Latest Updates
-
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.! -
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు!
వేడి పెనంపై నీళ్లు చల్లితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాక తప్పదా.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది.?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువు స్థానం ఆ ఇంటి పరిస్థితులను నిర్ణయిస్తుంది. ముఖ్యంగా వంట గదిలో పాత్రలు ఉంచుకునే విధానం కూడా ప్రధానం. ఈ క్రమంలో వేడివేడిగా ఉన్న పెనంపై నీళ్లు చల్లకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేస్తే ఇంట్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయని హెచ్చరిస్తోంది. ఇందుకు కారణాలేంటి..? ఇక్కడ తెలుసుకుందాం..
వంటగదిలో రొట్టెలు లేదా దోశలు చేసుకునే పెనం విషయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. మన పూర్వీకులు వాస్తు సంబంధిత విషయాలపై పలు సలహాలు చేశారు. పెనాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తలకిందులుగా ఉంచకూడదు. వేడి పెనంపై నీళ్లు చల్లకూడదు. లేదంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాక తప్పదని వాస్తు పండితులు చెబుతున్నారు.

పెనాన్ని ఎలా ఉంచకూడదు
వేడివేడిగా ఉన్న పెనం మీద పొరపాటున కూడా నీళ్లు పోయకూడదని వాస్తు పండితులు పేర్కొన్నారు. వేడి పెనంపై నీరు చల్లినప్పుడు.. దాని నుంచి వెలువడే శబ్దం ఇంట్లో ప్రతికూల శక్తిని వ్యాపింపజేస్తుంది. అంతేకాకుండా కుటుంబసభ్యుల ఆరోగ్యానికి హాని కలుగుతుందని పెద్దలు విశ్వసిస్తారు. వేడి పెనం మీద నీళ్లు పడితే రాహుచంద్రులిద్దరూ ఒకేసారి బలహీనపడతారని వాస్తు చెబుతోంది. దీనివల్ల మనసు అశాంతంగా మారడంతో పాటు లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి ఇంట్లో ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి.
పరిహారాలు
వేడి పెనం మీద కాకుండా పొయ్యి మీద పెట్టేముందు నీళ్లు చల్లాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. దీనివల్ల కుటుంబంలో సంతోషం వాటిల్లుతుంది. అంతేకాకుండా రొట్టెలు చేసే ముందు పెనంపై ఉప్పు చల్లితే మంచిది. ఫలితంగా ఇంట్లో ఆహార, ధన కొరత ఏర్పడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.
వంటలో పెనాన్ని ఉపయోగించే ముందు శుభ్రంగా ఉంచాలని వాస్తు చెబుతోంది. రాహువుకు ప్రతినిధిగా భావించే పెనం శుభ్రంగా ఉంచడం వల్ల రాహువు ప్రశాంతంగా ఉంటాడని పెద్దల విశ్వాసం. అంతేకాకుండా పెనాన్ని వంటగదిలో ఎవరూ చూడని ప్రదేశంలో కనిపించకుండా ఉంచాలని సూచిస్తున్నారు. పెనాన్ని తలకిందులుగా ఉంచకూడదని అలా చేస్తే రాహు దోషం ఏర్పడి మనసు అల్లకల్లోలం అవుతుంది. ఇది తప్పుడు నిర్ణయాలకు దారితీస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు.



Click it and Unblock the Notifications