తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ వేడుకను జరుపుకున్న ప్యారిస్ హిల్టన్

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky
Paris Hilton Got Engaged In Style

శృంగార తార ప్యారిస్ హిల్టన్ తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ క్రిస్ జిల్కాతో ఎంగేజ్మెంట్ వేడుకను జరుపుకుంది. నటి, గాయని, పబ్లిక్ ఫిగర్ అయిన హిల్టన్ ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేసింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, వీరిద్దరూ ఇటీవలే కొలొరాడొ కి ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఈ మ్యారేజ్ ప్రపోజల్ అనేది జరిగింది. అనధికారంగా, ప్యారిస్ స్టయిల్ స్టేట్మెంట్ కి తగినట్టుగా ఈ వేడుక జరిగింది.

మంచుతో నిండిన పర్వతం వద్ద వీరిద్దరూ స్టైలిష్ గా ఎంగేజ్మెంట్ వేడుకను జరుపుకున్నారు.

ప్రత్యేక సందర్భం

ప్రత్యేక సందర్భం

ఈ ప్రత్యేక వేడుకకు సంబంధించి ప్యారిస్ అత్యద్భుతమైన వస్త్రధారణతో మెరిసిపోయింది. బ్లాక్ టాప్ కి జోడీగా మెరిసే జాకెట్ ను అలాగే ప్యాంట్స్ ను ధరించి తళుక్కుమంది. ఈ వస్త్రధారణకు సేక్విన్ బిన్నీతో పాటు ఒక జత రెక్ట్రయాంగులర్ షేడ్స్ ని జోడించింది. ఈ లుక్ అనేది ఎంతో మంది కుర్రకారును ఆకట్టుకుంది. అదేసమయంలో, క్రిస్ లుక్ ఏ మాత్రం తగ్గలేదు.

స్టైల్ లుక్ తో పాటు ఈ వేడుకలో ప్రత్యేక పాత్ర పోషించే ఎంగేజ్మెంట్ రింగ్ గురించి ఇప్పుడు మనం చర్చించుకోవాలి. గ్రీన్ & కో ఇంటర్నేషనల్ కి చెందిన ఈ రింగ్ ను 24 మిలియన్ల డాలర్లకు కొన్నారట. తన తల్లి యొక్క ఎంగేజ్మెంట్ రింగ్ ని దృష్టిలో పెట్టుకుని అటువంటి రింగ్ నే ఎంచుకుందట.

క్రిస్ లుక్

క్రిస్ లుక్

క్రిస్ కూడా సూపర్ లుక్ తో మెరిసిపోయాడు. తన నెచ్చెలి లుక్ కి మ్యాచ్ అయ్యే విధంగా వస్త్రధారణను ఎంచుకున్నాడు. ప్రొఫెషనల్ నటుడు అలాగే మోడల్ అయిన క్రిస్ తన స్టైల్ ని పెర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశాడు. ప్యారిస్ హిల్టెన్ కి తగిన జోడీ అనిపించుకున్నాడు. బ్లాక్ జంబర్ కోట్ కు జోడిగా కూల్ ప్యాంట్స్ ను ధరించి స్టన్నింగ్ అనిపించుకున్నాడు. ఇతను ధరించిన ఉబెర్ షూస్ అనేవి ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పారిస్ హిల్టెన్ ట్విట్టర్ లో తన మనసులోని భావాలని పంచుకుంది.

ఎంగేజ్మెంట్ వీడియో

ఈ వేడుకకు సంబంధించిన వీడియోను ప్యారిస్ తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఫాషన్ స్టేట్మెంట్స్ ను మెయింటైన్ చేస్తూనే ఈ జోడీ తాము అత్యంత రొమాంటిక్ అని తెలియచేశారు కూడా. ఈ వీడియో వారిద్దరి మధ్యనున్న గాఢమైన బంధాన్ని తెలియచేస్తుంది.

గోల్డెన్ గర్ల్

గోల్డెన్ గర్ల్

ప్యారిస్ తమ కొలరాడో ట్రిప్ కి సంబంధించిన విశేషాలని ఒక పోస్ట్ లో తెలియచేసింది. ఇటీవలే సెక్సీ మెటాలిక్ గోల్డ్ రష్ జాకెట్ తో ఒక హాట్ పోజ్ ను విడుదల చేసింది. కపుల్ గోల్స్ తో పాటు ఈ శృంగార తార వింటర్ స్టైల్ కి సంబంధించిన కొన్ని గోల్స్ ని కూడా మనముందుంచింది.

సెక్సీ షేడ్స్

సెక్సీ షేడ్స్

పారిస్ హిల్టెన్ కి సంబంధించిన సూపర్ వైడ్ లిండా ఫారో మౌంటెన్ షేడ్స్ మనను అత్యంత ఆశ్చర్యపరుస్తాయి. ఈ లుక్ అనేది ఎంతో స్టన్నింగ్ గా ఉంది. ఆమె నుండి మనం చూపును మరల్చుకోలేము. తన గోల్డెన్ అవుట్ ఫిట్ కు ఈ షేడ్స్ అనేవి సరిగ్గా మ్యాచ్ అయ్యాయి. మీ అభిప్రాయమేమిటి మరి?

అత్యద్భుతమైన క్షణం

అత్యద్భుతమైన క్షణం

తన గోల్డెన్ అటైర్ కి సంబంధించిన మరొక ఫోటోను పారిస్ ఇటీవలే షేర్ చేసింది. బ్లాక్ ట్రౌజర్స్ ను, గోల్డెన్ జాకెట్ ను, బ్లాక్ స్నికర్స్ ను ధరించి ఒక జత వైడ్ లిండా ఫరో షేడ్స్ తో స్కయింగ్ చేస్తున్న ఫోటోను అభిమానుల కోసం షేర్ చేసింది. ఈ లుక్ అనేది అత్యంత మంది దృష్టిని ఆకర్షించింది.

చూపును మరల్చుకోలేరు

చూపును మరల్చుకోలేరు

ఈ జంట తమ స్టైల్ తో అలాగే తమ అనుబంధంతో అందరి దృష్టిని ఆకర్షించారు. వీరి నుంచి చూపు మరల్చడం అత్యంత కష్టతరం అనడం అతిశయోక్తి కాదు.

వీరు ప్రతి సారి వీరి స్టైల్ స్టేట్మెంట్స్ తో మతి పోగొడుతున్నారు.

మూవీ ప్రీమియర్స్ కోసం

మూవీ ప్రీమియర్స్ కోసం

వీరిద్దరూ కలిసి ఎన్నో మూవీ ప్రీమియర్స్ కు అలాగే ఎన్నో వేడుకలకు హాజరయ్యారు. ఆ సమయంలో కూడా స్టైల్ స్టేట్మెంట్స్ ను సరిగ్గా మ్యాచ్ చేసుకునేవారు. వీరిద్దరూ డైరెక్టర్స్ గిల్డ్ వద్ద హాజరైన బిగల్డ్ అనే యుఎస్ ప్రీమియర్ నుంచి ఒక ఇమేజ్ ను మీ ముందుంచాము. ఇందులో వీరిద్దరూ అత్యంత స్టైలిష్ గా మెరిసిపోయారు.

ప్యారిస్ తన సెక్సీ లుక్ తో అభిమానుల గుండెలను జారిపోయేలా చేస్తుంటే క్రిస్ కూడా తన ఫాషన్ స్టేట్మెంట్ తో అదరగొట్టాడు. మొత్తానికి, ఈ జోడీ అదిరిపోయింది కదూ!

English summary

Paris Hilton Got Engaged In Style

Paris Hilton Got Engaged In Style,Paris Hilton got engaged with a ring worth $24 Million, carrying a sexy style book. Have a look.