రమేష్ తురానీ దీపావళి పార్టీకి ఎవరెలా వచ్చారు

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

చిత్రనిర్మాత రమేష్ తురానీ ఇంట్లో ఆదివారం జరిగిన దీపావళి పార్టీ బాలీవుడ్ తారలతో కళకళలాడింది. వచ్చిన ప్రతిఒక్కరూ ప్రత్యేకంగా, అందంగా తయారయ్యారు, కొందరు ఇంకా చాలా అందంగా కన్పించారు.

దీపావళికి ఈ హెయిర్ స్టైల్స్ ఆకర్షణీయం&సురక్షితం

ఈ తారలు పార్టీలో అందరికన్నా అందంగా, స్టైలిష్ గా కన్పించారు. పార్టీకోసం మేటిగా తయారైన తారల లిస్టును చూడండి.

కృతి సెనన్

కృతి సెనన్

దీపావళి పార్టీకి కృతి సంప్రదాయ స్టైల్లో వచ్చింది. ఆమె ఫాభియానా వారి అనార్కలి సెట్ ను ధరించారు.ఈ క్రీమ్ మరియు పీచ్ రంగు సూట్ ఎంతో అందంగా ఉండి కృతికి కూడా బాగా నప్పింది. డ్రస్ బంగారు షేడ్ జరీతో మెరిసిపోతూ మహేష్ నోతాన్ డాస్ వారి పెద్ద మెరిసే చెవిరింగులతో. ఫిజ్జీ గోబ్లెట్ వారి జూత్తీలతో కృతి స్టైల్ ను పూర్తిచేసాయి.

దియా మీర్జా

దియా మీర్జా

దియా దీపావళి ప్రత్యేక డ్రస్ ను ఎంతో హుందాగా ధరించి కన్పించారు. ఆమె ఎప్పుడూ లేత,మెరిసే రంగుల్లో కన్పిస్తారని, అవి ఆమెకు నప్పుతాయని కూడా అందరికీ తెలిసినదే. ఈ సారి కూడా మెరిసే పసుపుపచ్చ రంగులో ఆమె అనితా డోంగ్రె డిజైన్ చేసిన అనార్కలిని ధరించారు.

ఆ డ్రస్ కి ఆమె అనితా డోంగ్రె పింక్ సిటీ కలెక్షన్ వారి నగలను, ఫిజ్జీ గోబ్లెట్ వారి జూత్తీలతో అలంకరణ చేసుకున్నారు.

సోఫీ చౌదరి

సోఫీ చౌదరి

అందరికన్నా సోఫీ పార్టీలో చాలా అందంగా కన్పించారు. ధీరు మరియు నితిక కొట్యూర్ వారి అందమైన, సెక్సీ లెహెంగా సాధారణ సమయాల్లో కన్నా ఆమెని మరింత అందంగా కన్పించేలా చేసింది. ఆ డ్రస్ పై వున్న పూలడిజైన్ చేతిపని మరియు మొటిఫ్ పెయింట్ డ్రస్ ను మెరిసేలా చేసాయి.

సోఫీ చౌదరి ఈ డ్రస్ కి ఫిర్దౌస్ జ్వెల్లరీ నుంచి నగలు, ఇనాయత్ నుంచి వెండి క్లచ్ తో అలంకరణ చేసుకున్నారు.

తమన్నా భాటియా

తమన్నా భాటియా

నటి తమన్నా భాటియా పచ్చరంగు అనార్కలి సూట్ లో అందంగా కన్పించారు. రింపల్ హర్ ప్రీత్ నరులా డిజైన్ చేసిన ఆకుపచ్చని అనార్కలి ఆమెను అందమైన దివాగా మార్చేసింది. బంగారు జరీ ఎంబ్రాయిడ్రరి మరింత వన్నె తెచ్చింది. ఈ డ్రస్ తో ఆమె మహేష్ నోతాన్ డాస్ నగలను ధరించారు.

డైసీ షా

డైసీ షా

దీపావళి పార్టీలో డైసీ తన ప్రత్యేక లుక్ తో అలరించారు. రఫుల్డ్ ఒకచేతి లెహంగాను ఆమె వేసుకున్నారు. ఆ లెహంగా బ్లౌజ్ నీడల భ్రమను కలిగిస్తూ, లెహంగా మెరిసే పింక్ షేడ్ మరియు బంగారు జరీ ఎంబ్రాయిడ్రరీతో ప్రత్యేకంగా ఉంది. ఈ లుక్ అన్నిటికన్నా మేటి వాటిల్లో ఒకటిగా నిలిచింది. దీనితో ఆమె వేలాడే పెద్ద చెవిరింగులు మరియు వెండి క్లచ్ ను ధరించారు.

దీపావళి రోజు మిఠాయిలు బహుమతిగా ఇచ్చే సంప్రదాయం

ఏక్తా కపూర్

ఏక్తా కపూర్

ఏక్తా కపూర్ అందానికే మిన్న లుక్ తో లేరు కానీ, ఆమె సిల్వర్ మరియు గ్రే లెహంగాతో దీపావళి పార్టీలో ప్రత్యేకంగా నిలిచింది. ఈ నిర్మాత గ్రే లెహంగాకి మెరిసే వెండిరంగు బ్లౌజ్ ,దానిపై బంగారు గీతలతో సాదాగా, నీటుగా కన్పించారు.

నేహా ధూపియా

నేహా ధూపియా

మేము దీపావళి పార్టీలో నేహ లుక్ బాలేదని అనం కానీ అందరికన్నా ఆమెది సాదాగా ఉన్నదనే చెప్పాలి. తెలుపు మరియు ఎరుపు షరారా అందంగానే ఉన్నా ఆమె దాన్ని స్టైలిష్ గా క్యారీ చేయలేకపోయారు. సరిపోయిన చెవిరింగులనే ధరించినా ఎందుకో అవంత ఆమెకి నప్పలేదు.

English summary

Who Wore What At Ramesh Taurani's Diwali Party

Celebrities entered Ramesh Taurani's diwali party in style. Have a look.