క్రికెట‌ర్ జ‌హీర్‌ఖాన్ జోడి పెళ్లిలో ఎంత అందంగా ఉన్నారో చూడండి!

By: sujeeth kumar
Subscribe to Boldsky

జ‌హీర్ ఖాన్‌, అత‌డి దీర్ఘ‌కాల ఫియాన్సె అయిన సాగ‌రిక ఘ‌ట్గే మొత్తానికి పెళ్లి తంతుతో ఒక్క‌ట‌య్యారు. సాదాసీదాగా ఉన్న పెళ్లి దుస్తుల్లోనూ వాళ్లు అద్భుతంగా క‌నిపించారు.

జ‌హీర్ ఖాన్ క్రికెట్‌లో స్టార్ అయితే, సాగ‌రికకు కూడా బాలీవుడ్‌లో మంచి పేరే ఉంది. వాళ్లిద్ద‌రూ స్టైలిష్ జోడిగా ఇప్ప‌టికే పేరు సంపాదించారు.

స‌భ్య‌సాచి ముఖ‌ర్జీ క‌లెక్ష‌న్ల‌లో భాగంగా ఎర్ర‌ని చీర‌లో సాగ‌రిక పెళ్లి రోజు ధ‌గ‌ధ‌గా మెరిసిపోయింది. ప్లెయిన్ క‌ల‌ర్ లో ఉన్న ఎర్ర చీరకు హెమ్మింగ్ ఎంబ్రాయిడ‌రీ వ‌ర్క్ అద‌రగొట్టింది. చీర‌కు త‌గ్గ‌ట్టే మ్యాచింగ్ బ్ల‌వుజ్ ధ‌రించింది. దానికి ఎంబ్రాయిడ‌రీ చేసి ఉంది. ఆమె మెడ‌లో వేసుకున్న వెండి నెక్లెస్, దుద్దులు స‌రిగ్గా ఆమె చీర‌కు అతికిన‌ట్టు స‌రిపోయాయి.

Zaheer Khan Sagarika Ghatge Wedding

ఆమె నుదుటిపై చిన్న సైజులో పెట్టుకున్న బిందీ ఆమెకు ప‌రిపూర్ణ‌త‌ను తెచ్చిపెట్టింది.

మ‌రోవైపు జ‌హీర్ కూడా త‌క్కువేం తీసిపోలేదు. గులాబీ రంగులో కుర్తా, దానిపై ప్రింట్లు అద‌ర‌గొట్టాయి.

Zaheer Khan Sagarika Ghatge Wedding

23వ తేదీ తెల్ల‌వారుజామున వారిద్ద‌రూ ఏక‌మ‌య్యారు. గ్రాండ్ రిసెప్ష‌న్ మాత్రం 27వ తేదీన పెట్టుకున్నారు.

ఈ జోడి స్టైలిష్ సెల‌బ్రిటీల‌లో ఎప్పుడూ త‌మ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుంటున్నారు. వాళ్లిద్ద‌రి సాంగ‌త్యానికి మీడియా అబ్బుర‌ప‌డుతోంది.

Zaheer Khan Sagarika Ghatge Wedding

ఇటీవ‌లె విరాట్ కోహ్లీ ప్రారంభించిన ఓ స్పోర్ట్స్ బ్రాండ్ లాంఛ‌న కార్య‌క్ర‌మంలోనూ ఈ జోడి క‌నిపించి ప‌లువురిని ఆక‌ర్షించ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఎంగేజ్‌మెంట్ స‌మ‌యంలోనూ వీళ్ల జోడి, వేసుకున్న దుస్తులు అబ్బుర‌ప‌రిచాయి. ఎవ‌రికివారు విడివిడిగా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నా... ఇద్ద‌రు క‌లిసి అవార్డు ఫంక్ష‌న్ల‌లో క‌నిపిస్తే మాత్రం జ‌నాలంద‌రూ మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోతున్నారు.

Zaheer Khan Sagarika Ghatge Wedding

జ‌హీర్ ఖాన్ ఎప్పుడూ కోట్లు, ష‌ర్ట్స్ లాంటివాటిలో త‌న ప్రత్యేక‌త‌ను చూపిస్తుంటే సాగ‌రిక మాత్రం సెక్సీ లెద‌ర్ జాకెట్స్ వేసుకొని క‌నిపించ‌డ‌మో, రంగురంగుల పూల చొక్కాలు ధ‌రించి క‌నిపించిన సంద‌ర్భాలు ఉన్నాయి.

వాళ్లిద్ద‌రు రిసెప్ష‌న్ పార్టీలో ఎలా త‌యార‌వ్వ‌బోతున్నారో అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాం. మీకు ఆ ఆస‌క్తి ఉందా.. అయితే అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్ ను చూస్తూ ఉండండి.

Zaheer Khan Sagarika Ghatge Wedding

మా ఫ్యాష‌న్ సెక్ష‌న్‌లో ఇలాంటి సెల‌బ్రిటీల ఆస‌క్తిక‌ర విశేషాలు చాలా ఉంటాయి. అప్పుడ‌ప్పుడు మమ్మ‌ల్ని ప‌ల‌క‌రిస్తే మీకు బోలెడ‌న్ని విష‌యాల‌ను చెబుతాం.

English summary

Zaheer Khan Sagarika Ghatge Wedding

Zaheer Khan and his long-time fiancee, Sagarika Ghatge, got hitched today and both of them looked adorable in their simple yet amazing wedding avatars. The unconventional and so elegant bridal look actually impressed us and the tiny black bindi completed her look for the D-day. Both of them stunned us with their simple looks.
Subscribe Newsletter