Latest Updates
-
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.!
హైబీపీ ఉన్నవారికి అలర్ట్.. పరగడుపున పెరుగన్నం తింటే ఇన్ని లాభాలా.?
మార్నింగ్ లేవగానే బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి. ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరీ, వడ ఇలా రకరకాల టిఫిన్స్‌ను ఇష్టపడుతుంటారు. కానీ ఉదయం అన్నం తినడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే పరగడుపున పెరుగన్నం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

భోజనం చివరిలో పెరుగు లేనిదే సంతృప్తి ఉండదు. ఇక వేసవిలో అయితే మజ్జిగ అదనం. మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో పెరుగు తప్పనిసరి ఉంటుంది. కానీ పరగడుపన కూడా పెరుగన్నం తింటే ఎన్నో పోషకాలు అందుతాయి. ఉదయాన్నే పెరుగన్నం తింటే ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో ఇక్కడ చూద్దాం.
పరగడుపున పెరుగన్నం తీసుకోడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. పేగు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు బాక్టీరియాను పెంచి జీర్ణక్రియ మెరుగయ్యేందుకు దోహదపడుతుంది.
ప్రతి రోజూ ఉదయాన్నే పెరుగన్నం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాల్షియం, ప్రొటీన్, మెగ్నీషియం లోపంతో బాధపడుతున్న వారు పెరుగు తీసుకోవడం ద్వారా ఆ లోపాన్ని అధిగమించవచ్చు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు పరగడుపున పెరుగన్నం తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. ఉదయాన్నే పెరుగన్నం ఎముకలను బలపరచడంతో పాటు కడుపు, శరీరాన్ని చల్లబరుస్తుంది.
పెరుగన్నం ఎలా తీసుకోవాలి
ముందు రోజు రాత్రి అన్నంలో పెరుగు కలిపి అందులో కొంచెం జీలకర్ర, ఒక ఉల్లిపాయను ముక్కలుగా చేసి కలపాలి. కొద్దిగా ఉప్పు, రెండు పచ్చిమిర్చిని కట్ చేసి పెరుగన్నంలో వేసి కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపున తింటే శరీరానికి తగినన్ని పోషకాలు అందుతాయి.
గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్న వారు నిల్వ ఉన్న, పుల్లగా ఉన్న పెరుగును తినకూడదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. తాజా పెరుగు తీసుకోవాలి. పెరుగన్నంలో పండ్లు కలుపుకొని తింటే ఇంకా మంచిది.
అయితే పెరుగన్నాన్ని ఇష్టారీతిన తీసుకోకూడదు. ఇందులో చక్కెర కలిపి తీసుకోకూడదని గమనించాలి. పరిమిత మొత్తంలో తీసుకుంటూ ప్రతిరోజూ ఉదయాన్నే పెరుగన్నం తీసుకోవడం ద్వారా ఆయిల్ టిఫిన్స్ జోలికి వెళ్లాల్సిన అవసరం ఉండదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
