For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుట్టబొమ్మ బర్త్ డే స్పెషల్ : జిగేల్ రాణిలా మెరిసిపోవాలంటే.. వీటిని ఫాలో అవ్వండి...!

|

హీరోలతో పోల్చితే హీరోయిన్ల కెరీర్ ఎప్పుడూ చాలా వేగంగా సాగిపోతుంది... ఆగిపోతుంది కూడా. ఏ హీరో అయినా ఓ స్టోరీని సెలెక్ట్ చేసుకోవాలంటే.. వాళ్ల ఇమేజ్ మొదలుకుని.. అభిమానుల ఆలోచనల వరకు చాలా విషయాలను లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే హీరోయిన్లకు ఇలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ.. వీరికి మాత్రం అందం.. అభినయం.. నాజుకైన నడుము.. కుర్రాళ్లను మదిని కొల్లగొట్టే కొంటె చూపులు.. యువతను హీటెక్కించే డ్రస్సులను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

అలాంటి వారిలో ఎల్లప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది బుట్టబొమ్మ(పూజా హెగ్డే). ఒక లైలా కోసం సినిమాలో ఎంతో పద్ధతిగా కనిపించిన ఈ పొడుగు కాళ్ల అందాల భామ.. దువ్వాడ జగన్నాథంలో బికినీ వేసుకుని అందరిలోనూ సెగలు పుట్టించింది. అంతటితో ఆగకుండా రంగస్థలంలో ఐటమ్ సాంగ్ తో అదిరిపోయే స్టెప్పులు వేసి.. స్టార్ హీరోలందరి సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

తాజాగా టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ షూటింగులో బిజీగా గడుపుతోంది. అయితే ఈ అందాల కన్నడ భామ కేవలం రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ తనదైన ఫ్యాషన్, మేకప్ లుక్స్ తో అందరినీ అలరిస్తోంది. బుట్టబొమ్మ బర్త్ డే సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ నుడి తీసుకున్న ఈ టాప్ ట్రెండీ డ్రస్సులపై మీరు కూడా ఓ లుక్కేయండి.

View this post on Instagram

Walking on sunshine ☺️🌼☀️#Maharshi

A post shared by Pooja Hegde (@hegdepooja) on

అచ్చం బుట్టబొమ్మలా..

ఇటీవలి కాలంలో అమ్మాయిలందరి చూపు లెహెంగాల వైపు మళ్లుతోంది. ఏ స్పెషల్ అకెషన్ ఉన్నా.. వీటిని వేసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పూజా హెగ్డే కూడా అదే ఫాలో అయ్యింది. చూడండి ఈ ఫొటోలో ఎల్లో కలర్ ఫ్లోరల్ ప్రింటెడ్ లెహెంగాతో అచ్చం బుట్టబొమ్మలా మెరిసిపోతోంది. ఇలాంటి వాటికి హెవీ లుక్ ఉంటుందనే భయమేమీ అక్కర్లేదు.

View this post on Instagram

Love ❤️

A post shared by Pooja Hegde (@hegdepooja) on

స్లిమ్ అవుట్ ఫిట్..

జిగేల్ రాణి వేసుకున్న ఈ స్లిమ్ అవుట్ ఫిట్ ని చూడండి. ప్లెయిన్ బ్లాక్ అండ్ వైట్ మస్టర్డ్ ఎల్లో షేడ్స్ కాంబినేషన్లో రూపొందించిన ఈ తరహా డ్రస్సులు ప్రస్తుతం మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. వీటిని వేసుకుని ఫ్యాషనబుల్ గా మెరిసిపోవడం పెద్ద కష్టమేమీ కాదు. పూజా మాదిరిగా మ్యాచింగ్ ఫుట్ వేర్ తోపాటు.. డ్రస్ కు మ్యాచ్ అయ్యేలా హెయిర్ స్టైల్ ఉంటే సరిపోతుంది.

అందంగా మెరిసిపోయేలా...

మనం వేసుకున్న బట్టలు ఏవైనా సరే.. వాటికి మనదైన ఆత్మవిశ్వాసాన్ని జోడిస్తేనే మన లుక్ ని కంప్లీట్ చేయగలం. అందుకే ఒక్కోసారి మన డ్రస్ చాలా సింపుల్ గా ఉంటేనే.. మనం అందంగా, స్టైలిష్ గా మెరిసిపోయేలా చేస్తుంది. బుట్టబొమ్మ ధరించిన ఈ ఫ్రాక్ కూడా ఇలాంటి కోవకు చెందిందే.

కాలేజీ గర్ల్స్ కు ఇష్టమైన..

కాలేజీ.. టీనేజీ లేడీస్ కు ఎంతగానో ఇష్టమైన ఫ్యాషన్లలో స్కర్ట్స్ ఒకటి. అందుకే వీటిని మిక్స్ అండ్ మ్యాచింగ్ తరహాలో వేసుకుంటూ.. ఇతర ట్రెండ్స్ తో కలిపి వేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఈ అందాల బుట్టబొమ్మ కూడా ఇదే ఫాలో అయ్యింది. ఈ ఫొటోలో జిగేల్ రాణి ఎలా మెరిసిపోతోందో చూడండి. ఇక్కడ ఓ రింగ్, చెవులకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. మ్యాచింగ్ ఫుట్ వేర్ తో తన లుక్ ని చాలా సింపుల్ గా ముగించింది.

View this post on Instagram

Mainu suit suit karda 😎 #suitup

A post shared by Pooja Hegde (@hegdepooja) on

లుక్ ప్రత్యేకంగా..

నైట్ పార్టీలకు వెళ్లేటప్పుడు.. అందరిలో మన లుక్ హైలెట్ అవ్వాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా కొందరు అమ్మాయిలు పార్టీలకు ప్రత్యేకంగా సిద్ధమవుతుంటారు. అలాంటి సమయంలో నలుగురిలో మీరే ప్రత్యేకంగా కనబడాలంటే. మీరు వేసుకునే డ్రస్ నుండి ఉపయోగించే యాక్సెసరీస్ వరకు.. ప్రతి విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దీనికి బుట్టబొమ్మ డ్రస్సునే ఉదాహరణగా తీసుకోండి. డార్క్ మెరూన్ షేడ్ లాంగ్ ఫ్రాక్ కు, సింపుల్ డైమండ్ నెక్లెస్ జత చేసి సింపుల్ గా.. స్టైలిష్ ఎలా మెరిసిపోతోందో కదా...

షరారా లుక్స్..

ఇటీవలి కాలంలో కొత్తగా వినిపిస్తోన్న ట్రెండ్స్ లో షరారాకు ఎక్కువ మంది అమ్మాయిలు ఓటేస్తున్నారట. ఇవి ధరించడానికి సౌకర్యవంతంగా ఉండటంతో పాటు స్టైలిష్ లుక్ ని అందించడమే దీనికి కారణం. ఉదాహరణకు పూజా వేసుకున్న ఈ షరారాను చూడండి.. దీనిపై వర్క్స్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ సింపుల్ గా ఉన్నవి కూడా.. మార్కెట్లో దొరుకుతున్నాయి.

All Images Credited to poojaInsta

English summary

ButtaBomma(PoojaHegde) Birthday : Instagram pictures of the actress that will sweep you off your feet

Here are the poojahegde birthday special : instagram pictures of the actrees that will sweep you off your feet. Take a look