For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేన్స్ 2018- ప్యాంట్ సూట్లో అందరికన్నా మెరుగ్గా ఎవరు కనిపించారు?

|

కేన్స్ 2018లో నటీమణులు విభిన్నమైన దుస్తులలో, తమ సొగసు సోయగాలతో గ్లామర్ ను పొంగిపొర్లించారు. ప్రతి సంవత్సరం కేన్స్ లో దర్శనమిచ్చే దీపికా పదుకునే మరియు ఐశ్వర్యలతో పాటు తొలిసారిగా కేన్స్ లో అడుగుపెట్టిన హుమా మరియు మహీరా కూడా తమలోని ఫ్యాషన్ సెన్స్ ను బయటపెట్టి అపూర్వ స్పందన దక్కించుకున్నారు.

ఈ నలుగురు సుందరాంగులు తమదైన శైలిలో పాశ్చాత్య దుస్తులలో, తమ వన్నెలు ఆరబోసారు. కానీ వీరందరిలో సారూప్యత కనిపించింది. అదేమిటంటే అందరూ ప్యాంట్ సూట్లు ధరించారు. దీపికా, హుమా, ఐశ్వర్య మరియు మహీరా అందరూ ద్విలింగ దుస్తులైన ఈ ప్యాంట్ సూట్లను తమ తరహాలో ధరించి ప్రసిద్ధికెక్కించారు.

Cannes 2018: So, Really Who Wore The Pants Better?

ప్రతిఒక్కరు ఎవరికివారే ఇతరులకు ధీటుగా చూపు తిప్పుకోలేనంత అందంగా కనిపించారు. దీపికా చిక్ ప్యాంట్ సూట్ ధరిస్తే, హుమా మెటాలిక్ ప్యాంట్ సూట్ ధరించింది

వీరిలో ఎవరి సొగసుకు మొదటి స్థానం అందించాలో నిర్ణయించడం చాలా కష్టతరమైన పని. ఈ నలుగురు అందాల భామలు, అసాధారణంగా ప్యాంట్ సూట్లలో దర్శనమిచ్చారు.

1. హుమా ఖురేషీ ధరించిన ఫ్యూచరిస్టిక్ ప్యాంట్ సూట్:

1. హుమా ఖురేషీ ధరించిన ఫ్యూచరిస్టిక్ ప్యాంట్ సూట్:

కేన్స్ 2018 రెడ్ కార్పెట్ పై,హుమా ఖురేషీ తన మొట్టమొదటి ప్రదర్శనలో అందరిని ఆశ్చర్యానికి లోను చేసింది. అందరూ ఆమె గౌన్ లేదా సంప్రదాయ దుస్తులలో దర్శనమిస్తుందని ఊహించారు. కానీ ఈ "గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్" నటీమణి అందరి అంచనాలను మించిపోయి, నిఖిల్ తంపి సృష్టించిన ప్లాటినం చిప్స్ తో కూడిన బ్రౌన్ కలర్ ప్యాంట్ సూట్ ధరించింది. దీనికి జతగా పియాజెట్ ఆభరణాలు ధరించి, మధ్యకు పాపిడి తీసి జుట్టును వదిలేసింది.

2. దీపికా పదుకునే ఎన్నిక గ్లామరస్ ప్యాంట్ సూట్ :

2. దీపికా పదుకునే ఎన్నిక గ్లామరస్ ప్యాంట్ సూట్ :

దీపికా పదుకునే విక్టోరియా హాయస్ ప్యాంటు సూట్ ధరించి ఫ్రెంచ్ రివేరా బ్యాక్ డ్రాప్లో లోరియల్ ఫోటోషూట్ కై ఇచ్చిన పోజులు వీక్షకులకు ఊపిరి సలపనివ్వలేదు. లోతైన వి నెక్ కలిగిన ఆమె దుస్తులు ఫాల్ వింటర్ 18 కలెక్షన్ లోనిది. దీపికను ఆ దుస్తులలో ఒలికిస్తున్న దర్పం చూసి వావ్ అననివారు లేరు!ఈ పద్మావత్ సుందరీమణి ధరించిన వై.ఎస్. ఎల్ జ్యువలరీ ఆమె అందానికే అందం తెచ్చాయి.

3. ఐశ్వర్యారాయ్ ధరించిన హుందాతనంతో కూడిన ప్యాంట్ సూట్ :

3. ఐశ్వర్యారాయ్ ధరించిన హుందాతనంతో కూడిన ప్యాంట్ సూట్ :

ఐశ్వర్య కేన్స్ లో పదిహేనేళ్లు పూర్తి చేసినందుకు గాను గౌరవార్థం లోరియల్ వారిచ్చిన ఆఫ్టర్ పార్టీలో అర్మాని నలుపు ప్యాంట్ సూట్ ధరించింది.ఆమె ఆ నిర్మాణాత్మక వస్త్రాలంకరణలో హుందాగా మరియు ఉన్నతంగా కనిపించింది. చేతిలో జిమ్మీ చూ క్లచ్ మరియు కాళ్లకు మెరిసే రెసైన్ కెర్రీ పెన్సిల్ హీల్స్ ధరించి హొయలొలకించింది.ఎర్రని పెదవులు మరియు పోనీ టైల్ ఆమె వస్త్రధారణకు సరిగ్గా సరిపోయాయి. ఎంతైనా ఆమె మన అల్టిమేట్ లేడీ బాస్.

4. మహీరా ఖాన్ ధరించిన వేసవి ప్యాంట్ సూట్ :

4. మహీరా ఖాన్ ధరించిన వేసవి ప్యాంట్ సూట్ :

పాకిస్థాన్ నుండి తొలిసారిగా ప్రాతినిధ్యం వహిస్తూ కేన్స్ వేడుకలో పాల్గొన్న మహీరా ఖాన్, పేస్టల్ ఛాయలున్న ప్యాంట్ సూట్ ధరించింది. ఇటాలియన్ బ్రాండ్ అయిన ఎర్మానో సెర్వినో ప్యాంట్ సూట్ లో ఆమె చురుకుగా మరియు సౌకర్యవంతంగా కనిపించింది. ఆమె ఈ దుస్తులలో లోరియల్ వారి కార్యక్రమానికి హాజరయింది. ఆమె సున్నితంగా ముస్తాబై, కురులను అలలలా వదిలేసింది.

వీరిలో ఎవరూ ధరించిన ప్యాంట్ సూట్ మీ మనస్సుపై చెరగని ముద్ర వేసింది? మీ అభిప్రాయాలను మాతో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.

English summary

Cannes 2018: So, Really Who Wore The Pants Better?

Glamour oozed at Cannes 2018 as our stunning stylistas conquered the film festival with their sartorial fashion statements. While the regulars, Deepika Padukone and Aishwarya Rai-Bachchan pulled off their attires like a piece of cake, Huma and Mahira were also not far behind in showing us their stylish side. All the four ladies donned individualistic western outfits, which made heads turn and hearts pound. However, there was one attire, common among the divas. And that outfit was a simple and unassuming 'pantsuit'. Yes, Deepika, Huma, Aishwarya, and Mahira-all popularised pantsuits and sported this androgynous outfit in their characteristic ways.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more