Just In
- 49 min ago
ఆ కార్యంలో కలకాలం కచ్చితంగా సక్సెస్ కావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి...
- 1 hr ago
డయాబెటిస్ ఉంటే పిల్లలు పుట్టే అవకాశం లేదా? మరి పరిష్కారం ఏంటి?
- 3 hrs ago
నిలబడి తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? మీ సందేహానికి సమాధానం ఇక్కడ ఉంది
- 3 hrs ago
2019లో ఎక్కువ మంది చేసిన ట్వీట్లు.. ఏమోజీలు, హ్యాష్ ట్యాగులేంటో తెలుసా...
Don't Miss
- News
అత్యాచారానికి ఉరిశిక్ష... ఏపి దిశ చట్టానికి క్యాబినెట్ ఆమోదం
- Sports
కారణం తెలియదు!: చెన్నైలో కమల్ హాసన్ను కలిసిన డ్వేన్ బ్రావో
- Movies
నాగబాబు చేసిన పనితో ఆ నటుడి కోసం వెతుకుతున్న జబర్ధస్త్ టీమ్.. రీప్లేస్ చేయనిది అందుకే.!
- Technology
బేసిక్ రీఛార్జ్ రూ.49 ప్లాన్ను తొలగించించిన జియో
- Finance
అన్నీ ఇచ్చాం: ఆంధ్రప్రదేశ్కు కేంద్రం షాక్, కొత్త పథకాలతో రెవెన్యూ లోటు పెంచారు!
- Automobiles
కియా సెల్టోస్ ముంబైలోని డీలర్షిప్ యొక్క మొదటి అంతస్తునుండి పడిపోయిన వీడియో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
తాజాగా హాట్ హాట్ ఫోజులిచ్చి తళుక్కున మెరిసిన అందాల భామలపై ఓ లుక్కేయండి..
బాలీవుడ్ అందాల భామలంతా హాట్ హాట్ ఫోజులతో అందరూ ఒకే చోట చేరి కనువిందు చేశారు. ఓ వైపు పొడుగు కాళ్ల సుందరీ దీపికా పదుకొనే పొడవాటి గౌనుతో అందరినీ ఆశ్చర్యపరచగా, ఆమె భర్త బాలీవుడ్ హీరో, విలక్షణ నటుడు రణవీర్ సింగ్ కొత్త అవతారంతో చమత్కారంగా కనిపించాడు. ఇక బాలీవుడ్ కండల వీరుడు, బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ డ్యాన్స్ తో దుమ్ము రేపాడు. వీరితో పాటు ఆలియా భట్, అదితిరావు, రాధికా ఆప్తే తమ అందచందాలతో, హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్లకు పిచ్చెక్కించారు.
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) పురస్కార వేడుకలో అదిరిపోయే లుక్స్ తో కనిపించి అందరినీ అలరించారు. వీరితో పాటు ప్రీతిజింటా, జెనీలియా, షాహిద్ కపూర్, సారా అలీఖాన్, రేఖతో పాటు మరింత మంది బాలీవుడ్ తారలంతా ముంబైకి చేరడంతో అక్కడున్న వారికి చూడటానికి రెండు కళ్లు చాలలేదు.

మాధురి దీక్షిత్..
ఇక చివరిగా బాలీవుడ్ నాట్యమయూరి మాధురి దీక్షిత్ మరోసారి తన హాట్ లుక్స్ తో అందరికీ పిచ్చెక్కిచ్చింది. ఐఫా అవార్డ్స్ వేడుకలో రెడ్ కలర్ గౌను ధరించి అందరినీ ఆకర్షించింది. ఇక అక్కడున్న గ్రీన్ కార్పెట్ కు ఈమె రెడ్ కలర్ గౌనుకు అదిరిపోయే మ్యాచింగ్ అయ్యింది. అంతేకాదు తన మేకప్ ను కూడా చాలా ఎక్కువగా వేసుకుంది. ఇక లిప్ స్టిక్ కూడా మ్యాచింగ్ గా ఉండటంతో అందరూ ఆమెను తెగ పొగిడారు.
|
దీపికా పదుకొనే..
దీపికా పదుకొనే మరోసారి హాట్ హాట్ ఫోజులిచ్చింది. రణవీర్ సింగ్ తో పెళ్లి అయిన తర్వాత కూడా ఈ భామ మరింత రెచ్చిపోతోంది. చాలా మంది వివాహం తర్వాత సైలెంట్ అవుతుంటారు. కానీ ఈ పొడుగు కాళ్ల సుందరీ అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడటం లేదు.
|
తాజాగా అతిపెద్ద గౌను..
లేటెస్ట్ వచ్చిన హీరోయిన్లకు గట్టి పోటీనే ఇస్తున్నారు. అంతేకాదు తాను కూడా ఇంకా రేసులో ఉన్నాను అని గుర్తు చేసింది. తాజాగా అతిపెద్ద గౌనును ధరించి ఐఫా అవార్డ్స్ 2019లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ఐఫా వేడుకలో ఆమె డ్రెస్సే అందరి కంటే హైలెట్ గా నిలిచింది.
|
కత్రినా కైఫ్..
తెలుగులో మల్లీశ్వరిగా మెప్పించిన కత్రినా కైఫ్ ఇప్పటికీ అందరికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ బాగానే గుర్తుంది. అంతేకాదు బాలయ్యతో ఓ సినిమాలో నటించిన ఈ బాలీవుడ్ అందాల భామ ఐఫా అవార్డ్స్ 2019లో అదిరిపోయే డ్యాన్సు వేసి అందరి మతులు పోగొట్టేసింది.
|
నాజుకైన నడుము కనబడేలా..
అంతేకాదు ఈమె ధరించిన లెహంగాతో మరింత మెరిసిపోయింది. తన నాజుకైన నడుము కనబడేలా వేసుకున్న ఈ డ్రెస్ అందరి దృష్టిని ఇట్టే ఆకర్షించింది. మరోసారి సాంప్రదాయ దుస్తులతో వేదిక వద్దకు ఎంట్రీ ఇచ్చింది. వివాహ వేడుకలకు లేదా ఇతర కార్యక్రమాలు, పండుగల సమయంలో ఇలాంటి డిజైన్ లెహెంగా అద్భుతంగా ఉంటుందని కూడా కత్రినా హింట్ ఇచ్చింది.
|
ఆలియా భట్..
అందాల బొమ్మలా కనిపించే బాలీవుడ్ భామ ఆలియా భట్. తొలి సినిమాలోనే లిప్ లాక్ తో రెచ్చిపోయిన భామ తాజాగా ఐఫా అవార్డ్స్ 2019లో మరోసారి ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోయింది. ఆమె ధరించిన బ్రౌన్ కలర్ గౌన్ ను చూసిన వారు అలా చూస్తుండి పోయారు.
|
చూపు తిప్పుకోలేకపోయారు..
అసలు ఎటువైపు కూడా చూపు తిప్పుకోలేకపోయారు. అంతలా ఆమె అందం అందరినీ ప్రభావితం చేసింది. లైట్ జ్యువెలరీ కూడా ఆమె అందాన్ని మరింత మెరిసేలా చేసింది. ఇక ఈ భామ తొలిసారి తెలుగు సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈమె దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో నటించనుందట.

అదితి రావు..
అంతరిక్షం సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించిన అదితి రావుకు ఐఫా 2019లో ప్రత్యేకమైన అవార్డు లభించింది. ఇక ఈమె అందాల ఆరబోతలో దీపికా, ఆలియా కన్నా తానేమీ తక్కువ కాదని నిరూపించుకుంది. బ్లాక్ కలర్ డ్రెస్ ను ధరించడంతో ఆమెకు బోల్డ్ టచ్ వచ్చింది. ఈ డ్రస్సులో తన ఎద అందాలు ఎక్కువగా కనబడేలా ఎక్స్ పోజింగ్ ఇచ్చింది. ఇక ఆమె కేశాలంకరణ కూడా ఆమెకు కలిసొచ్చింది.

రాధికా ఆప్తే..
రాధికా ఆప్తే ఆ పేరు ఒక సంచలనం. ఒంటిపై నూలు పోగు లేకుండా నటించడంలో ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ అందరికంటే ఒక అడుగు ముందే ఉంటుంది. అంతేకాదు కొన్ని సినిమాల్లో అలా నటించి చూపించింది. తన సత్తా ఏంటో అందరికీ చూపింది. అంతేకాదు తన ఫ్యాషన్ స్టేట్మెంట్లతో అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఆమె స్టైల్ ను చూస్తే అందరికీ మతి పోవాల్సిందే. అందరికంటే ఎక్కువగా మేకప్ వేసుకుని లగ్జరీ దుస్తులను ధరించింది. అందరూ ఫేస్ కు ఎక్కువగా మేకప్ వేస్తే రాధికా మాత్రం తన కళ్లకు సంబంధించిన మేకప్ పై ఎక్కువ దృష్టి పెట్టింది.