హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, ఆస్తమా సమస్యలతో పోరాడే పండు ఇది

సీతాఫలం తరచుగా తీసుకోవడం మూలంగా ఆస్థ్మా సమస్యలు నివారించవచ్చునని చెప్పబడింది. మరియు తరచుగా ఆస్థమా అటాక్స్ ఎదురవకుండా చూడగలదు. ఎందుకంటే సీతాఫలం విటమిన్ - C లో సమృద్ధిగా ఉంటుంది కాబట్టి.

'రోజుకో యాపిల్, వైద్యుని దూరంగా ఉంచుతుంది' అని ఆంగ్ల నానుడి. సాధారణంగా ప్రతిరోజూ ఒక యాపిల్ తీసుకోవడం మూలంగా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అనేక అధ్యయనాలలో తేలింది కూడా. కానీ యాపిల్ తీసుకోవడంలో కూడా సమయాన్ని పాటించాలని ముందు వ్యాసాలలో మనం తెలుసుకున్నాం కూడా.

అదేవిధంగా మనకు సాంప్రదాయక యాపిల్ పండుగా మరొక పండు అందరి ఆదరాభిమానాలను చూరగొంది. అదే సీతాఫలం. ఆటిస్ లేదా షుగర్ యాపిల్ లేదా కస్టర్డ్ యాపిల్ అని పిలవబడే సీతాఫలం కూడా అసాధారణమైన రక్తపోటు, స్ట్రోక్, హృదయ సంబంధిత శారీరిక వ్యాధులతో పాటుగా, డిప్రెషన్, ఆందోళనల వంటి అనేక మానసిక ఆరోగ్య సమస్యలతో సైతం వ్యతిరేకంగా పోరాడే లక్షణాలను కలిగి ఉందని నిరూపించబడింది.

ఆటిస్ లేదా షుగర్ ఆపిల్ అని పిలిచే ఈ సీతాఫలం ఏ పండ్ల దుకాణంలో అయినా, అందుబాటు ధరలలోనే లభించే ఉత్తమ ప్రయోజనాలను కలిగి ఉన్న పండుగా ఉంది. యాపిల్లో లభించే అద్భుతమైన పోషకాలన్నీ ఈ సీతాఫలంలో కూడా లభిస్తాయి. ఇది లేత ఆకుపచ్చ రంగును కలిగి, ఎక్కువ గింజలతో కూడుకుని, అతి మధురంగా ఉంటుంది. మరొక రూపంలో అత్యంత అరుదుగా రామాఫలం అని కూడా లభిస్తుంటుంది. దీనిని ఒక డెసర్ట్ వలె తీసుకునేందుకు, ప్రజలు సుముఖత చూపుతుంటారు. ఎందుకంటే ఇది మండుటేసవిలో కూడా ఒక రుచికరమైన రిఫ్రెష్మెంట్ అందించేలా నీటిని మరియు పోషకాలను కలిగి ఉంటుంది కాబట్టి., దీనిలోని సహజసిద్దమైన ఖనిజాలు, పోషకాలు శరీర జీవక్రియలకు, ఆరోగ్యకరమైన జీవన శైలికి ఎంతగానో సహకరించగలవు.

ప్రతిరోజూ సీతాఫలం తీసుకోవాలి అనడానికి దీనిలోని ప్రోటీన్లు మాత్రమే కారణం కాజాలదు,

అనేకమైన ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

The Fruit That Fights Hypertension, Cholesterol And Asthma


1. ఆస్థమా సమస్యలతో బాధపడుతున్న వారికి సీతాఫలం చాలా మంచిది.

సీతాఫలం తరచుగా తీసుకోవడం మూలంగా ఆస్థ్మా సమస్యలు నివారించవచ్చునని చెప్పబడింది. మరియు తరచుగా ఆస్థమా అటాక్స్ ఎదురవకుండా చూడగలదు. ఎందుకంటే సీతాఫలం విటమిన్ - C లో సమృద్ధిగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఈ పండులో ఉండే విటమిన్ C మొత్తం 150% సిఫార్సు చేయబడిన రోజువారీ విటమిన్ విలువతో సమానం. వారి శ్వాస నాళాలలోని వాపును తగ్గించడం మూలంగా, ఆస్థమా సమస్యతో పోరాడే ప్రజలకు ఉపశమనాన్ని అందివ్వగలదు. ఈ పండులోని శక్తివంతమైన అనామ్లజనకాల ప్రభావం, మరియు అధిక మోత్తాలలోని విటమిన్ – సి నిల్వలు వాపును తగ్గించగలవు.

The Fruit That Fights Hypertension, Cholesterol And Asthma

2. హైపర్ టెన్షన్ ఉన్నవారికి కూడా సూచించదగిన పండు :

ఈ పండులో పొటాషియం నిల్వలు అధికంగా ఉంటాయి. పొటాషియం, ఎక్కువ సోడియం తీసుకోవడం మూలంగా జనించే ప్రతికూల ప్రభావాలను సైతం నియంత్రించగలదు. క్రమంగా మీ రక్తపోటు స్థాయిలని నియంత్రించగలదు. ఎందుకంటే దీనిలోని పొటాషియం నిల్వలు, రోజువారీ వినియోగంలో అవసరమైన 18 శాతానికి సమానంగా ఉంటుంది.

The Fruit That Fights Hypertension, Cholesterol And Asthma

3. అధికస్థాయి కొలెస్ట్రాల్ ఉన్నవారికి కూడా సీతాఫలం పండు మంచిది :

సీతాఫలంలో అధిక మొత్తాలలో B విటమిన్ నిల్వలు కూడా ఉంటాయి. ముఖ్యంగా నియాసిన్ విటమిన్ గొప్ప మూలంగా ఉంటుంది. దీనిని విటమిన్ – B3 గా వ్యవహరిస్తారు. ఈ విటమిన్ శరీరంలోని అధిక రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ముఖ్యంగా చెడు LDL కొలెస్ట్రాల్ తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో ఈ పండు తీసుకోవడానికి గల మరొక మంచి కారణం ఇది.

The Fruit That Fights Hypertension, Cholesterol And Asthma


4. శరీరంలో శక్తి స్థాయిలు పెరిగేందుకు కూడా సీతాఫలం ఉత్తమంగా సూచించబడుతుంది:

శక్తి కోల్పోతున్న అనుభూతికి లోనైనప్పుడు, అలసట, నిద్రలేమి సమస్యలతో పోరాడుతున్న ఎడల మీకు సూచించదగిన గొప్ప స్నాక్ వలె సీతాఫలం ఉంటుంది. ఈ పండు మీ రక్తంలోని చక్కెరలను శక్తిగా మార్చగలదు. ఎందుకంటే సీతాఫలంలో థయామిన్ అని పిలవబడే మరొక విటమిన్ – బి ఆధారిత పోషక పదార్ధం ఉంటుంది కాబట్టి. దీనిని విటమిన్ – B1 గా వ్యవహరిస్తారు .

The Fruit That Fights Hypertension, Cholesterol And Asthma


5. సీతాఫలం గుండె జబ్బుల ప్రమాదంతో పోరాడడంతో పాటు, ఆరోగ్యకరమైన గుండెను నిర్వహించడానికి తోడ్పడుతుంది.

సీతాఫలం గుండెఆరోగ్యానికి అత్యంత తోడ్పాటుని అందించే స్నేహపూర్వకమైన పండుగా ఉంటుంది. అమీనోయాసిడ్ల తీవ్ర పెరుగుదలను నివారించే ఫైబర్ మరియు విటమిన్ B6 (పైరిడాక్సిన్) నిక్షేపాలను కలిగి ఉంటుంది. మీ రక్తంలో అధిక స్థాయిలో ఈ యాసిడ్స్ ఉన్న ఎడల, అది హృదయనాళాన్ని గందరగోళ పరిస్థితుల్లో ఉంచుతుంది, క్రమంగా ఇది కరోనరీ వ్యాధి మరియు స్ట్రోక్ సమస్యలకు దారితీస్తుంది.

The Fruit That Fights Hypertension, Cholesterol And Asthma

6. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికి సీతాఫలం పండు మంచిది

సీతాఫలంలో ఉండే ఖనిజాలలో ప్రధానంగా రాగి కూడా ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ అయిన థైరాక్సిన్ ఉత్పత్తికి సహాయపడే సహజ సిద్ద ఖనిజంగా ఉంటుంది.

పై విషయాలను పరిశీలించి చూసిన ఎడల, సీతాఫలం అధికంగా పోషకాలు, ఖనిజాలతో నిండి ఉండి, శరీర జీవక్రియలకు తోడ్పాటుని అందివ్వగలదని తీర్మానించవచ్చు. ఈ కారణం చేతనే పురాతనకాలం నుండి తరచుగా, అనేక సాంప్రదాయక వ్యాధి నివారణా చికిత్సల్లో భాగంగా గృహ వైద్యంగా సీతాఫలాన్ని వినియోగించడం జరుగుతుంది. అంతేకాకుండా హైపర్టెన్షన్(ఆందోళన), గుండె సమస్యలు, కండరాల నొప్పులు, ఆస్తమా వంటి సాధారణ వ్యాధులతో పోరాడడంతో పాటు, అనేక ఇతర జీవక్రియలకు కూడా సహకారాన్ని అందిస్తూ, హార్మోనుల హెచ్చుతగ్గులను కూడా క్రమబద్దీకరించే లక్షణాలను కలిగి ఉంటుంది. పైన చెప్పిన సమస్యలకు వ్యతిరేకంగా పోరాడటానికి మీరు సహజ సిద్దమైన మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లయితే, సీతాఫలం మీకు ఉత్తమ ఎంపికగా ఉండగలదు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవన శైలి, ఆహార, హస్త సాముద్రిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion