Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఆర్జేడీ అభ్యర్థికి 400 లీటర్ల పాలతో అభిషేకం..పాల స్నానం వల్ల ఈ ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా?
బీహార్ లో ప్రస్తుతం ఎలక్షన్ ఫీవర్ కొనసాగుతోంది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి. అయితే ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎన్డీయే కూటమి ప్రయత్నిస్తుండగా..ఈసారైనా అధికార పగ్గాలు దక్కించుకోవాలని ఇండి కూటమి విశ్వప్రయత్నాలు చేస్తుంది. గ్రౌండ్ లెవల్ లో పోరు మాత్రం నితీష్ వర్సెస్ తేజస్వీ యాదవ్ అన్నట్లు ఉంది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ స్టార్స్ కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భోజ్ పురి సూపర్ స్టార్ ఖేసరి లాల్ యాదవ్ రాజకీయ ప్రవేశం పెను సంచలనం సృష్టిస్తోంది. ఛప్రా నుండి ఆర్జేడీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఖేసరికి ఆయన అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.
అది మామూలు స్వాగతం కాదు ఏకంగా 400 లీటర్ల పాలతో అభిషేకం చేసి, నాణేలతో తులాభారం వేసి తమ అభిమాన నటుడిపై ప్రేమను కురిపించారు. సినిమా సన్నివేశాన్ని తలపించిన ఈ దృశ్యం ఆయన ప్రజాదరణకు నిలువుటద్దం పట్టింది. అయితే ఈ పాల స్నానం కేవలం రాజకీయ ప్రదర్శన మాత్రమే కాదు.. సంస్కృతి, అభిమానం, ఆరోగ్యం అద్భుతమైన కలయిక.
పాల స్నానం వెనుక ఉన్న సాంస్కృతిక, ఆరోగ్య ప్రయోజనాలు
భారతీయ సంప్రదాయంలో పాల అభిషేకం గౌరవానికి, స్వచ్ఛతకు, శుభానికి చిహ్నంగా భావిస్తారు. ఇది ప్రతికూల శక్తులను తొలగించి, సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని ఒక నమ్మకం. ఖేసరి విషయంలో ఆయన అభిమానులు స్థానిక రైతుల నుండి పాలను సేకరించి అభిషేకం చేయడం, వారి ఆశీర్వాదాలను అందించడమే కాకుండా వారి మధ్య ఉన్న లోతైన బంధాన్ని సూచిస్తుంది.
ఇక శాస్త్రీయంగా చూస్తే పాల స్నానాలు చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. శతాబ్దాలుగా రాణులు, చక్రవర్తులు సౌందర్యాన్ని కాపాడుకోవడానికి దీనిని ఉపయోగించేవారు.

సహజమైన ఎక్స్‌ఫోలియేషన్: పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం (ఒక రకమైన ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ - AHA) చర్మంపై ఉన్న మృత కణాలను సున్నితంగా తొలగిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా, నునుపుగా మార్చి కొత్త నిగారింపును అందిస్తుంది.
లోతైన తేమ: పాలలోని కొవ్వులు,ప్రోటీన్లు చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. పొడిబారిన చర్మానికి ఇది లోతైన తేమను అందించి, మృదువుగా ఉంచుతుంది.
చికాకు నుండి ఉపశమనం: తామర, సోరియాసిస్ లేదా ఎండదెబ్బ వంటి సమస్యలతో బాధపడేవారికి పాల స్నానం గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది చికాకును తగ్గించి, చర్మాన్ని శాంతపరుస్తుంది.
వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది: పాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, అకాల వృద్ధాప్య ఛాయలను (సన్నని గీతలు, ముడతలు) నివారిస్తాయి. విటమిన్లు A, D చర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
