Latest Updates
-
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.!
లాక్మే ఫ్యాషన్ 2020 : ర్యాంప్ పై రెచ్చిపోయిన రకుల్... సన్నీ లియోన్.. అదితి రాయ్...
ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు తాము వేసుకునే డ్రస్సులు ఫ్యాషనబుల్ కనిపించడంతో పాటు.. చాలా సౌకర్యవంతంగా కనిపించాలని ఆశిస్తున్నారు.
ఓ వైపు సన్నీ లియోన్ ర్యాంపుపై హంస నడక... మరోవైపు పొడుగు కాళ్ల సుందరాంగులు రకుల్ ప్రీత్ సింగ్, అదితీ రాయ్ లు ర్యాంపుపై రెచ్చిపోయారు. లాక్మే ఫ్యాషన్ వీక్ లో తమ లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులతో.. ట్రెండింగ్ స్టైల్ తో అందరినీ తెగ ఆకట్టుకున్నారు. వీరంతా ధరించిన ఈ అవుట్ ఫిట్స్ కాలేజీ లేడీస్ బాగా సూట్ అవుతాయి.

ఎందుకంటే ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు తాము వేసుకునే డ్రస్సులు ఫ్యాషనబుల్ కనిపించడంతో పాటు.. చాలా సౌకర్యవంతంగా కనిపించాలని ఆశిస్తున్నారు. అదే సమయంలో డ్రస్సింగ్ స్టైల్ లో తమ మార్కు కూడా ప్రత్యేకంగా కనిపించాలని తెగ ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే ఫ్యాషన్ ను ఇష్టపడే అమ్మాయిలంతా రెగ్యులర్ అవుట్ ఫిట్స్ కు బదులు రకుల్, సన్నీ, అదితీ రాయ్ ఫ్యాషన్స్ ను ప్రయత్నించి చూడండి.... అందరిలో మీరు ప్రత్యేకంగా.. మరింత ఆకర్షణీయంగా కనబడండి... ఇంతకీ వీరు ఎలాంటి డ్రస్సులను ఎంపిక చేసుకున్నారో తెలుసుకునేందుకు ఈ ఫొటోలపై ఓ లుక్కేయండి...

సన్నీ ఎంతో సెక్సీగా...
వయసు పెరిగినా.. సన్నీ లియోన్ అందం ఏ మాత్రం తగ్గలేదు. పైగా పైగా రోజు రోజుకు మరింత అందంగా కనిపిస్తోంది. ఇప్పటికే హాట్ హాట్ గా కనిపించిన సన్నీ కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. తాజాగా లాక్మే ఫ్యాషన్ లో కూడా ర్యాంపుపై కొత్త డ్రెస్సులో సరికొత్తగా కనిపించింది.

ర‘కూల్‘ డ్రస్సు..
రకుల్ ప్రీత్ సింగ్ కూడా సన్నీలియోన్ తో సమానంగా ర్యాంపుపై రెచ్చిపోయింది. బ్లాక్ అండ్ వైట్ డ్రస్సుతో... హంసలా నడుచుకుంటూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ డ్రస్సులకు మ్యాచింగ్ టై, షూ ధరించింది. అంతేకాదు తన ముఖం కాంతి వంతంగా కనపడేలా చాలా జాగ్రత్తలే తీసుకుంది. బ్లాక్ అండ్ వైట్ డ్రస్సులో తన ముఖం చంద్రబింబం వలే మెరిసిపోగా.. తన లిప్స్ తన ఫేస్ గ్లోను మరింత పెంచాయి.

అదితి రాయ్..
మరో హీరోయిన్ అదితి రాయ్ కూడా లాక్మే ఫ్యాషన్ వీక్ 2020లో అందరి కంటే అందంగా కనిపించేందుకు ప్రయత్నించింది. ఈ బాలీవుడ్ అందాల భామ బ్లూ అండ్ బ్లాక్ డ్రస్సు వేసుకుని ర్యాంపుపై వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది. ఈమె డ్రస్సుకు తగ్గట్టు బ్లాక్ కలర్ షూ ధరించింది.

జీన్స్ అండ్ టీషర్ట్
ఈ మధ్యన కాలేజ్ గర్ల్స్ అంటే జీన్స్ ప్యాంట్ లేదా టీషర్ట్స్ వేసుకోవడం చాలా కామన్ అయిపోయింది. అందుకే సన్నీ లియోన్ కొత్త రకం టీ షర్ట్ తో అందరినీ అలరించింది. అయితే తను జీన్స్ ప్యాంట్ మాత్రం వేసుకోలేదు. తన పిక్కలు అందంగా కనిపించేలా మాత్రం జాగ్రత్తలు తీసుకుంది. అయితే ఆ టీషర్ట్ కు మ్యాచింగ్ షూ కూడా వేసుకుని మరోసారి అలరించింది. ఈ డ్రస్సును మీరు ధరిస్తే ఎంత ట్రెండీ కనిపిస్తారో సన్నీని చూస్తే మీకు ఇట్టే అర్థమైపోతుంది.

క్లాసీ కాంబినేషన్..
సన్నీ లియోన్ కు పోటీగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా చక్కటి క్లాసీ కాంబినేషన్ డ్రస్సుతో ర్యాంపుపై రెచ్చిపోయింది. మీరు కూడా రకుల్ ప్రీత్ సింగ్ లాగా ఆకర్షణీయమైన డ్రస్సు వేసుకుంటే మీ లుక్ కంప్లీట్ అయినట్టే... ఈ రకుల్ డ్రస్సును చూస్తే ఇది నిజమే అంటారు.



Click it and Unblock the Notifications
