Latest Updates
-
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే
వర్షాకాలం వచ్చిందంటే.. ఐ లవ్ బనానా అనాల్సిందే, అనడమే కాదు మస్తుగా తినాల్సిందే!
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. పెద్ద ఎత్తున సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా కండ్లకలక, జలుబు, మోషన్స్.. ఇలా చాలా వస్తుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి ఆస్పత్రులు చుట్టూ తిరగడం కంటే రాకముందే జాగ్రత్త పడడం చాలా మంచిది.
ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో మాంసాహారం తీసుకున్నా చాలా మందికి పడదు. డైజెస్ట్ కూడా సరిగ్గా అవ్వదు. కడుపు నొప్పిగా ఉంటుంది. అందుకే సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం చాలా మంచిది.

అరటి పండు చాలా మంచిది. వర్షాకాలంలో అరటి పండు తినడం వల్ల అజీర్తి వంటి సమస్యలు దూరం అవుతాయి. పొట్టకి చాలా హాయిగా ఉంటుంది. అరటి పండ్లు తినడం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని కూడా కాపాడతాయి. అరటి పండ్లలో కార్పో హైడ్రేట్స్ అత్యధికంగా ఉంటాయి. పిండి పదార్థాలు ఉ్నన ఆహారం తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి మెండుగా అందుతుంది. ఉదయాన్నే వీటిని తినడం వల్ల శక్తి వస్తుంది.
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. అంతే కాకుండా దీన్ని తీసుకోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. వర్షాకాలంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల కడుపులో మంట, కడుపు నొప్పి వస్తుంది. అలాగే అరటి పంండ్లలోని పెక్టిన్ అనే ఫైబర్ జీర్ణక్రియని మెరుగ్గా చేసి కడుపు నొప్పి, విరోచనాలకి ట్రీ ట్ మెంట్ గా వాడవచ్చు.
రోగనిరోధక శక్తిని పెంచి రోగాలను దరిచేరనీయదు:
అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ అరటి పండు ముందు ఉంటుంది. అరటి పండులో ఉండే బీ6, మెగ్నీషియం, పొటాషియం, ఇమ్యూనిటీని పెంచుతాయి. ఈ వర్షాకాలంలో రకరకాల వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉన్నందున.. వాటి నుంచి బయట పడాలంటే కచ్చితంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా కావాల్సిందే. అయతే అరటి పండ్లను తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. శరీరానికి నీరు చాలా అవసరం. నీటిని సరిగ్గా తీసుకోకపోతే ఎన్నో చర్మ సమస్యలు వస్తాయి.
వేసవి కాలం కంటే కూడా వర్షాకాలమే అరటి తినడం మంచిది:
అరటి పండులో 75 శాతం నీరు ఉంటుంది. దీని వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. కొంతమంది సమ్మర్ లో మాత్రమే అరటి పండ్లను తింటారు. కానీ వీటిని వర్షాకాలంలో తినడం మరింత మంచిది. అరటి పండ్లలో విటామిన్లు, మెగ్నీషియం, పొటాషియం, బీ6లు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటామిన్ సి కూడా అధికంగా ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా చర్మాన్ని కాపాడుతుంది. అదే విధంగా అరటి పండు తింటే చర్మం యవ్వనంగా, మెరుస్తూ ఉంటుంది.
ఇన్ని పోషకాలనిచ్చే అరటి పండుకు ఐ లవ్ యూ చెప్పాల్సిందే..!
అరటి పండుతో ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. మరి ఇన్ని లాభాలు ఇచ్చే అరటి పండ్లను మీరు అస్సలే తినకుండా ఉండకూడదు. ఐ లవ్ బనానా.. బనానా..నానా అంటూ ఇష్టంగా లాగించేయాలి. అప్పుడే ఆరోగ్యానికి ఆరోగ్యం. అందానికి అందం మీ సొంతం అవుతాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
