Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
Kajal Aggarwal: పచ్చని డ్రెస్సులో పరువాలు పరిచిన కాజల్ అగర్వాల్
సీనియర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ తన అందచందాలతో కుర్రకారును ఆకట్టుకునే పనిలో పడింది. తన స్నేహితుడు వ్యాపారవేత్త అయిన కిచ్లును పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివేట్ అయింది.

కమర్షియల్ చిత్రాలతో మంచి స్టార్ డమ్ సొంత చేసుకున్న కాజల్.. కొంత కాలం పాటు టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా కొనసాగింది. తర్వాత కొత్త తరం హీరోయిన్లు రావడంతో క్రమంగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అలా కిచ్లును వివాహం చేసుకుంది.

పెళ్లైన తర్వాత తన వెకేషన్, హనీమూన్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ రచ్చ లేపింది ఈ బ్యూటీ. ఆ తర్వాత సినిమాకు గ్యాప్ ఇచ్చి దాంపత్య జీవితాన్ని ఆస్వాదించింది. ఆ క్రమంలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. గతేడాది కాజల్ దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాజల్ తన ముద్దుల కొడుకుతో మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది.

ఇప్పుడు మళ్లీ తన సినీ కెరీర్ పై దృష్టి పెట్టింది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సీనియర్ నటుడు కమల్ హాసన్ సరసన ఇండియన్-2 లో నటిస్తోంది. తెలుగులో బాలకృష్ణ సరసన ఎన్‌బీకే 108 సినిమాలో హీరోయిన్ గా కూడా చేస్తోంది.

రెండ్రోజుల క్రితం చెల్లి నిధి అగర్వాల్ తో కలిసి కాజల్ గ్లామర్ ఫీస్ట్ ఇచ్చింది. ఇద్దరు ముద్దుగుమ్మల తమ అందాన్ని ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.(All Images: Instagram)
ఇద్దరూ అక్కాచెల్లెళ్లు తమ పరువాల ఆరబోస్తూ ఫోటోలకు హాట్ హాట్ ఫోజులిచ్చారు. నిషా అగర్వాల్ బ్లూ కలర్ లెహంగా ధరించి ఫోటోలకు ఫోజులివ్వగా, అక్కా కాజల్ అగర్వాల్ రెడ్ కలర్ లెహంగా ధరించింది. మరో పిక్ లో బ్లూ, సిల్వర్, పీచ్ కలర్ డ్రెస్సుల్లో అక్కాచెల్లెళ్లు తమ అందచందాలను ప్రదర్శించారు. అజా ఫ్యాషన్స్ కోసం అగర్వాల్ సిస్టర్స్ ఫోటోలకు ఫోజులిచ్చి అభిమానులను ఆకట్టుకున్నారు.



Click it and Unblock the Notifications
