బాలీవుడ్ యువ కెరటం సంజనా సంఘీ కి చెందిన 7 బ్రీత్ టేకింగ్ పిక్చర్స్ !

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky
Sanjana Sanghi

హాజెల్ గ్రేస్ మరియు ఆగస్టస్ వాటర్స్ అనే పేరు వినగానే మీ మదిలో మెదిలే విషయం ఏంటో తెలుసా? అంతులేని ప్రేమ, క్యూట్ నెస్, ఇలాంటి వెన్నో మీకు గుర్తొస్తాయి కదూ?

చాలా మంది అభిప్రాయం ప్రకారం ఈ సినిమాని మళ్ళీ తెరకెక్కించకూడదు. ఎందుకంటే, ఒరిజినల్ వెర్షన్ లోని మ్యాజిక్ అనేది రీమేడ్ వెర్షన్ లో వస్తుందో లేదోనన్న అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది. అయితే, బాలీవుడ్ ఈ మూవీని రీమేక్ చేసే సాహసం చేస్తోంది. దేశీ హాజెల్ గ్రేస్ ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియాలో ఈమె వైరల్ గా మారింది.

సంజనా సంఘీ, సుశాంత్ సింగ్ రాజపుత్ తో ఈ సినిమాలో జంటగా నటిస్తోంది. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇంటర్నెట్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది. అయితే సంజనా ఈ ఐకానిక్ రోల్ కి న్యాయం చేస్తుందని మనం ఇప్పుడే చెప్పలేము. అయితే సింప్లిసిటీకి నాటెనెస్ ని కలిపినట్టుగా కనిపించే సంజనా ఈ రోల్ కి న్యాయం చేస్తుందని ఈ సినిమా ఫిల్మ్ మేకర్స్ నమ్ముతున్నారు.

అలాగే, ఈ యంగ్ యాక్ట్రెస్ కి ఫ్యాషన్ పై అమితమైన ఇష్టం ఉన్నట్టు తెలుస్తోంది. ఈమెను మీరు ఇంతకు ముందే చూసి ఉండుంటారు. ఎన్నో ప్రముఖ యాడ్స్ లో ఈ ముద్దుగుమ్మ తళుక్కుమంది. కోకోకోలా వంటి యాడ్స్ లో మెరిసింది ఈ భామ. రాక్ స్టార్ లో లిటిల్ టామ్ బాయ్ మ్యాండీ గుర్తుందా? తానెవరో కాదు, సంజనానే.

అచ్చమైన సాంప్రదాయ వస్త్రాలతో పాటు వెస్ట్రన్ లుక్స్ లో కూడా ఈ భామ అందంగా ఒదిగిపోతుంది. ప్రతి లుక్ ని క్లాసీగా క్యారీ చేసింది. గార్మెంట్స్ ని అలాగే యాక్ససరీస్ ను మ్యాచ్ చేసే ఈ భామ స్టైల్ ట్రెండీగా మారింది. టీనేజర్స్ ఈ భామ స్టైల్ ను ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నారు.

Sanjana Sanghi
Sanjana Sanghi
Sanjana Sanghi
Sanjana Sanghi
Sanjana Sanghi
Sanjana Sanghi
Sanjana Sanghi
English summary

7 Breathtaking Pictures of Bollywood's Newest Rage Sanjana Sanghi

There are many who think that this film should never be remade because the magic it created with its sheer simplicity will be very hard to retain in the next one. But believe it or not, Bollywood is remaking the film and our desi Hazel Grace is going crazy viral on social media already.Sanjana Sanghi, who will be seen romancing Sushant Singh Rajput in the film.
Story first published: Tuesday, March 20, 2018, 16:00 [IST]