Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ఆర్యన్, సుహానా, అబ్రామ్ ఖాన్ ట్రెండీ స్టార్ కిడ్స్ అని నిరూపించుకుంటున్నారు
ఆర్యన్, సుహానా, అబ్రామ్ ఖాన్ ట్రెండీ స్టార్ కిడ్స్ అని నిరూపించుకుంటున్నారు
చారిత్రాత్మక నగరమైన పోంపీలో, షారుఖ్ ఖాన్ పిల్లలు సరికొత్త ట్రెండీ శైలిలో కనిపించి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్, మరియు చిన్న పిల్లవాడైన అబ్రామ్ ఖాన్ తమ హాలిడే ట్రిప్లో భాగంగా ఇటలీలోని కామ్పేనియా రీజియన్లోని పోంపీకి చేరుకున్నారు. అందులో భాగంగా మనకు ప్రయాణాలలో ధరించాల్సిన దుస్తుల గురించిన ఆలోచనలను ఇస్తున్నట్లు ట్రెండీగా కనిపించారు. ఆర్యన్ మరియు సుహానా అధునాతన దుస్తులలో వారి వారి అభిమానులలో జోరు పుట్టించగా, బుల్లి అబ్రామ్ రాక్ అండ్ రోల్ టీ షర్ట్ తో కనిపించి అందరి చూపులను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాడు.
ఈ స్టైలిష్ తోబుట్టువులు తమ హాట్ హాట్ దుస్తులతో సొగసులద్దుకుని పోజిచ్చినట్లు కనిపించారు. ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా నిశ్చితార్థం కార్యక్రమంలో చివరిసారిగా మనకు కనిపించిన ఆర్యన్, ఇన్ని రోజులకు మళ్లీ మనల్ని ఆశ్చర్యపరచేలా కూల్ లుక్లో దర్శనమిచ్చాడు.

ఆర్యన్ ఒక ఎలక్ట్రిక్ నీలం రంగు హాఫ్ స్లీవ్ టీ షర్ట్ ధరించాడు, ఇది రౌండ్ నెక్ కలిగి ఉండడమే కాకుండా, కొద్దిగా వదులుగా కూడా ఉంది. అతను స్టోన్ వాష్డ్ డెనిమ్ జీన్స్ మరియు తెల్ల రంగు స్పోర్ట్స్ షూస్ ధరించారు. ఆర్యన్ తన రూపాన్ని సాసీ బ్లాక్ షేడ్స్ (గాగుల్స్) మరియు మిస్టర్ కూల్ హావభావాలతో ముగించాడు.
అతని సోదరి, సుహానా తెల్లటి డీప్ – నెక్ క్రోచెట్ జాకెట్ ధరించి, దానికి సరిపోలే తెల్లని స్కర్ట్ ధరించి తెల్ల కుందేలు పిల్లలా కనిపించింది. ఆమె ధరించిన గోల్డెన్ స్లిప్పర్స్ మరియు ట్రైబల్ నెక్లెస్ మరికొంత అందాన్ని ఇనుమడింపజేసేలా కనిపించింది. ఆమె ఉంగరాల జుట్టు భుజాల మీదుగా అలల వంటి ఆకారంలో కనిపించగా, డ్యూయీ మేకప్ తో తన రూపాన్ని పూర్తి చేసింది సుహానా.
ఇక మన అభిమాన స్టార్ అబ్రామ్ నల్లని టీ-షర్ట్ ధరించాడు, ఇందులో రాక్ అండ్ రోల్ అని రాసి ఉండగా, తెల్లని షార్ట్, మరియు నీలి బూట్లతో తన రూపాన్ని ముగించాడు.

ఈ ముగ్గురిలో ఎవరు బాగున్నారో చెప్పడం మాకైతే కష్టం. మీకు ఎవరు నచ్చారో, మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి. ఇటువంటి ఆసక్తికర అంశాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి.



Click it and Unblock the Notifications
