మీ స్మైల్ కు ఫిదా అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? డాక్టర్ సాయి శ్రుతితో ప్రత్యేక ఇంటర్వూ

మనిషి శరీరంలోని అన్ని అవయవాల బాగుండాలని అందరూ అనుకోవడం సర్వసాధారణం. అయితే నోరు శుభ్రంగా ఉంటే మన శరీరం కూడా శుభ్రంగా ఉంటుందని ఆలోచించే వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అన్న సామెతలాగా మనం నోరు, మన దంతాలను శుభ్రంగా పెట్టుకుంటే ప్రతిరోజు మనం తినే ఆహారం కూడా అంతే శుభ్రంగా మన కడుపులోకి వెలుతుంది. ఆరోగ్యకరమైన, శుభ్రంగా ఉండే ఆహారం తింటే మన శరీరం కూడా శుభ్రంగా ఉంటుంది

మన శరీరంలోని అవయవాల గురించి మనం ఎంత ఎక్కువ శ్రద్ద తీసుకుంటామో మన నోటి గురించి, దంతాల గురించి అంతే శ్రద్ద తీసుకోవాలని దంత వైద్యులు సూచిస్తున్నారు. టూత్ సెన్సిటివిటి, దంతక్షయం, డెంటల్ ఇన్ ప్లాంటేషన్ మీద హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కాస్మోటిక్ డెంటల్ సర్జన్, లివియాంగ్ (Livyoung) క్లీనిక్ కు చెందిన డాక్టర్ సాయి శ్రుతి ప్రత్యేక ఇంటర్వూను మీకు అందిస్తున్నాము.

Exclusive Interview With Doctor Sai Sruthi

1. డెంటల్ చెకప్స్ ఎంత తరచుగా చేసుకుంటే మంచిది?

దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి 6 నెలకొకసారి డెంటిస్ట్ ను సంప్రదించడం మంచిది. అలా చేయించుకోవడం వల్ల ప్రారంభంలో దంతక్షయ లక్షణాలు, గారపట్టడం, పసుపు పళ్ళు వంటి దంత సమస్యలను నివారించవచ్చు. ఈ సమస్యలను ముందుగా గుర్తించినట్లైతే వెంటనే స్కేలింగ్ వంటి చికిత్సతో దంతాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు. కాబట్టి ప్రతి 6 నెలకొకసారి డెంటల్ చెకప్స్ అవసరం.

2. నోటి పరిశుభ్రతను పాటించడానికి ఉత్తమ మార్గాలు ఏమిటి?

నిద్రలేచిన వెంటనే నోటి పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. అందుకోసం పళ్ళు తోముకోవాలి. ముఖ్యంగా రోజులో ఉదయం, సాయంత్రం రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసేటప్పుడు అటు ఇటు తిరుగూ మాట్లాడుతూ తోముకోకుండా, ఒక చోట నిలబడి కరెక్ట్ గా 2 నిముషాల పాటు బ్రష్ చేయాలి. అంత తక్కువ సమయంలో దంతాలు ఎలా శుభ్రపడతయానేగా మీ సందేహాం? అవును ఈ సందేహం నాకూ ఉంది. అయితే డాక్టర్ సమాధానం నాకు ఆశ్చర్యం కలిగించింది. కేవలం రెండు నిముషాలు బ్రష్ చేయడం ఎందుకంటే దంతాల మీద ఉండే ఎనామిల్ తగ్గిపోకుండా ఉంటుంది. అందుకోసం బ్రష్ ను 45% యాగింల్లో పెట్టి రుద్దాల్సి ఉంటుంది. అలాగే ఆహారం తిన్న వెంటనే , కాఫీ మరియు టీలు తాగిన వెంటనే నోట్లో నీళ్ళు పోసుకుని పుక్కలించాలి.

3. దంతాలు తెల్లగా ఉండాలంటే ఏం చేయాలి? మెడికల్ షాప్స్ లో లభించే పేస్ట్ లు లేదా కిట్లు సురక్షిమేనా?

దంతాలు తెల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాబట్టి, ముందు మీ దంతాలకున్న సమస్య ఏంటో తెలుసుకుంటే ట్రీట్మెంట్ ఇవ్వొంచ్చు. ముఖ్యంగా ఫ్లోరైడ్ వాటర్, హార్డ్ వాటర్ కూల్ డ్రింక్స్, కాఫీ మరియు టీ , ఆల్కహాల్ వల్ల దంతాలు పసుపుగా మారినా..గారపట్టినా అందుకు ఫ్లోరోసిస్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేదా పైన చెప్పినట్లు స్కేలింగ్ ద్వారా దంతాలను శుభ్రం చేయించుకోవచ్చు. ఇక మెడికల్ షాపులో ఉండే ట్రిఫ్స్ వాడినా , క్రిట్స్ వాడినా అవి తాత్కాలికం మాత్రమే . దంతాలు తెల్లగా ఉండాలంటే దానికి కారణం తెలుసుకుని టీత్ వైటనింగ్ చికిత్స చేయించుకోవాలి.

Exclusive Interview With Doctor Sai Sruthi

4 . ఏ రకమైన టూత్ బ్రష్ మరియు టూత్‌పేస్ట్ ఉపయోగించాలి?

మనం రోజూ ఉపయోగించే బ్రష్యుల్లో 3 రకాలు ఉన్నాయి. 1. సాప్ట్ బ్రష్ 2. హార్డ్ బ్రష్ 3. అల్ట్రాబ్రష్ లు ఉన్నాయి. రోజూ బ్రష్ చేయడానికి హార్డ్ బ్రష్ ఉపయోగిస్తే దంతాల మీద ఎనామిల్ దెబ్బతింటుంది. కాబట్టి సాఫ్ట్ బ్రష్, మినీ సాఫ్ట్ బ్రష్ వాడటం మంచిది. టూత్ సెన్సిటివిటి ఉన్నవాళ్లు మిని సాఫ్ట్ బ్రష్ వాడితే మంచిది. ఇవి మీకు మెడికల్ షాప్స్ లో అందుబాటులో ఉంటాయి.

5. దంతాల సున్నితత్వం(senstivity)అంటే? సెన్సిటివిటికి కారణం?

దంతాల సెన్సిటివిటి అంటే మనం ఏదైనా తిన్నా తాగినా పళ్ళు జివ్వుమని లాగడం, చల్లగా వేడిగా ఏదీ తీసుకోలేకపోవడం. ఇంకా కూల్ డ్రింక్స్, అసిడిక్ డ్రింక్, సోడా, ఆల్కహాల్, స్మోకింగ్ చేయడం వల్ల, పళ్లు కొరకడం (టీత్ గ్రైండింగ్), కొన్ని సందర్భాల్లో టీత్ వైటనింగ్ చేయించుకోవడం వల్ల కూడా దంతాల్లో సున్నితత్వం(senstivity) పెరిగిపోతుంది.

6. స్మైల్ ను ఎలా మెరుగుపరచగలను?

:) మీ ముఖంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటే, స్మైల్ తో ముఖం అందంగా కనబడుతుంది. ప్రత్యేకించి దంతాలు పాడైనా, లేదా సందులు ఉన్నా, క్యాప్స్ వేయించుకోవచ్చు. ఏవైనా ఇబ్బంది వస్తే మళ్లీ మార్చుకోవచ్చు. సెలబ్రెటీలు వంటి వారు స్మైల్ డిజైన్ చేయించుకుంటుంటారు. అవసరం అయితే తప్ప చేయించుకోకూడదు. ఇక పైన చెప్పినట్లు రెండు సార్లు బ్రష్ చేయడం. గారతొలగించుకోవడం చేయాలి. హార్డ్ అండ్ అబ్రిసివ్ టూట్ పేస్ట్ వాడకూడదు. స్మోకింగ్, ఆల్కహాలు, కూల్ డ్రింక్స్, టీ మరియు కాఫీలకు దూరంగా ఉంటే మంచిది.

7. డెంటల్ ఇంప్లాంట్‌లను ఎప్పుడు చేయించుకోవాలి?

దంతాలు లేనప్పుడు ఇంప్లాంటేషన్ అవసరం అవుతుంది. నోటి లోపలి నుండి దవడ ఎముకకు సపోర్ట్ గా శాశ్వత బలమైన పునాది వేసిన తర్వాత పళ్ళను ఫిక్స్ చేస్తారు. ఇందులో కట్టుడు పళ్లు, తీసి పెట్టివి, పర్మనెంట్ ఫిక్సింగ్ చేసివి ఉన్నాయి.

Exclusive Interview With Doctor Sai Sruthi

8. మౌత్ వాష్(Mouth Wash)రెగ్యులర్ గా వాడొచ్చా?

మౌత్ వాష్ ను రెగ్యులర్ గా వాడకూడదు. దంతాలపై ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. అప్పుడప్పు వాడవచ్చు. మాంసాహారాలు, ఫాస్ట్ ఫుడ్స్ తిన్న్పుడు పళ్ల మద్యల్లో ఆహార స్పటికాలు చిక్కుకుని బ్యాక్టీరియా ఏర్పకుండా ఉండేందుకు మౌత్ వాష్ అప్పుడప్పుడు ఉపయోగించవచ్చు.

9. పిల్లలల్లో క్యావిటీస్ ను ఎలా నివారించాలి?

పిల్లలు 1 సంవత్సరం నుండి 10 ఏళ్ళ వరకు చాక్లెట్స్, బిస్కెట్లు తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అవి పళ్ళ సందుల్లో ఇరుక్కుని క్యావిటీస్ కు దారితీస్తాయి. త్వరగా దంతాలు పుచ్చిపోవడం, ఊడిపోడం జరుగుతుంది. కాబట్టి, పిల్లలు స్వీట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ తిన్న వెంటనే వారితో పండ్లు, పచ్చి కూరగాయలు క్యారెట్ , బీట్ రూట్, ఆపిల్, జామ మొదలగునవి తినిపిస్తే వాటిలో ఉండే పీచు పదార్థం దాంతాల్లో ఇరుక్కున్న స్వీట్, చాక్లెట్ వంటి వాటిని బయటికి లాగేస్తుంది.

10. గర్భిణీలు తినే ఆహారం మీ శిశువు దంతాలపై ప్రభావం చూపుతుందా?

అలా అనేమి ఉండదు. అయితే తల్లి సరియైన పోషకాహారం తీసుకోకపోతే అది కడుపులో పెరిగే బిడ్డ ఆరోగ్యంపై అంటే ఎముకలు, దంతాలు ఏర్పాటుకు పోషకాహారా లోపాలు కారణం అవుతాయి. కొన్ని సందర్బాల్లో మాత్రం హెరిడిటి వల్ల రావచ్చు.

Exclusive Interview With Doctor Sai Sruthi

11. ఆరోగ్యకరమైన దంతాల కోసం ఏదైనా డైట్ ఫాలో అవ్వాలా?

అలా ప్రత్యేకించి ఏవి లేవు కానీ, అన్నీ ఆహారాలు తినాలి. కాకపోతే ఎముకలకు దంతాలకు క్యాల్షియం ఫుడ్స్ ఎక్కువగా అవసరం కాబట్టి. అందుకోసం పాలు, గుడ్లు, యాపిల్, క్యారెట్స్, ఆకుకూరలు, బ్రొకోలీ, ప్రొబయోటిక్స్ ఎక్కువ తీసుకుంటూ..అసిడిక్ ఫుడ్స్ తగ్గించాలి. షుగర్ ఫుడ్స్, ప్రొసెస్డ్ ఫుడ్స్ తినకపోవడం మంచిది.

12. చక్కెర లేని చూయింగ్ గమ్(sugar-free chewing gum) దంతాలకు మంచిదా?

ఒక రకంగా హెర్బల్స్ తో తయారుచేసినవి మంచిదే. పుదీనా, తులసి, దాల్చిన చెక్క, నిమ్మ, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. హెర్బల్ చూయింగ్ గమ్ మితంగా తింటే మంచిదే. అయితే టూత్ సెన్సిటివిటి ఉన్నవారు, దంతక్షయం ఉన్నవారు తినకూడదు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion