Latest Updates
-
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు!
పిల్లలకు జ్వరం వస్తే ఫస్ట్ ఏం చేయాలి? బెస్ట్ ఫీవర్ సిరప్ ఏది?
వాతావరణ పరిస్థితుల మార్పులు, ఇన్ఫెక్షన్లు ఇలా అనేక రకాల కారణాల వల్ల చిన్న పిల్లలకు జ్వరం వస్తుంటది. అయితే చిన్నపిల్లలకు జ్వరం రావడం తల్లిదండ్రులను పెద్ద ఆందోళన కలిగించే విషయం. తమ బిడ్డకు జ్వరం వస్తే హాస్పిటల్ కు పరుగులు తీస్తారు..కొందరు అయితే నా బిడ్డకు నయం అయితే దేవుడికి అది చేస్తా ఇది చేస్తా అని మొక్కుకోవడం కూడా మనం తరచుగా చూస్తుటాం. అయితే జ్వరం అనేది ఒక వ్యాధి కాదు..శరీరంలో ఇన్ఫెక్షన్ తో పోరాడుతున్నదనడానికి ఒక సంకేతం మాత్రమే. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లోనే జ్వరాన్ని సమర్థవంతంగా తగ్గించవచ్చు.
పిల్లలకు జ్వరం వస్తే మొదట ఏం చేయాలి
ఖమ్మంలోని ప్రసిద్ధ సన్ రైజ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కు చెందిన MD పీడియాట్రిక్స్, నియోనాటాలజిస్ట్ డాక్టర్ గౌతమ్..ఓ ఇన్ ప్టాగ్రామ్ వీడియో ద్వారా పిల్లలకు జ్వరం వస్తే ఏం చేయాలనే దానిపై కొన్ని కీలక సూచనలు చేశారు. డాక్టర్ గౌతమ్ చెప్పన ప్రకారం.. ఫీవర్ ని ఎప్పుడైనా ధర్మామీటర్ సంకలో పెట్టి కొలవాలి. టెంపరేచర్ 100f, అంతకన్నా ఎక్కువ ఉంటే జ్వరం ఉందని అనుకోవాలి. జ్వరం ఉంటే తక్షణమే డాక్టర్ సలహా మేరకు ఫీవర్ సిరప్ పట్టాలి.

అయితే ఫీవర్ సిరప్ పనిచేయడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఆలోపు బిడ్డకు ఉపశమనం కలిగించడానికి, శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి తడిగుడ్డతో జాగ్రత్తగా తుడవాలని డాక్టర్ గౌతమ్ సూచిస్తున్నారు. గోరువెచ్చని నీటిలో శుభ్రమైన, మెత్తటి గుడ్డను ముంచి నీటిని పిండి, నుదురు, మెడ, సంకలు, గజ్జల భాగాల్లో నెమ్మదిగా తుడవాలి. చల్ల నీరుని ఎప్పుడూ వాడకూడదు.
ఫీవర్ సిరప్ లలో ఏది బెస్ట్
మార్కెట్లో జ్వరం తగ్గించడానికి ప్రధానంగా మూడు రకాల సిరప్ లు అందుబాటులో ఉంటాయని డాక్టర్ గౌతమ్ చెప్పారు. అందులో మొదటిది పారాసెటమాల్(paracetamol), రెండోది ఐబూప్రోపిన్(ibuprofen), మూడోది మెఫనమిక్ యాసిడ్(mefenamic acid) అని డాక్టర్ గౌతమ్ చెప్పారు.
-అయితే వీటిల్లో ఎప్పుడైనా ఫస్ట్ ఛాయిస్ పారాసెటమాల్ అని డాక్టర్ గౌతమ్ చెప్పారు. ఎందుకంటే ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు సేఫ్ గా వాడొచ్చు.దీనివల్ల దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి. పారాసెటమాల్ మోతాదు ఎప్పుడూ పిల్లల వయసుపై కాకుండా వారి బరువుపై ఆధారపడి ఉంటుంది. ప్రతి 4-6 గంటలకు ఒకసారి, సరైన మోతాదులో మాత్రమే ఇవ్వాలి.
-సెకండ్ ఛాయిస్ ఐబూప్రోపెన్.. పారాసెటమాల్ తో జ్వరం తగ్గనప్పుడు లేదా జ్వరంతో పాటు చెవి నొప్పి,పంటి నొప్పి వంటి పెయిన్స్ ఉంటే ఐబూప్రోపెన్ బెస్ట్ ఆప్షన్. దీనిని వాడటం వల్ల జ్వరంతో పాటు నొప్పి కూడా తగ్గుతుంది. అయితే దీనిని ఖాళీ కడుపుతో కాకుండా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత ఇవ్వడం మంచిది.
-థర్డ్ ఛాయిస్ మెఫనమిక్ యాసిడ్ ..ఇది బాగా పనిచేస్తుంది కానీ దీనివల్ల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఎక్కవగా ఉంటాయి. అందువల్ల పారాసెటమాల్, ఐబూప్రోపెన్ తో ఫీవర్ తగ్గకపోతే డాక్టర్ ని సంప్రదించి మెఫనమిక్ యాసిడ్ వాడాలని గౌతమ్ చెప్పారు.
ఈ విషయాలు గుర్తుంచుకోడి
లూస్ గా ఉన్న బట్టలు పిల్లలకు వేయాలి, పిల్లలను బట్టలో పూర్తిగా కప్పరాదు
పిల్లలు డీహైడ్రేట్ కాకుండా ద్రవపదార్థాలు ఎక్కువగా ఇవ్వాలి.
జ్వరం 102 F కన్నా ఎక్కవ 2 రోజుల కన్నా ఎక్కువ ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











