Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెరుగుతో వీటిని అస్సలు తినకూడదు!..ఆయుర్వేదం చెబుతున్న రహస్యం
మన ఆరోగ్యం మొత్తం దాదాపుగా మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు తరచుగా చెబుతుంటారు. పాలు,పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తులు మన ఆరోగ్యానికి బోలెడు మేలు చేస్తాయని చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. కొందరికి అయితే ప్రతి రోజూ భోజనంలో లేదా డిన్నర్ లో పెరుగు తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. ఎన్ని కూరలు,పచ్చళ్లలో భోజనం చేసినా చివర్లో పెరుగుతో రెండు ముద్దలు తినకపోతే తిన్న తృప్తి ఉండదు. వాస్తవానికి పెరుగు మన ఆరోగ్యానికి బోలెడు మేలు చేసేదే అయినప్పటికీ దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తింటే దాని ప్రయోజనాలు మనకు లభించవు.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, చర్మాన్ని ప్రకావింపపజేయడంలో పెరుగు చాలా బాగా సహాయపడుతుంది. అయితే సాధారణంగా మనలో చాలామందికి పెరుగుతో కలిపి ఉల్లిపాయ తినడం లేదా మరికొన్ని ఇతర ఆహారపదార్థాలను పెరుగుతో కలిపి తినే అలవాటు ఉంటుంది. అయితే ఇది చాలా డేంజర్ అని మీకు తెలుసా? కొన్ని ఆహార పదార్థాలు విడివిడిగా మంచి పోషకాలు అందించినా, వాటిని కలిపి తీసుకున్నప్పుడు శరీరానికి హాని కలిగించవచ్చు. పెరుగును కొన్ని వస్తువులతో కలిపి తింటే అది ప్రయోజనకరంగా ఉండటానికి బదులుగా హాని కలిగిస్తుంది. ఆయుర్వేదంలో పెరుగుతో అనేక పదార్థాలను తినడం నిషేధించబడింది. పెరుగుతో వేటిని కలిపి తినకూడదో ఇక్కడ చూడండి.

పెరుగుతో కలిపి వీటిని అస్సలు తినకూడదు
పెరుగు,చేప
చేపలు, పెరుగు రెండూ కూడా ప్రోటీన్ కు మంచి వనరులే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే వాటి స్వభావం, జీర్ణమయ్యే విధానం వేర్వేరుగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల శరీరంలో విషపూరిత అంశాలు ఏర్పడతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ విషపూరిత పదార్థాలు మీ శరీరంలో చేరి అలెర్జీలు, మొటిమలు, మరియు ఇతర చర్మ వ్యాధులకు దారితీయవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఇది నిషిద్ధమైన ఆహార కలయికగా పరిగణించబడుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రెండు ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం పట్ల జాగ్రత్త వహించడం బెటర్.
పెరుగు,ఉల్లిపాయ
చాలామందికి పెరుగు ఉంటే పక్కన ఉల్లిపాయ తప్పనిసరిగా ఉండి తీరాత్సిందే. పెరుగు అన్నం తినే సమయంలో ఉల్లిపాయ కొరకడం కొందరికి అలవాటు. ఆయుర్వేదం ప్రకారం ఇది నిషిద్ధమైన ఆహార కలయికగా పరిగణించబడుతుంది. వాస్తవానికి పెరుగు చల్లగా ఉంటుంది..ఉల్లిపాయ వేడి గుణం కలిగి ఉంటుంది. ఈ రెంటిని కలిపి తింటే అసిడిటీ,గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. దీని వల్ల చర్మవ్యాధుు కూడా వచ్చే అవకశం ఉంది.
పెరుగు,పుల్లని పదార్థాలు
పెరుగుతో పుల్లని పదార్థాలను కలిపి తినడం అస్సలు మంచిది కాదు. పెరుగు స్వతహాగానే కొంచెం పుల్లగా ఉంటుంది. దీనికి నిమ్మకాయ, చింతపండు, లేదా ఇతర పుల్లని పండ్లు, పదార్థాలు కలిపినప్పుడు శరీరంలో ఆమ్లత్వం (Acidity) అమాంతం పెరిగిపోతుంది. ఈ అధిక ఆమ్లత్వం వల్ల మీకు కడుపులో అసౌకర్యం, మంట, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థపై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే పెరుగును పెరుగులాగే తినండి. పుల్లని పదార్థాలను దానికి దూరంగా ఉంచండి.
పెరుగు, పాలు
పా3లు,పెరుగూ రెండూ కూడా పాల ఉత్పత్తులే అయినప్పటికీ ఆయుర్వేదంలో పెరుగు, పాలు కలిపి లేదా ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవడం నిషేధించబడింది. ఇది కఫ దోషాన్ని తీవ్రతరం చేస్తుంది, ఇది అలెర్జీలు, జలుబు, శ్లేష్మం వంటి సమస్యలకు దారితీస్తుంది.

పెరుగు, మినుములు
ఈ కలయిక జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. ముఖ్యంగా కడుపులో బరువు, గ్యాస్ లేదా మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు మినపప్పుతో చేసిన వస్తువులను పెరుగుతో కలిపి తినకూడదు.
పెరుగు తినడానికి సరైన సమయం ఏది?
పెరుగు తినడానికి ఉత్తమ సమయం ఉదయం మరియు మధ్యాహ్నం. వేసవిలో మధ్యాహ్నం పెరుగు తినడం చాలా మంచిది. రాత్రిపూట పెరుగు తినకూడదు. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పెరుగు తినడం వల్ల కఫ దోషం పెరుగుతుంది, జలుబు- దగ్గు వస్తుంది. భోజనం తర్వాత వెంటనే పెరుగు తీసుకోవడం మంచిది కానీ పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications