Latest Updates
-
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.!
ఎముకల బలహీనతకి కాల్షియం లోపం ఒక్కటే కారణమా.. ఈ అలవాట్లతో రిస్క్ తప్పదు.!
నేటి ఆధునిక జీవనశైలిలో మూడు పదుల వయసు నుంచే ఎముకల బలహీనత సమస్య మొదలవుతోంది. ఈ కారణంగా మోకాళ్ల నొప్పులు, మెట్లు ఎక్కలేకపోవడం, కింద కూర్చుని లేవలేకపోవడం వంటివాటితో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇందుకు కాల్షియం లోపం కారణం కావచ్చు. కానీ అదొక్కటే కారణం కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజువారీ అలవాట్లు కూడా ఎముకలను బలహీనపరుస్తున్నాయని చెబుతున్నారు.

ఒకప్పుడు వృద్ధులు మాత్రమే ఎముకల బలహీనత, మోకాళ్ల నొప్పుల సమస్యలను ఎదుర్కొనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. యుక్త వయసు నుంచే చాలా మంది ఈ సమస్యను అనుభవిస్తున్నారు. ఫలితంగా బలహీనత, అలసట వంటివి ఏర్పడి శారీరకంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఎముకల బలహీనతను కాల్షియం లోపం ఒక కారణమైనా.. ఇతర కారణాలు కూడా ప్రభావితం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారం, జీవనశైలి మార్పులు ఎముకల బలంపై ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. కేవలం కాల్షియంతో నిండిన ఆహారం తీసుకుంటే ఎముకల ఆరోగ్యం కుదుటపడదని అంటున్నారు.
శరీర భాగాల్లో ముఖ్యమైనవి ఎముకలు. బలంగా నిలబడటానికి, సులువుగా కదలికలు చేయడానికి, రోజువారీ పనుల కోసం ఎముకలు దృఢంగా ఉండటం అవసరం. అందుకే వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లేదంటే ఎముకల విరుగుళ్లు, పగుళ్లు లాంటి ప్రమాదాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే చిన్న వయసు నుంచే ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అందుకోసం సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లను పాటించాలని సూచిస్తున్నారు.

ఎముకల బలహీనత కేవలం కాల్షియం లోపం వల్ల మాత్రమే రాదని.. ఎక్కువ కాలం పాటు శారీరక శ్రమ లేకపోయినా.. వ్యాయామం చేయకపోయినా ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. ధూమపానం, అధికంగా మద్యం సేవించడం, విటమిన్ డి లోపం వల్ల శరీరం కాల్షియంను సరిగా గ్రహించలేవు. ఈ కారణంగా ఎముకల ఆరోగ్యం ప్రభావితమవుతుంది.
అదేవిధంగా ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉండటం, ఎక్కువ కాలం పాటు అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం కూడా ఎముకలను బలహీనపరుస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత సహజంగా తగ్గుతుందని.. అందుకే ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచిస్తున్నారు. అదేవిధంగా కొన్ని వ్యాధులు, దీర్ఘకాలికంగా మందుల వాడకం కూడా ఎముకలను బలహీనపరుస్తాయని చెబుతున్నారు.
ఆరోగ్యకరమైన అలవాట్లు
శారీరక శ్రమ ద్వారా ఎముకలను దృఢంగా మార్చుకోవచ్చు. రోజూ కాసేపు నడక, మెట్లు ఎక్కడం, తేలికపాటి పరుగు, బరువులు మోసే వ్యాయామాల ద్వారా ఎముకలు బలోపేతం అవుతాయని నిపుణులు అంటున్నారు. ధూమపానం, అధికంగా మద్యం సేవించడాన్ని మానుకోవాలని సూచిస్తున్నారు. శరీర బరువు ఆరోగ్యకరంగా ఉండాలి. రోజూ ఉదయం, సాయంత్రం కాసేపు ఎండలో ఉండటం ద్వారా తగినంత విటమిన్ డి లభిస్తుంది. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయి.
ఆహారపు అలవాట్లు
ఎముకల ఆరోగ్యం కోసం మీ ఆహారంలో కాల్షియం, విటమిన్ డి ఉండే పదార్థాలను అధికంగా చేర్చుకోవాలి. పాలు, పెరుగు, జున్ను, ఆకుకూరలు, బాదం వాటిని పుష్కలంగా తీసుకోవాలి. సరైన మోతాదులో నీరు తాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. ఎక్కువ సేపు కూర్చోవడం కాసేపు నడవడం అలవాటు చేసుకోవాలి. ఇలా ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా దీర్ఘకాలికంగా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications