Latest Updates
-
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్‌బాట్.! -
ఒత్తిడి, ఆందోళనను యోగా ఎలా తగ్గిస్తుంది? -
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.! -
భర్తలకు హెచ్చరిక..భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 ప్లేస్ లకు తీసుకెళ్లొద్దు! -
చక్కెర లేదు, నూనె లేదు..ఎముకలను ఉక్కులా మార్చే, పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ప్రోటీన్ లడ్డూ! -
టెస్టుల అవసరం లేకుండానే మీలో ఫెర్టిలిటీ సమస్య లేదని తెలిపే 5 సంకేతాలు.! -
గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే 5 అద్భుతమైన శాకాహారాలు ఇవే! -
హైదరాబాద్ ఫేమస్ షా గౌస్ చికెన్ దమ్ బిర్యానీ.. ఇప్పుడు మీ ఇంట్లోనే! -
భార్యాభర్తల మధ్య ఎమోషనల్ అబ్యూస్.. ఈ సిగ్నల్స్ కనిపిస్తే చాలా డేంజర్.! -
బ్యాంక్ బెంచ్ స్టూడెంట్,4 సార్లు ఫెయిల్ అయినా కూడా.. ఈ మేడం ఎందరికో ఆదర్శం!
Right way to eat fruits: పండ్ల పూర్తి ప్రయోజనం కావాలా? అయితే ఇలాగే తినాలి!
పండ్లను ప్రకృతి మనకు ప్రసాదించిన అమృత ఫలాలుగా పరిగణిస్తుంటాం. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాల గని అయిన పండ్లను రోజూ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి మన జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ పండ్లను ఎలా తినాలి అనేది చాలామందికి తెలియదు. పండ్ల పూర్తి ప్రయోజనాలను పొందాలంటే వాటిని తిని పద్ధతి తెలుసుకోవం కూడా చాలా ముఖ్యం.సాధారణంగా చాలామంది పండ్లను ముక్కలుగా కోసి, ప్లేట్ లో అందంగా సర్దుకుని తింటారు. కానీ ఇలా చేయడం వల్ల వాటిలోని అసలైన సత్వాన్ని కోల్పోతున్నారని మీకు తెలుసా?
పండ్లను కోసిన వెంటనే అవి గాలి, వెలుతురు, వేడికి గురవుతాయి. దీనివల్ల వాటిలోని పోషకాలు వేగంగా నశించిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తికి కీలకమైన విటమిన్ C..గాలి సోకిన వెంటనే ఆవిరైపోతుంది. జింక్, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాల విలువ కూడా తగ్గిపోతుంది. పండ్లను కోయడం వల్ల వాటి శ్వాసక్రియ రేటు అనూహ్యంగా పెరుగుతుంది. దీనివల్ల వాటిలోని సహజమైన తీపిదనం తగ్గి, రుచి, వాసన మారిపోతాయి. పండ్లు త్వరగా పాడైపోవడానికి కూడా ఇదే కారణం. ఫలితంగా మీరు పండ్లను తిన్నా వాటి సంపూర్ణ ప్రయోజనం శరీరానికి అందదని నిపుణులు తెలిపారు.

కొరికి తినండి ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోండి
ఆపిల్, జామ, సపోటా, స్ట్రాబెర్రీ వంటి కొన్ని పండ్లను తొక్క తీయాల్సిన అవసరం లేదు. వీటిని శుభ్రంగా కడిగి నేరుగా పళ్లతో కొరికి తిన్నప్పుడే అసలైన లాభాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా తొక్కతో పాటు తినడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్, పీచుపదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది జీర్ణక్రియను సులభతరం చేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. పండ్లను కొరికి తినడం వల్ల దంతాలు సహజంగా శుభ్రపడి, చిగుళ్లు బలపడతాయి. శరీరంలో జీవక్రియ వేగవంతమై రోజంతా యాక్టివ్ గా,హెల్తీగా ఉంటారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-పండ్లను కోసి తిన్నా లేదా కొరికి తిన్నా.. తినడానికి ముందు శుభ్రంగా వాటిని కడగడం మాత్రం మర్చిపోకూడదు. లేకుంటే లేని రోగాలను మనలో నోట్లో పెట్టుకున్నట్లు అవుతుంది.
-దానిమ్మ, బొప్పాయి, పుచ్చకాయ వంటి మందపాటి తొక్క ఉండే పండ్లను మాత్రం కచ్చితంగా ముక్కలుగా కోసుకుని తినాలి.
-కోసిన పండ్లను ఎప్పుడూ ఎక్కువసేపు గాలికి వదిలేయకండి. దీనివల్ల హానికరమైన బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. ఇకపై పండ్లను తినేటప్పుడు ఈ చిన్న మార్పులు చేసి, వాటి పూర్తి ప్రయోజనాలను పొందండి
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications