Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
పెళ్ళిళ్ళ ఫ్యాషన్-హమ్ ఆప్కే హై కౌన్ స్పెషల్
హం ఆప్ కే హై కౌన్?? మేము ఫ్యాషన్ లవర్స్.లేటెస్ట్ ఫ్యాషన్ ట్ర్రెండ్, టిప్స్, న్యూస్ ని మీకు తెలియచేయడం మా బాధ్యత.హం ఆప్ కే హై కౌన్ అని అడిగాము కదా. అదే పేరుతో తొంభైలలో వచ్చిన సినిమా గురించి మాట్లాడుకుందాము.

ముఖ్యం గా దానిలో ఉన్న ఫ్యాషన్ గురించి.ఇది ఒక మామూలు సినిమా కాదు.బాక్సాఫీసు రికార్డులని బద్దలు కొట్టడమే కాదు, మనకి పెళ్ళిలలో ధరించే వస్త్ర ధారణ లకి ఒక స్టైల్ ని నేర్పిన సినిమా ఇది.ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా. తొంభలలో ఫ్యాషన్ ప్రియులని అమితం గా అలరించిన ఈ సినిమా గురించి కాసేపు గుర్తు చేసుకుందాము.

1.సిగ్నేచర్ గ్రీన్ లెహంగా
నిషా(మాధురీ దీక్షిత్ పాత్ర పేరు) ధరించిన ఆకుపచ్చటి లెహెంగా ఎవరికి గుర్తుండదు చెప్పండి.మెడ దగ్గర ఎంబ్రాయిడరీ చేసి పొడుగు చేతులున్న బ్లౌజ్.ఆకుపచ్చటి స్కర్టు దాని మీద దుపట్టా.జూటే దో పైసే లో పాటలో ఈ దుపట్టా గురించి ఒక లైను కూడా ఉందండోయ్, "దుల్ హే కే సాలియో హరే దుపట్టే వాలియో" అంటూ.అప్పటి పెళ్ళిళ్ళలో ఈ లెహెంగా దూపట్టా స్టైల్ ఎంత క్రేజ్ సంపాదించుకుందో ఊహించగలరా అసలు??

2. పసుపచ్చ రంగు శారీ
అప్పట్లో వచ్చిన అన్ని సినిమాలలో కాస్త వయసు మీద పడ్డ ప్రేమికులు ఒకరినొకరు ఊహించుకుంటూ ఊహల్లో రొమాన్స్ చేస్తూ హం ఆప్ కే హై కౌన్ లో చూపించినట్లే ఉంటారు. ధిక్ తన పాటలో ఎల్లో శారీ ప్రేమ్(సల్మాన్ ఖాన్) ఊహ.ప్రేమ్ వేసుకున్న వస్త్రాలు అతనికి మెన్స్ ఫ్యాషన్ మీద అవగాహన లేదు అని నిరూపించినా స్త్రీల వార్డ్ రోబ్ గురించి మాత్రం మంచి అవగాహన ఉంది అనిపించట్లేదూ??

3.పర్పుల్ శారీ
దీదీ తేరా దేవర్ దీవానా పాట రెండు విషయాల వల్ల ఫేమస్.ఒకటి, ప్రేమ్(సల్మాన్) నిషా(మాధురి) నడుము భాగాన్ని పంగల కర్ర ఉపయోగించి పువ్వులతో కొట్టడం, రెండోది మాధురీ ధరించిన పర్పుల్ శారీ.అప్పట్లో తాము అలాంటి చీర ని వివిధ సందర్భాలలో ఎన్ని సార్లు ధరించామో అని ఇప్పటికీ స్త్రీలు గుర్తు చేసుకుంటూనే ఉంటారు.

4.గ్రీన్ శారీ
ప్రేమికుల ఊహలలో వచ్చిన ఇంకొక పాట లో ఈ గ్రీన్ శారీ ఉంటుంది.ప్రేమ్ ఊహల్లో నిషా ని ఊహించుకుంటున్నప్పుడు తప్ప సినిమాలో నిజం గా నిషా ఎక్కడా ఈ చీర ని ధరించదు.ఊహల్లో అయినా ప్రేమ్ కి ఉన్న వార్డ్ రోబ్ సెన్స్ బాగుంది కదూ.
ఇవండీ హం ఆప్ కే హై కౌన్ లో ప్రసిద్ధి చెందిన పెళ్ళి డ్రస్సులు.మీరు వీటిలో వేటినైనా ధరించి ఉంటే మాకు తప్పక తెలియచెయ్యండి.



Click it and Unblock the Notifications
