Latest Updates
-
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.!
Samantha: ఆ హీరోతో డేటింగ్, ఆ తర్వాత మరొకరితో పెళ్లి! సమంత కాంట్రవర్సీలు!
నిర్మాత, నటుడు చిట్టిబాబు, సమంత మధ్య వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. యశోధ మూవీ ఫ్లాప్ కావడానికి సమంతే కారణమంటూ, తనో రోగిష్ఠి అంటూ చిట్టిబాబు అనడం ఆ తర్వాత సమంత చిట్టిబాబు చెవిలో వెంట్రుకలపై కామెంట్ చేయడం ఇలా సాగుతూనే ఉంది వివాదం. కొన్ని రోజులుగా సమంత వార్తల్లో హెడ్‌లైన్ గా నిలుస్తోంది.
గతంలోనూ పలుసార్లు సమంత వార్తల్లోకెక్కింది. తన మాటలు, సినిమాలు, ఇతర ఎంపిక ద్వారా సమంత హెడ్‌లైన్‌గా మారింది. సినీ ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా సమంత వ్యవహరించిన ఆ సందర్భాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పుష్పలో ఐటెం సాంగ్:
పుష్ప పార్ట్-1 లో సమంత ఐటెమ్ సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే. ఊ అంటావా మావా అంటూ ఒక ఊపు ఊపేసింది సామ్. ఈ పాటలో సమంత నటిస్తుంది అని తెలియగానే తన ఫ్యాన్స్ ఫుల్ గా ఖుషీ అయ్యారు. ఈ పాట ద్వారా సమంతకు సూపర్ క్రేజ్ వచ్చింది. అలాగే పుష్ప పార్ట్-1 సినిమాకు కూడా మంచి బజ్ క్రియేట్ అయింది.
భారీ బడ్జెట్ హిట్ సినిమాల్లో వరుస ఆఫర్లు:
దూకుడు, అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సహా వరుస సినిమాలు చేసింది సమంత. ఇవన్నీ సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయి. అలా కొంతకాలం పాటు హైడ్‌లైన్స్ లో నిలిచింది సామ్. ఇంకొన్ని సినిమాలు హిట్ కాకపోయినా సమంత నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు దక్కాయి.
జబర్దస్త్ సినిమా తర్వాత ఆ హీరోతో పూజలు:
హీరో సిద్ధార్థ్ తో కలిసి జబర్దస్త్ సినిమా చేసింది సమంత. ఓ హిందీ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ తర్వాత సిద్ధార్థతో కలిసి పలుసార్లు కనిపించింది సామ్. వాళ్లిద్దరూ కలిసి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సామ్ మొదటినుండి క్రైస్తవాన్ని పాటిస్తోంది.
నాగచైతన్యతో పెళ్లి, విడాకులు:
నాగ చైతన్యతో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించింది సామ్. ఏమాయే చేశావే సినిమా నుండి వీరిద్దరి మధ్య అనుబంధం పెరిగింది. అది కాస్త ప్రేమగా మారింది. 2017ల గోవాలో హిందూ క్రైస్తవ ఆచారాల ప్రకారం వీరిద్దరి పెళ్లి జరిగింది. ఈ తర్వాత వివిధ కారణాలతో వీరిద్దరూ విడిపోయారు. విడాకులు తీసుకుని కూడా చాలా కాలమే అయినప్పటికీ వీరిద్దరి గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటున్నారు.
లేడీ ఓరియంటెడ్ మూవీస్:
సమంత ఎన్నో లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసింది. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాలో హీరో నాని కంటే కుండా సామ్ స్క్రీన్ టైమ్ ఎక్కువ. ఇందులో సామ్ నటన అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత యూ-టర్న్, ఓహ్ బేబీ, మజిలీ, మనం, యశోధ, శాకుంతలం ఇలా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించిం మెప్పించింది.

సుకుమార్ మూవీ గురించి కాంట్రవర్సీ ట్వీట్:
1: నేనొక్కడినే మూవీ పోస్టర్ పై సమంత ఘాటుగా స్పందించింది. ఈ పోస్టర్ లో మహేష్ బాబు బీచ్ లో నడుస్తుంటే, కృతి సనన్ వెనక పాకుతూ వస్తుంటుంది. ఈ పోస్టర్ పై స్పందించిన సామ్.. ఆడవాళ్లను ఇలా చూపించడం అభ్యంతరకరంగా ఉందంటూ ట్వీట్ చేసింది.
ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత క్యారెక్టర్:
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత రాజి పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. శ్రీలంక తమిళ రెబల్ పాత్రలో సమంత అద్భుతమైన నటన పోషించింది.



Click it and Unblock the Notifications