టేందుకు చాలా మంది రెడీ అయిపోతారు. ఈ నేపథ్యంలోనే బ్యూటీ లేదా ఫ్యాషన్ కు కూడా ఎందుకు ప్రియారిటీ ఇవ్వకూడదు.. 2022లో మీరు కొత్త లుక్ లో ఎందుకు కనిపించకూడదు.. కాబట్టి నూతన సంవత్సర వేళ.. మీరు కొంచెం కొత్త లుక్ ట్రై చేయండి.. ముఖ్యంగా చలికాలంలో మీ చర్మ సౌందర్యాన్ని మరింత మెరుగుపరచుకోండి..

Night Skin Care Tips in Winter For Glowing Skin in Telugu

అయితే చలికాలంలో చర్మ సంరక్షణ అనేది కొంచెం కష్టమైన పనే.. ఎందుకంటే వింటర్ సీజన్లో మేకప్ వేసుకోవడం వల్ల మొటిమలు, ముఖంపై మచ్చలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చర్మాన్ని సంరక్షించుకోకపోవడం వల్ల చర్మం పొడిగా మరియు రఫ్ గా మారుతుంది. ఈ నేపథ్యంలో చలికాలంలో చర్మాన్ని సంరక్షించుకోవాలంటే రాత్రి వేళలో చర్మ సంరక్షణను పాటించడం అవసరం. ఈ సందర్భంగా శీతాకాలంలో మెరిసే చర్మం కావాలంటే రాత్రి వేళలో ఏం చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఫేస్ క్లీన్..

ఫేస్ క్లీన్..

చలికాలంలో ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మీ ఫేసును క్లీన్ గా కడుక్కోవాలి. మీరు ముఖానికి మేకప్ ఉపయోగిస్తే, మీరు రాత్రి పడుకునే ముందు కచ్చితంగా మేకప్ ను తొలగించాలి. రాత్రి వేళ ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలోని మురికి తొలగిపోతుంది. అంతేకాదు ముఖంపై మొటిమల సమస్య కూడా తగ్గిపోతుంది.

సీరం మంచిది..

సీరం మంచిది..

చలికాలంలో చర్మ సంరక్షణకు సీరమ్ చాలా ఉపయోగపడుతుంది. మెరిసే చర్మానికి ఈ సీరం చాలా మంచిదని చాలా మంది భావిస్తారు. కాబట్టి చలికాలంలో రాత్రి పూట ముఖం కడుక్కున్న తర్వాత ముఖానికి సీరమ్ రాసుకోవాలి. సీరమ్ అప్లై చేయడం వల్ల మీ ముఖంపై మొటిమలు తొలగిపోతాయి.. అంతేకాదు మొటిమల సమస్య కూడా తగ్గిపోతుంది. సీరమ్ చాలా తేలికగా ఉంటుంది. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అందుకే రాత్రి వేళ చర్మ సంరక్షణ కోసం సీరమ్ అప్లై చేసేయండి.

మాయిశ్చరైజ్..

మాయిశ్చరైజ్..

చలికాలంలో మీ చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించాలి. కాలుష్యం, హానికరమైన UV కిరణాల బారిన పడుతూ రోజూ మన చర్మం పలు కారణాల వల్ల పాడవుతూ ఉంటుంది. అందుకే చలికాలంలో వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు చక్కని ఫేస్ ప్యాక్ లేదా ఫేస్ మాస్క్ ట్రై చేయండి. దీని వల్ల మీ చర్మ ఛాయ మెరుగుపడుతుంది. ప్రత్యేకంగా మీరు మెరిసే చర్మం కావాలంటే చలికాలంలో రాత్రి వేళ మీ చర్మ సంరక్షణ కోసం మాయిశ్చరైజింగ్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

గోరువెచ్చని నూనెతో..

గోరువెచ్చని నూనెతో..

చలికాలంలో మీ జుట్టు చాలా పొడిగా మరియు గరుకుగా మారిపోతూ ఉంటుంది. ఇలా జుట్టు పొడి బారకుండా ఉండేందుకు.. చలికాలంలో రాత్రి వేళలో గోరువెచ్చని నూనెతో మీ జుట్టుకు మసాజ్ చేయండి. వేడి నూనెతో మీ జుట్టుకు మసాజ్ చేయడం వల్ల మీ కురులు సున్నితంగా మారిపోతాయి. రాత్రిపూట జుట్టుకు మసాజ్ చేసిన తర్వాత, మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయండి.

ఐ క్రీమ్..

ఐ క్రీమ్..

చలి కాలంలో మీరు చక్కగా రెడీ అయి ఏదైనా ఫంక్షన్ కు వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే నలుగురిలో మీరు ప్రత్యేకంగా కనిపించాలంటే.. గ్రాఫిక్ ఐ లైనర్ కూడా ట్రై చేయండి. అలాగే మీ కనురెప్పలపై విభిన్నమైన డిజైన్లు వేయించి.. కొంచెం కొత్తగా ట్రై చేయండి. అంతకంటే ముందు మీ కంటి కింద నల్లటి వలయాలను పోగొట్టుకునేందుకు, రాత్రిపూట పడుకునే ముందు కళ్ల కింద క్రీమ్ రాయాలి.

Story first published: Saturday, January 1, 2022, 17:31 [IST]
Desktop Bottom Promotion