Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్ తాగితే చాలు.. బరువు, పొట్ట మాయం!..గ్యాస్,అజీర్తి సమస్యలకు చెక్
బాలీవుడ్ నటి నేహా ధూపియా ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. 45 ఏళ్ల వయసులోనూ ఆమె అంత ఫిట్ గా, యాక్టివ్ గా ఉండటానికి కారణం ఆమె తీసుకున్న 21 రోజుల ఛాలెంజ్.
ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రిచా గంగాని పర్యవేక్షణలో నేహా ఈ ఛాలెంజ్ స్వీకరించారు. దీని ప్రధాన ఉద్దేశం కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదండోయ్.. అంతకంటే ముఖ్యంగా శరీరంలో మంట తగ్గించి, ఆరోగ్యాన్ని పునరుద్ధరించడమేనట.

ఈ ఛాలెంజ్ లో భాగంగా నేహా ప్రతి రాత్రి పడుకునే ముందు ఒక ప్రత్యేకమైన హెర్బల్ డ్రింక్ తాగుతున్నారు. దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్య తగ్గి, రాత్రిళ్లు ప్రశాంతమైన నిద్ర పడుతుందని, ఉదయం లేవగానే శరీరం ఎంతో తేలికగా అనిపిస్తుందని ఆమె తన అనుభవాన్ని షేర్ చేశారు.
ఆ మ్యాజిక్ డ్రింక్ తయారీ విధానం
మీరు కూడా నేహా ధూపియా లాంటి ఫలితాలను పొందాలనుకుంటే.. వంటింట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో ఈ పానీయాన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు.
ఒక గిన్నె నీటిలో సోంపు, కొత్తిమీర లేదా థైమ్, జీలకర్ర, అల్లం వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత నీటిని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. రుచి కోసం లేదా అదనపు ప్రయోజనాల కోసం ఇందులో కాస్త నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.
ఈ డ్రింక్ ఎందుకంత పవర్ ఫుల్?
ఈ డ్రింక్ లో వాడే ప్రతి పదార్థం మన జీర్ణవ్యవస్థకు ఒక వరం లాంటిది. అవి ఎలా పని చేస్తాయో చూడండి.
సోంపు: సాధారణంగా మనం భోజనం తర్వాత సోంపు తింటాం. ఇది కేవలం నోటిని శుభ్రపరచడమే కాదు, ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కడుపులో అసౌకర్యాన్ని, గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి.
జీలకర్ర: మన వంటింటి వైద్యంలో జీలకర్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది పేగుల్లో జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమై, గ్యాస్ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ కంట్రోల్ లోనూ సహాయపడతాయి.
అల్లం: అల్లంలో ఉండే జింజెరాల్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం అద్భుతమైన ఔషధం. ఇది పేగు కండరాలను సడలించి, ఆహారం కడుపులో నిల్వ ఉండకుండా త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఫలితంగా అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దరిచేరవు.
నిమ్మరసం: ఇందులో కలిపే నిమ్మరసం జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి, గ్యాస్ ఏర్పడకుండా చూస్తుంది. విటమిన్-సి శరీరంలోని మలినాలను శుభ్రం చేస్తుంది. అయితే రాత్రిపూట నిమ్మరసం పడని వారు దీనిని మినహాయించవచ్చు.
మీరు కూడా కడుపు ఉబ్బరం, అజీర్తి లేదా నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటే నేహా ధూపియా సూచించిన ఈ చిట్కాను ఒకసారి ప్రయత్నించి చూడండి. అయితే ఏదైనా కొత్త డైట్ ప్రారంభించే ముందు డాక్టర్ లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం బెటర్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications